AMMA

AMMA Loves to all & Servce all
@[400557740015727:17]

22/03/2018

మాతృదేవోభవ...!

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...
08/03/2018

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...

 #విశ్వమాత  #మదర్‌_థెరిసాఅమ్మ అందరికి వుంటుంది. ఆకలి వున్నప్పడు అన్నం పెట్టేది… అనారోగ్యంతో వున్నపుడు సేవ చేసేది… ఏడుస్త...
14/10/2017

#విశ్వమాత #మదర్‌_థెరిసా

అమ్మ అందరికి వుంటుంది. ఆకలి వున్నప్పడు అన్నం పెట్టేది… అనారోగ్యంతో వున్నపుడు సేవ చేసేది… ఏడుస్తుంటే ఓదార్చేది అమ్మ. నాకు దేవుడు లేడు అని చేప్పేవారుంటారేమో గాని నాకు అమ్మ లేదని చేప్పేవారుండరు. ఒక్కరికి ఒక అమ్మే ఉంటుంది. అరుతే యావత్ప్రంచానికీ అమ్మగా ఎందరో దీనులకు సేవ చేస్తున్న తల్లి, విశ్వమాత మదర్‌ థెరీసా మాతృదేవోభవ అని, తల్లి దైవంతో సమానమని, తల్లిని పూజించవలెనని చెబుతారు. మాతృమూర్తి లాంటి మదర్‌ థెరీసా దారిద్య్రంలో మగ్గుతున్న వారిని దరిచేర్చి కాపాడుతుంది. అన్నార్తులకు అన్నం పెడుతుంది. రోగపీడితులకు మందులిచ్చి రక్షిస్తుంది, మరణ శయ్యపై వున్న వారికి నువ్వు దైవ సన్నిధికి వెళుతున్నావు. దిగులు పడకు, బాధపడకు, ప్రశాంతంగా వుండు అని ధైర్యం చెబుతుంది.

మాకు తోడుగా నీడగా నేనున్నాను అని నిండుగా నవ్వుతూ పలుకుతుంది. ఆకలి గొన్న వాడికి అన్నం పెడదాము, బట్టలు లేని భగవంతునికి బట్టలిద్దాము, ఆర్తితో పిలిచే భగవానునికి సేవ చేద్దాం అంటూ దుఃఖ పీఢితులు, రోగ బాధితులు, అన్నం కోసం అలమటించే వారిలో దైవాన్ని చూడగలిగిన మహనీయురాలు మదర్‌ థెరీసా. 1910 ఆగస్టు 27వ తేదీన యుగోస్లేవియాలో స్కోప్జేలో అల్బేనియన్‌ దంపతులైన నికోలస్‌ బొజాక్ష్యు, డ్రనఫైల్‌ బెర్నైలకు థెరీసా జన్మించింది. వారు రోమన్‌ కేథలిక్‌ మతస్ధులు. థెరిసా తల్లి దండ్రులకు ముగ్గురు సంతానం. థెరీసా అసలు పేరు ఆగ్నెస్‌ గోన్క్సా బొజాక్ష్యు.

అనగా పుష్పపు మొగ్గ అని అర్ధం. తండ్రి దైవభక్తి, ధర్మబుద్ధి కలవాడు. తల్లి దేవుని పట్ల ఎంతో విశ్వాసం గలది. తన పిల్లలను దైవసేవా తత్పరులు, ఎంతో భక్తి ప్రపత్తులు గలవారిగా తీర్చిదిద్దింది. తొమ్మిదేళ్ళ వయస్సులో ఆగ్నెస్‌ తండ్రి మరణించాడు. తల్లి కష్టపడి పిల్లలను చదివించింది. ఆగ్నెస్‌ సేవాగుణం చిన్న వయస్సులోనే అందరిని ఆశ్చర్యపరచింది. ఒకరోజు పాఠశాలకు ఆలస్యంగా ఎందుకు వచ్చావని ఉపాధ్యాయుడు ప్రశ్నించినపుడు, ఒక ముసలి వాడు జ్వరంతో స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోతే ఆయనను ఆసుపత్రిలో చేర్పించి వస్తున్నానని ఆగ్నెస్‌ ఇచ్చిన సమాధానానికి ఉపాధ్యాయిని మనసు ఆనందంతో నిండి పోయింది. థెరీసా తన బాల్య జీవితం గురించి రెండు విషయాలు ఎల్లప్పుడు గుర్తు చేసుకుంటారు.

