Sri Ramakrishna ParamaHamsa Primary School

Sri Ramakrishna ParamaHamsa Primary School We're Teaching the Children with Discipline Determination Dedication from 27 years of excellence

Make your child first step in to the success..
13/06/2022

Make your child first step in to the success..

Actual Reasons behind Some of Superstitions..మూఢనమ్మకాల వెనక అసలు నిజాలు ..
08/06/2021

Actual Reasons behind Some of Superstitions..

మూఢనమ్మకాల వెనక అసలు నిజాలు ..

Easy task with Alphabets For Your Children
25/04/2021

Easy task with Alphabets For Your Children

16/04/2021

*తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి
అర్థాలు*
===========================

1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక.
2. విభవ - వైభవంగా ఉండేది.
3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.
4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.
5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.
6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.
7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.
8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.
9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.
10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.
11. ఈశ్వర... పరమేశ్వరుడు.
12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.
13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.
14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.
15. వృష ... చర్మం.
16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.
17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం
18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.
19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.
20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.
21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.
22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.
23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.
24. వికృతి... వికృతమైనటువంటిది.
25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.
26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.
27. విజయ... విశేషమైన జయం కలిగినది.
28. జయ.... జయాన్ని కలిగించేది.
29. మన్మథ... మనస్సును మధించేది.
30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.
31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.
32. విలంబి... సాగదీయడం.
33. వికారి.... వికారం కలిగినది.
34. శార్వరి... రాత్రి.
35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.
36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.
37. శోభకృత్... శోభను కలిగించేది.
38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.
39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.
40. పరాభవ ... అవమానం.
41. ప్లవంగ... కోతి, కప్ప.
42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.
43. సౌమ్య... మృదుత్వం.
44. సాధారణ... సామాన్యం.
45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.
46. పరీధావి... భయకారకం.
47. ప్రమాదీచ... ప్రమాద కారకం.
48. ఆనంద... ఆనందమయం.
49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.
50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.
51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.
52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.
53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.
54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.
55. దుర్మతి... దుష్ట బుద్ధి.
56. దుందుభి ... వరుణుడు.
57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.
58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.
59. క్రోదన... కోప స్వభావం కలది.
60. అక్షయ... నశించని

#$®K¶$

అక్షరాల అధిదేవతలు:వసినీన్యాది వాగ్దేవతలు: వశిని , కామేశ్వరి, మోదిని, విమల, అరుణా . జయని కౌళిని మరియ సర్వేశ్వరి మొదలగు తె...
12/04/2021

అక్షరాల అధిదేవతలు:

వసినీన్యాది వాగ్దేవతలు: వశిని , కామేశ్వరి, మోదిని, విమల, అరుణా . జయని కౌళిని మరియ సర్వేశ్వరి మొదలగు
తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల

అంతర్నిర్మాణం :

"అ నుండి అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని "చంద్ర ఖండం" అంటారు.

ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత "వశిని" అంటే వశపరచుకొనే శక్తి కలది అర్ధం.

"క" నుండి "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని " సౌర ఖండం " అంటారు.

"మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని " అగ్ని ఖండం" అంటారు.

ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.

సౌర ఖండంలోని " క "నుండి "ఙ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి. అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.

"చ" నుండి "ఞ" వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత "మోదిని" అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.

"ట" నుండి "ణ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి "విమల". అంటే మలినాలను తొలగించే దేవత.

"త" నుండి "న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ" కరుణను మేలుకొలిపేదే అరుణ.

"ప" నుండి "మ" అనే ఐదు అక్షరాలకు అధిదేవత "జయని". జయమును కలుగ చేయునది.

అలాగే అగ్ని ఖండంలోని " య, ర,ల, వ అనే అక్షరాలకు అధిష్టాన దేవత " సర్వేశ్వరి". శాశించే శక్తి కలది సర్వేశ్వరి.

ఆఖరులో ఐదు అక్షరాలైన "శ, ష, స, హ, క్ష లకు అధిదేవత "కౌలిని"

ఈ అధిదేవతలనందరినీ "వాగ్దేవతలు" అంటారు.

అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది. ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది. అంటే బ్రహ్మమే శబ్దము. ఆ బ్రహ్మమే నాదము.

మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి. అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లును అర్చిస్తున్నాయి🙏🏻

భారత దేశ ప్రధాన మంత్రులు...  Prime ministera of India...
05/04/2021

భారత దేశ ప్రధాన మంత్రులు...
Prime ministera of India...

Learning everywhere .
02/04/2021

Learning everywhere .

Basics..
01/04/2021

Basics..

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు #$®K¶$
11/03/2021

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

#$®K¶$

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా..
28/02/2021

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా..

Daily Activities
27/02/2021

Daily Activities

10వ తరగతి తర్వాత.... #$®K¶$
25/02/2021

10వ తరగతి తర్వాత....

#$®K¶$

Address

Gangapur
Jadcherla

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

9912580330

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Ramakrishna ParamaHamsa Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category