19/02/2025
నరహంతక నక్సలైట్లను ఎదిరించి అసువులు బాసిన
జాతీయ విప్లవ వీరులు రామన్న, గోపన్న వర్ధంతి నేడు......
భరతమాత చరణకమలాల పై తమ జీవన పుష్పాలను ఉంచి మాతృభూమికి అర్పించిన వీరుల గాధలు మనల్ని రోమాంచితం చేస్తాయి. వారి పేర్లను విన్న, వారి చరిత్ర చదివినా ఒళ్ళు పులకించిపోతుంది..వారి త్యాగం మనందరినీ లక్ష్యం వైపు నడిపిస్తుంది, ప్రేరేపిస్తుంది. నూనూగు మీసాలు అయినా మొలవని యువకులు భారత్ మాతాకీ జై, ఏబీవీపీ జిందాబాద్
అంటూ పిరికిపందల తుపాకి గుండ్లకు తమ గుండెలను
అడ్డుపెట్టి తల్లి పాదాలను తమ రక్తంతో అభిషేకించిన వీర
కిశోరాలు నడయాడిన గడ్డ ఇది.
వారి రక్తం నేలపై చిందడంతో ఈ మట్టి పులకించింది. ఆ నేల ఇంకిన ప్రతి రక్తపు చుక్కలోని కణం కణం నుండి మీ రక్తం వృధా కాదు మీ ఆశయం ఆగిపోదు అంటూ
నినదిస్తూ వేలాదిగా పుట్టుకొచ్చిన
జాతీయ వాదుల తో నిండిన పవిత్ర కర్మభూమి తెలంగాణ.
బోయినపల్లి రామచందర్ రావు విద్యార్థి పరిషత్ కార్యకర్త, న్యాయవాదిగా జగిత్యాల పట్టణంలో పనిచేస్తూ- విద్యార్థ పరిషత్ కు పెద్దరికంగా నిలిచి కార్యకర్తలకు మార్గదర్శనం చేసేవారు. రాచకొండ గోపాల్ రెడ్డి విద్యార్థి పరిషత్ కు పూర్తి సమయం కేటాయించి జాతీయవాద ప్రేరిత కార్యకర్తలను గ్రామ, గ్రామానికి తీసుకెళ్లి కార్యక్రమాలు నడిపిస్తూ ఉండేవారు.జాతీయ వాద భావజాలం పట్ల, ప్రజలు
ప్రజాస్వామ్యం పట్ల అవగాహన లేని పీపుల్స్ వార్ గ్రూప్,
విద్యార్థులను ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న
రామన్న,
గోపన్నల కార్యకలాపాలను సహించ
లేకపోయింది. గ్రామంలో జన జాగృతి కార్యక్రమాలు
నిర్వహించే రామన్న,
గొపన్నలు ఇద్దరూ ఒకేసారి
'గోవిందపల్లి' అనే గ్రామం నుండి జగిత్యాల వైపు వస్తున్న
సంగతి ముందే పసిగట్టి,
జగిత్యాల పట్టణ శివార్లలో
మాటువేసి బస్టాండ్ దగ్గర సాయంకాలం వేళ ఏడు
గంటల సమయంలో మోటార్ సైకిల్ పై వస్తున్న రామన్న,
గోపన్నలను ముందునుండి ఎదుర్కోలేక, సిద్ధాంత పరంగా
జవాబు చెప్పలేక పిరికిపందలు వెనక నుండి తుపాకి
బుల్లెట్ల వర్షం కురిపించారు. తుపాకి గుండ్లను గుండెలతో
ఎదురించిన వీర కిశోరాలు గోపన్న రామన్న లు
అక్కడికక్కడే వీర స్వర్గం అలంకరించారు.ప్రజలలో చైతన్యం కోసం, జన జాగృతి కోసం
ఆహరహమూ శ్రమించిన రామన్న,
గోపున్నలపై పీపుల్స్ వార్ గ్రూప్ సాగించిన దమనకాండను నిరసిస్తూ జగిత్యాల ప్రజానీకమంతా బందు జరిపి విషణ్ణవదనాలతో భరతమాత ముద్దు బిడ్డల అంతిమయాత్రలో పాల్గొన్నది.యావత్ తెలంగాణ నుండి విద్యార్థులు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు జగిత్యాలకు చేరుకొని అశ్రునయనాలతో నివాళులర్పించారు. ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.