28/10/2024
సైబర్ ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి కదా ?
ఆ నెంబర్ కి తిరిగీ కాల్ చెయ్యండి .
నెంబర్ పని చేయదు .
అంటే వారు మనకి కాల్ చెయ్యొచ్చు .
కానీ తిరిగీ మనం ఆ నెంబర్ కు కాల్ చేయలేము .
ఇది ఎలా సాధ్యం ?
చాలా సార్లు ఎవరో నెంబర్ తో మనకు కాల్ చేస్తారు .
ఉదారణకు ఎక్కడో రాజస్థాన్ లో కూర్చున్న సైబర్ నేరస్తుడు మీ నెంబర్ తో నాకు కాల్ చెయ్యొచ్చు . నేను తిరిగీ కాల్ చేస్తే .. "అయ్యో నేను చేయలేదు" అని మీరంటారు .
ఇదే పద్దతిలో మన నెంబర్ ను వుపయోగించి ... విమానానికో, రైలుకో బాంబు బెదిరింపు కాల్ చేస్తే ? పోలీస్ స్టేషన్ చుట్టూ మనం తిరగాలి.
కరోనా తరువాత .. ప్రభుత్వాలు ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించాయి .
కరోనా ప్రవేశ పెట్టిన లక్షాల్లో ఇదొకటి అంటే మీరు నమ్మరు .
సరే... ఆన్లైన్ చెల్లింపుల వల్ల ప్రభుత్వాలకు టాక్స్ రాబడి పెరిగింది .
జనాలకు చెల్లింపులు సులభ తరం అయ్యాయి .
అక్కడి దాక బాగానే వుంది .
మరి ఫ్రాడ్ల సంగతి ?
ఒకప్పుడైతే నైజీరియా అనే ఆఫ్రికా దేశం . ఇప్పుడు కంబోడియా లాంటి అనేక దేశాలకు ఈ సైబర్ నేరాలు పెద్ద ఆదాయ వనరుగా మారాయి .
కొన్ని వేలమంది భారతీయ యువతీ యువకుల్ని ఉద్యోగాల పేరుతొ వలవేసి బానిసలుగా మార్చి ఈ సైబర్ నేరాలు చేయిస్తున్నారు .
నియంత్రణ వ్యవస్థలు నిద్దరోతున్నాయి .
ఇక్కడి ప్రభుత్వాలు దీని గురించి పెద్దగా ఎలాంటి చర్యలు చేపట్టవు.
లక్షల కోట్ల సంపద ఆన్లైన్ నేరాలు , ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల తరలి పోతోంది .
ఈ వ్యాపారం లో కూడా చైనా వాడు ముందున్నాడు .
వాడి ముందు చూపు ఒక లెవెల్లో ఉంటుంది
ఇది ఇలా ఉంటే కొంతమంది స్టార్ ఆసుపత్రుల.. బంట్రోతులు .. అవునండీ వీరిని గతం లో డాక్టర్ లు అనేవారు . ఇప్పుడు డాక్టర్ లు తగ్గిపోయారు . అందరూ ప్రైవేట్ ఆసుపత్రుల ఉద్యోగులు అని సాక్షాత్తూ మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా అధ్యక్షుడే చెప్పాడు .
ఉద్యోగులు అనడం కంటే బంట్రోతులు అనడమే బాగుంటుంది అని నా మాట .
ఈ బంట్రోతులు కొంతమంది పిల్లల మొబైల్ వ్యసనం గురించి మాట్లాడుతూ స్క్రీన్ టైం పై నియంత్రణ ఉండాలి అని మీడియా కు చెబుతున్నారు .
ఎట్టెట్టా ? స్క్రీన్ టైం పై నియంత్రణ ఉండాలా? 18 ఏళ్ళు లోపు వారు మద్యం తాగకూడదు అని నిబంధన .
అంతే కానీ ఏదో ఓక్ పెగ్గో 90 మిల్లి కో నియంత్రణ ఉండాలి అని చెప్పలేదుగా ?
ఎందుకు .
మెడికల్ పుస్తకాల్లో చదవలేదా?
లేక... ప్రైవేట్ ఆసుపత్రుల కమిషన్ మత్తు లో మరచితిరా ?
పిల్లల్లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అభివృద్ధి చెందివుండదు . దాని వల్ల ఒక దానికి అలవాటు అయితే వదలలేరు .
స్వీయ నియంత్రణ ఉండదు .
పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వొద్దు అని చెప్పాలి .
కానీ మీరు చెప్పరు.
ప్రభుత్వాలు పట్టించుకోవు .