ఒక రోజు ఆగ్నెస్‌ తన స్నేహితులతో అనవసర సంభాషణలతో కాలం వ్యర్ధం చేస్తున్నప్పుడు తల్లి విద్యుద్దీపాన్ని ఆర్పివేసింది. కారణమేమని అడిగిన థెరిసాకు అనవసర సంభాషణలకు కరెంటు వృధా చెయ్యకూడదని ఆమె సమాధానమిచ్చింది. మరోసారి కుమార్తెను ఒక బుట్టనిండా ఆపిల్‌ పళ్ళు తీసుకురమ్మని చెప్పి వాటిలో ఒక చెడిపోరున యాపిల్‌ పండు వుంచమని చెప్పింది. కొద్ది రోజుల తరువాత వాటిని చూడమని ఆగ్నెస్‌ ను ఆదేశించింది. ఆ బుట్టలో పళ్ళన్ని పాడవడంచూసిన ఆగ్నెస్‌ నిశ్చేష్టురాలైంది. ఒక చెడ్డ వారిని బట్టి ఎందరో మంచివారు కూడా పాడవుతారనే పాఠం ఆగ్నెస్‌ ఎన్నడు మరువలేదు.

యుగోస్లేవియాకు చెందిన జెసూట్‌ భారతదేశానికి మత ప్రచారం కోసం వచ్చి కలకత్తా నగరంలో నిరుపేదలకు సేవలు చేస్తున్న విషయం ఆగ్నెస్‌ దృష్టికి వచ్చింది. వారిలాగే తన జీవితాన్ని కూడా మానవసేవకు సమర్పించాలని, నన్‌గా మారాలని నిర్ణరుంచుకుంది ఆగ్నెస్‌. 18 ఏళ్ల వయసులో 1928 సెప్టెంబరులో ఐర్లండులోని డబ్లిన్‌ లారెట్‌ బీ (ఆగ్నెస్‌ ఆఫ్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ లొరెటో) సేవా కేంద్రంలో చేరింది. భారత దేశంలో సేవ చేయాలన్న దృక్పధం కల్గి వున్న ఆగెస్‌ 1929 సంవత్సరం జనవరి లోకలకత్తా చేరుకుంది. 1931 మార్చి 24న లొరెటా సిస్టర్‌గా ఆమె ప్రమాణ స్వీకారం చేసింది.

విథేయతతో, పేదరికంలో పవిత్రంగా జీవించడానికి ప్రమాణం చేసింధి. ఆ తరువాత ఒక ఫ్రెంచినన్‌, థెరిసా, మార్టిన్‌ సేవలతో ప్రేరణ పొంది థెరిసాగా మారారు. ఎన్నో కఠిన నియమాలతో, క్రమ శిక్షణ కల్గిన జీవన మార్గంలో ప్రయాణానికి థెరిసా ఎన్నడు భయపడలేదు. ఆమెకు ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో కలకత్తాలోని సెంట్‌ మేరి ఉన్నత పాఠశాలలో కొన్నేళ్ళు భూగోళ శాస్త్రాన్ని వోధించి ఆ తరువాత అదే పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పని చేశారు. 1946 సెప్టెంబరు 10వ తేదీన డార్జిలింగు రైలులో వెళుతుండగా దేవుని పిలుపు ఆమెకు వినవచ్చింది. దుర్గంధంతో నిండిపోరున మురికివాడల్లోని దీనాతి దీనులైన పేద ప్రజలకు సేవ చేయాలన్నదే ఆ పిలుపు. ఈ పిలుపులో దేవుని ఆదేశం వున్నది.

