30/05/2018
ధర్మారం గ్రామ పంచాయతీ గతంలో బొమ్మారెడ్డిపల్లె రెవెన్యూ గ్రామపంచాయతికి అనుబందంగా ఉండేది. పరిపాలన సౌలభ్యం కోసం మండలాల విభజన జరిగినప్పుడు ధర్మారం మండలం ఏర్పడి, మండల కేంద్రమైన ధర్మారం ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది..
ధర్మారం మండల కేంద్రం చుట్టూ దాదాపు 30 గ్రామాల ప్రజలకు రాకపోకలకు సౌలభ్యంగా ఉండటంతో క్రమేణా ఇక్కడ వ్యాపార, వాణిజ్యం పుంజుకుంది. నూతన బస్టాండు నిర్మాణం మరియు 7వ నంబరు రాష్ట్ర రహదారి నిర్మాణం తో ధర్మారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం గణనీయంగా పెరిగి చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి ధర్మారంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు.
ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటు చేయడంతో వేలమంది విధ్యార్థులు ప్రతిరోజూ ధర్మారంకి రాకపోకలు సాగిస్తున్నారు. జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. వాణిజ్యం పెరగడంతో చాలామందికి ఉపాది లభిస్తుంది.
గతంలో కరీంనగర్ జిల్లాలో భాగమైన ధర్మారం జిల్లాల విభజనతో పెద్దపల్లి జిల్లాలో భాగమైంది. నియోజకవర్గ పునర్విభజనకు ముందు మేడారం నియోజకవర్గంలో ఉన్న ధర్మారం నేడు ధర్మపురి నియోజకవర్గంలో ఉంది.