15/09/2026
అమెరికా మహానగరంలో డాక్టర్ పెరియాల రవీందర్ రావుకు ఘన స్వాగతం.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పెరియాల రవీందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. భారతదేశం నుండి టెక్సాస్ లోని డల్లాస్ నగరం వచ్చిన సందర్భంగా టెక్సాస్ రాష్ట్రంలో కిమ్స్ పూర్వ విద్యార్థుల ఇంచార్జ్ గుడి విష్ణువర్ధన్ రెడ్డి మరియు వైఎస్ఆర్సిపి ఇన్చార్జి నాయకులు రమణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ పి రవీందర్ రావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ కలిసిమెలిసి ఉండాలని, అమెరికా అభివృద్ధితో పాటు మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అదేవిధంగా మన భారతదేశానికి ఏదో ఒక విధంగా సేవలు అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కన్న తల్లిదండ్రులను మరియు కన్నతల్లి లాంటి మన మాతృదేశాన్ని మరవకుండా సాధ్యమైనంత మేరకు సేవలు అందించాలని కోరారు. ఈ రెండు దేశాల అభివృద్ధి మీలాంటి యువత మీదనే ఆధారపడి ఉన్నందున కష్టపడి ఇష్టంగా మనస్ఫూర్తిగా సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పోషించి ఈ దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఇక్కడికి పంపిన సందర్భంగా వారి కష్టాన్ని గుర్తించి వారిని మరవకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వారి బాగోగులను తప్పకుండా చూడాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో కిమ్స్ పూర్వ అధ్యాపకుల అధ్యక్షులు బత్తిని గంగాధర్, బీఆర్ఎస్ పార్టీ సభ్యులు సూర్య ప్రకాష్, వేల్పూరీ అజయ్, ఇంకా శ్రీకాంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ రంగం, కొండూరి సుమన్, ముప్పాల శరత్ ఫైనాన్షియల్ అడ్వైజర్, శరత్ రెడ్డి దేశీ చౌరస్తా ఫౌండర్ శేషావతారం, సునీల్ బ్రిస్టా రెస్టారెంట్, చిన్నోజ్వల ఆదిత్య బ్రిస్టారిస్టారెంట్ ఫౌండర్, అజయ్ కలువాల ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు 250 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.