దేవుడి తన నుంచి ఇంకా ఏదో సేవను కోరుచున్నాడు. నిరుపేదలైన ప్రజలకు సేవ చేయడం ద్వారా వారిలో దేవుని చూచి ప్రేమించాలి అని థెరిసా తలచారు. ఆ ప్రకారమే మురికివాడలలో మ్రగ్గుతూ పేదరికంలో ఉన్న ప్రజలకు సేవ చేయాలని థెరిసా తలచారు. కాన్వెంటు వదిలి కలకత్తా మురికివాడలో సేవ చేయడానికి మదర్‌ సుపీరియర్‌ నుండి, లొరేటా ఆర్డరు నుండి, రోమ్‌ నుండి థెరిసాకు అనుసతి లభించింది. 1950 అకోబరు 7వ తేదీ మానవజాతికే మంచిరోజు. దేవుని పిలుపునందుకున్నదే తడవుగా కరుణామరు థెరిసా, దీనాతి ప్రజలకు సేవ చేస్తూ, కలకత్తావాసులకు, యావత్‌ ప్రపంచానికీ అమ్మ కాగలిగారు.

విశ్వమాతగా పేరొంది కోట్లాది ప్రజల హృదయాల్లో సుస్ధిర స్తానాన్ని పొందారు. ఇదంతా ఒక్క రోజులో సాధించిన విజయం కాదు. అంచెలంచెలుగా ఒక్కోక్క మెట్టు ఎక్కుతూ, తన సేవా పరిధిని పెంచుకుంటూ మున్ముందుకు ప్రయాణం సాగించింది. 1948 డిసెంబరు 21వ తేదీన కలకత్తాలోని మోతిజ్‌ హిల్‌ మురికివాడలలో ఒక పాఠశాలను స్ధాపించింది. మురికివాడలలో పిల్లలందరూ పాఠశాలకు రావడం మొదలు పెట్టారు. మొదట్లో కుర్చీలుగాని, బెంచీలు గాని బల్లలు గాని ఆ పాఠశాలలో లేవు. నేలమీదే వ్రాసేవారు. ప్రధమంగా వారితో కలిసి పని చేందుకు సుభాషిణి దాస్‌ను నియమించారు. ఆమె సిస్టర్‌ ఆగ్నెస్‌గా పేరొంది ధెరిసాకు కుడి భుజంగా నిలిచింది. 1950లో మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీని కలకత్తాలో స్ధాపించారు.


మైకేల్‌ గోమ్స్‌ అనే వ్యక్తి ఆమెకు కావలసిన వసతి సమకూర్చారు. 1952లో కలకత్తాలో ఒక వీధిలో భోరున వర్షం కురుస్తున్న రోజున నేలపైబడి మృత్యవుతో పోరాడుతున్న ఒక స్త్రీని థెరిసా చూశారు. వెంటనే ఆమెను చేతులతో ఆమెను ఎత్తుకుని సమీపంలోని ఇంటి వరండాలోకి చేర్చారు. ఆ స్త్రీ థెరిసా చేతులలోనే ప్రాణాలను విడిచింది. అరుతే చనిపోయే ముందు ఆ స్త్రీ పెదాలపై ఒక చిరునవ్వు మెదిలింది. ఆఖరి క్షణాల్లో తనను రక్షించే ఒక వ్యక్తి వున్నారని తృప్తితో చనిపోరుంది. ఈ సంఘటన నిర్మల్‌ హృదయ ఏర్పాటుకు థెరిసాకు ఎంతో ప్రేరణను కల్గించింది. మృత్యువుకి చేరువవుతున్న వారికి ఆశ్రయం ఇవ్వడం కోసం కలకత్తాలో ఒక ఇల్లు ఇమ్మని అధికారులను కోరారు. వారు కాళీమాత ఆలయం దరిలో కాళీబారీలోని ఇంటిని ఇచ్చారు.