ఎందుకంటే నిజంగా పిల్లలందరూ సెల్ ఫోన్ వాడడం మానేస్తే సెల్ ఫోన్ అమ్మకాలు... డేటా బిజినెస్ .. ఆన్లైన్ బెట్టింగ్ లాంటివి ఇప్పుడున్నదానిలో... ఇరవై శాతానికి పడిపోతాయి .
కాబట్టి మీరు నిజాలు చెప్పరు .
సన్నాయి నొక్కులు... నొక్కుతూనే వుంటారు .
ఇంకో విషయం . స్కూల్ లో తోటి పిల్లలు, ఏమి చేస్తే మన పిల్లలలు కూడా అదే చేస్తారు .
స్కూల్ లో తోటి పిలల్లు" ఆ గేమ్ .. ఈ పోర్న్ వీడియో" అని డిస్కస్ చేస్తుంటే... మనింటి బంగారం ఊరకుండదు .
స్కూల్ స్థాయిలో సెల్ ఫోన్ నిషేధించాలి .
కళ్లుండి చూడలేని వారికి మా స్కూల్ కు ఆహ్వానం .
నూటికి తొంబై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం విజయం సాధించాము .
ఆ మిగతా ఒకటి రెండు కేసులు - తల్లితండ్రులు మాకు తెలియకుండా పిలల్లకు సెల్ ఫోన్ లిస్తున్నారు .
వెదికి పట్టి నిరాదాక్షిణ్యంగా టీసీ లు ఇచ్చేస్తాము .
వివాహ పూర్వ లైంగిక సంబంధాలు , బహుళ లైంగిక సంబంధాలు , ధూమపానం , మధ్య పానం , నీలి చిత్రాల వీక్షణ , డ్రగ్స్ , గంజాయి , హింస , బలాత్కారం , శాడిజం , గ్యాంబ్లింగ్ , బుల్లియింగ్ , చిరాకు , అసహనం , నిద్రలేమి , ఏకాగ్రత లోపం , చదువు చట్టుబండలు కావడం ..{ అన్నట్టు ఒక దిక్కు మాలిన ప్రభుత్వం పాస్ మార్కు లు 35 నుంచి ఇరవై కి తగ్గించేసింది . ఎదవ మొగమాటం కాకపోతే .. మీరు .. ఇరవై ఎందుకు ? ఇక పై ప్రతి ఏటా కరోనా పాస్ .. మీరు స్కూల్ లో ఇంట్లో మైబైల్ లో గేములు ఆడుతూ వయసుకు మించి పనులు చేస్తూ బతకండి అని చెప్పొచ్చుగా .. }.... ఇదండీ .. నేటి బడుల లోకం .
ఆవులు .. ఎడ్లు... చేలో మేస్తుంటే దూడలు గట్టునే ఎలా మేస్తాయి ?
అమ్మ నాన్న మొబైల్ బానిసలు.
ఒక పక్క స్టార్ ఆసుపత్రులను... మరో పక్క ఇంటర్నేషనల్ బడులను కొనుగోలు చేస్తున్న విదేశీ కంపెనీ లు .
వారికి కావలసింది వ్యాపారం . ప్రతి ఒక్కడి రక్తం పీల్చేస్తున్నారు .
ఉచిత ఆరోగ్య పరీక్షలు- స్టార్ ఆసుపత్రులు ,
ఉచిత టాలెంట్ టెస్ట్ లు - విద్యా సంస్థలు .
బకరాలను పట్టడానికి వేసే గాలాలు.
చూస్తూ వుండండి . జనవరి లోగా లక్షల మంది పడుతారు.
మా వాడి మెరిట్ కు మెచ్చి ఫిట్టింగ్ జీ వాడు డెబ్భై శాతం ఫీజు తగ్గించారు అని మురిసిపోతారు .
నాలుగు రెట్లు పెంచి కొంత తగ్గించడం అనే మర్మం .. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగడానికి సిద్ధమయి పోయే ఈ వెర్రి బ్యాచ్ కు అర్థం కాదు .
అదండీ నేటి లోకం . దోచుకున్నోడికి దోచుకొన్నంత .
సైబర్ ఫ్రాడ్ .. రీల్స్ చెయ్యడం .. స్టార్ ఆసుపత్రులకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కు అడ్మిషన్స్ తెచ్చిపెట్టడం.. గంజాయి డ్రగ్స్ స్మగ్గ్లింగ్ .. నీలి చిత్రాల్లో నటించడం .. నేటి పెద్ద పెద్ద స్వయం ఉపాధి పధకాలు
శుభోదయం
Facebook post by
Amarnath Vasireddy