ఆ ఇంటికే నిర్మల హృదయ్‌ అని పేరు పెట్టి దానినొక దేవాలయంగా చూసుకున్నారు. ప్రపంచంచే వెలివేయబడి వదిలి వేయబడిన అనాధలకు, ఆర్తులకు నిర్మల్‌ హృదయ్‌లోని సిస్టర్స్‌ ఆశ్రయమిచ్చి ఆదరిస్తారు. విడిచి పెట్టబడిన దిక్కులేని పిల్లల కోసం థెరిసా నిర్మల శిశుభవన్‌ను స్ధాపించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆగ్రాలో బాలల శరణాలయాన్ని స్ధాపించినప్పుడు రూ. 50 వేలు అవసరమయ్యారు. అదే సమయంలో మెగసేసే అవార్డుకు మదర్‌ థెరిసాను ఎంపిక చేసినట్లుగా థెరిసాకు ఫోన్‌లో సమాచారం అందింది. ఈ వార్తవిన్న ఆమె దేవుడు ఈ శరణాలయాన్ని కట్టాలని కోరుచున్నారని చెప్పారు. మదర్‌ థెరిసాకు ప్రేమే దైవం. సేవను నమ్ముతుంది. దేవుని పట్ల భక్తి, పేదలకు సేవ చేయడం ద్వారా చేతలతో చూపిస్తుంది.

మదర్‌ హౌస్‌లోని ఒక నల్లబల్లపై ప్రతిరోజు చేసే ప్రార్ధన ఇలా ఉంది. కుష్టు రోగుల కోసం మదర్‌ థెరిసా ప్రేమదాస్‌ అనే ఆశ్రమాన్ని కలకత్తాకు సమీపంలో స్ధాపించారు. కలకత్తాకు 200 కి.మీ.ల దూరంలో 30 ఎకరాల్లో కుష్టు రోగుల కోసం శాంతినగర్‌ను నిర్మించారు. నాలుగు వందల యాభై పైగా విద్యాసంస్ధలలో 400 సంచార ఆసుపత్రులను, 100 పోషకాహార కేంద్రాలను నడుపుతున్నారు. అనాధలకు, వికలాంగులకు, మృత్యముఖంలో వున్నవారికి, మత్తు మందులకు బానిసలైన వారికి, కుష్టువ్యాధి గ్రస్తులకు, ఎరుడ్స్‌ రోగులకు ఆశ్రయం కలిగిస్తున్నారు. ప్రపంచమంతా మదర్‌ సేవలను గుర్తించింది.

1962 ఏప్రిల్‌లో ప్రభుత్వం మదర్‌కు పద్మశ్రీ బిరుదునిచ్చి సత్కరించింది. అదే సంవత్సరం ఆగష్టు నెలలో ఫిలిఫైన్స్‌ ప్రభుత్వం రామస్‌ మెగసేసే అవార్డునిచ్చి సత్కరించింది. 1970 సెప్టెంబరులో ఆమె నిస్వార్ధ సేవను గుర్తించి గుడ్‌ సెమేరిటన్‌ అవార్డును అమెరికా అందచేసి పేదవారిని గౌరవించినట్లు భావించింది. 1971 జనవరిలో పోప్‌ జాన్‌ 23వ శాంతి బహుమతులు పోప్‌ జాన్‌ అందజేశారు. 1972లో జవహర్‌ లాల్‌ నెహు అవార్డు ఫర్‌ ఇంటరేషనల్‌ అండర్‌ స్టాండింగ్‌ 1973 మతంలో అభివృద్ధిని సాధించినందులకు గాను టెంపుల్‌ టన్‌ అవార్డును ఇంగ్లండ్‌కు చెందిన ఫిలిప్‌ రాకుమారుడు ప్రదానం చేశారు.

1974లో మ్యాటర్‌ ఎట్‌ మెజిస్ట్రా అవార్డును అమెరికాలో ప్రదానం చేశారు. 1970వ సంవత్సరంలో సమాజ సేవకు అత్యంత ప్రతిష్టాకరమైన నోబుల్‌ శాంతి బహుమతికి థెరిసాకు ప్రకటించారు. మన దేశం అందించే అత్యున్యత పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ నీలం సంజీవరెడ్డి మదర్‌కు అందచేశారు. ఐక్యరాజ్య సమితి విభాగమైన ప్రపంచ ఆహార సంస్ధ, ఆకలినిపారద్రోలడానికి పని చేసిన వారికిచ్చే సెరెస్‌ మెడల్‌ను థెరిసాకు ప్రదానం చేశారు. 1983 నవంబరు 23ల బ్రిటీష్‌ రాణి రెండవ ఎలిజబత్‌ మదర్‌కు ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డును ప్రదానం చేశారు.

భారత్‌కి సుపుత్రి అవార్డును కూడా ఆమె అందుకున్నారు. ఆమె జీవితాంతం అహర్నిశలు పేదల కోసం దుఃఖార్తుల కోసం విద్యార్ధి సేవ చేసి ప్రపంచంలోని ప్రజలంతా ఆమెను మానవతా మూర్తిగా దైవాంశ సంభూతురాలిగా అభివర్ణించారు. 1983లో పోప్‌ జాన్‌ పాల్‌ 2 సందర్శనార్ధం మదర్‌ థెరీసా రోమ్‌ వెళ్ళినప్పుడు గుండెపోటుకు గురయ్యారు. 1989లో రెండవసారి గుండెపోటుకు గురైనపుడు ఆమెకు కృత్రిమ పేస్‌ మేకర్‌ను అమర్చారు. 1991లో మెక్సికోలో న్యుమోనియాతో పోరాడుతున్నపుడు ఆమె మరిన్ని హృదయ సమస్యలను ఎదుర్కున్నారు. మిషనరీస్‌ అఫ్‌ ఛారిటీ అధినేత పదవికి ఆమె తన రాజీనామాను సమర్పించారు. కానీ సంస్థలోని సన్యాసినులు రహస్య ఎన్నిక ద్వారా ఆమె కొనసాగాలని కోరారు.

సంస్థ అధిపతిగా కొనసాగడానికి మదర్‌ థెరీసా అంగీకరించారు. ఏప్రిల్‌ 1996లో మదర్‌ థెరీసా క్రిందపడటం వలన ఆమె మెడ ఎముక విరిగింది. ఆగస్టులో ఆమె మలేరియాతో బాధపడటంతో పాటు గుండె ఎడమ భాగంలోని జఠరిక (గుండె) పనిచేయడం మానివేసింది. అప్పట్లో ఆమెకు గుండె శస్త్ర చికిత్స జరిగింది, కానీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్న విషయం వెల్లడైంది. తాను అనారోగ్యం పాలైనపుడు తన వైద్యశాలలలో ఏదో ఒక దానిలో చికిత్స పొందకుండా కాలిఫోర్నియాలో అన్ని హంగులతో కూడిన వైద్యశాలను ఎంచుకొనడం వివాదాలకు దారితీసింది. మార్చ్‌ 13, 1997న ఆమె మిషనరీస్‌ అఫ్‌ ఛారిటీ అధినేత పదవి నుండి వైదొలిగారు, సెప్టెంబర్‌ 5, 1997న మరణించారు.

మదర్‌ థెరీసాకు మొదటి సారి హృదయ సంబంధ సమస్యలు ఎదురైనపుడు తాను, ఆమె దెయ్యం దాడికి గురైందని భావించి దెయ్యాన్ని వదలగొట్టడానికి ఆమె అనుమతితో ఒక ఆచార్యుని ఆజ్ఞాపించినట్లు కలకత్తా ఆర్చ్‌ బిషప్‌ హెన్రీ సెబాస్టియన్‌ డి’సౌజా చెప్పారు. ఆమె చనిపోయే నాటికి మదర్‌ థెరీసా మిషనరీస్‌ అఫ్‌ ఛారిటీ 4,000 సన్యాసినులు, 300 మంది అనుబంధ సోదర సభ్యులు, 100,000 పైగా సాధారణ కార్యకర్తలను కలిగి, 123 దేశాలలో 610 శాఖలను కలిగి ఉంది. వీటిలో ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారి సంరక్షణ గృహాలు, హెచ్‌ఐవి/ఎరుడ్స్‌, కుష్టు వ్యాధి, క్షయ రోగులకు ఆవాసాలు, ఆహార కేంద్రాలు, అనాధ శరణాలయాలు, పాఠశాలలు ఉన్నారు.



I'M SOCIAL Media
Facebook latest news and updates.
4r Like [email protected]" rel="ugc" target="_blank">[email protected]
THANKS

31/08/2017
👉http://facebook.com/indianservices
02/06/2017

👉http://facebook.com/indianservices

మనం క్షేమంగా ఉండాలని... ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ రక్షణ కోసం పోరాడిన సైనికులరా మీకు నా వందనాలు...
జై భారత్....జై జవాన్

14/05/2017

రోజులు మారుతున్నాయి అంటే ఏమో అనుకున్న...
"Mother's Day" అనగానే ఉన్నోడు, లెనోడు, కులం, మతం, అనే తేడా లేకుండా అందరూ POST లు బాగానే పెడుతున్నారు.... కానీ గుండెల్లో లేని ప్రేమ పోస్ట్ లో పెట్టడానికి సిగ్గుపడండి... తెల్లోడు పెట్టిన MOTHER'S_DAY కి న్యాయం చేస్తున్నారు... కానీ నవమాసాలు మోసిన తల్లి ఇన్ని రోజులు గుర్తుకు లేదా..??? తొమ్మిది నెలల కష్టం సంవత్సరానికి ఈ ఒక్కరోజు కోసమేనా....
అమ్మ ప్రేమను పోస్ట్ లో పెట్టి అమ్మేస్తున్నారు కదరా...
ఈ కస్థాంత ప్రేమైన మీ అమ్మ పైన చూపెట్టండి...
5నిమిషాలైన ఆనందిస్తుంది...
పోస్ట్ పెట్టి మీరు సాధించింది ఎం ఉండదు..
మహా అయితే Like లు comment's తప్ప చూస్కోడానికి ఏం ఉండదు...
★ప్రేమించండి కానీ ప్రేమించినట్టు నటించకండి...
దయచేసి
★తల్లిదండ్రులు తల దించుకునే పనులు చేయకండి
★గర్వించదగ్గ పనులు చేయండి అందరి ఆశీస్సులు పొందండి
👉భారత్ మాత అనుగ్రహముతో
✊జైహింద్🙋

04/11/2016

Let's be SELUTE ALL MOTHERS
I'm Proud to be INDIAN

ప్రాణం పోసేది కన్నతల్లి అయితే ప్రాణం తీసేది అభిమానం అని ప్రశాంత్ మరోసారి రుజువు చేసాడు
24/10/2016

ప్రాణం పోసేది కన్నతల్లి అయితే ప్రాణం తీసేది అభిమానం అని ప్రశాంత్ మరోసారి రుజువు చేసాడు

21/10/2016

Significance of Telugu Marriage !
( హిందూ సాంప్రదాయం పెళ్లి ప్రాముఖ్యత !!! )
అందరూ చదవండి
మీకు నచ్చితే షేర్ చెయ్యండి

AMMA I♡U
26/06/2016

AMMA I♡U

19/06/2016
13/06/2016

ఇండియాలో మొట్టమొదటిసారి హర్లెకిన్ బేబీ జన్మించింది. మహారాష్ట్రలోని వాడి పట్టణానికి చెందిన ఓ మహిళ హర్లెకిన్ బేబీకి జన్మనిచ్చింది. చర్మంలోని పైపొర లేకుండా, చెవులు అసలే లేకుండా, కళ్లు, పెదవులు బయటకు క…

Address

Karimnagar

Alerts

Be the first to know and let us send you an email when AMMA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share