SAVT సేవ్ టీచర్స్

SAVT సేవ్ టీచర్స్ Service Association For Visionery Teachers

రంగారెడ్డి జిల్లా గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ గారికి నేడు వినతిపత్రం ఇచ్చిన సేవ్ టీచర్స్ సంఘం GHMC పరిధి నుంచి 8 కి...
24/12/2025

రంగారెడ్డి జిల్లా గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ గారికి నేడు వినతిపత్రం ఇచ్చిన సేవ్ టీచర్స్ సంఘం

GHMC పరిధి నుంచి 8 కిలోమీటర్ల లోపల పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 24% గృహ అద్దె భత్యం(HRA) వర్తింపజేయవలసిందిగా వినతిపత్రం ఇచ్చిన సేవ్ టీచర్స్ సంఘం రంగారెడ్డి జిల్లా శాఖ.
జి.ఓ.ఎం.ఎస్.నెం.102,ఆర్థిక శాఖ (HRM–IV),తేది 30.06.2015.
జి.ఓ.ఎం.ఎస్.నెం.53,ఆర్థిక శాఖ (HRM–IV).
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయ ప్రొసీడింగ్స్ నెం. B3/582/2024,తేది 17.12.2025.
GHMC పరిధి విస్తరణ మరియు జీవన వ్యయాల పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని,తాజాగా GHMCలో కలిపిన ప్రాంతాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 24% గృహ అద్దె భత్యం (HRA) మంజూరు చేస్తూ జిల్లా పరిపాలన ఉత్తర్వులు జారీచేసినారు, కావున GHMC అధికారిక పరిధికి కాస్త బయటగా ఉన్నప్పటికీ, GHMC సరిహద్దుల నుంచి 8 కిలోమీటర్ల లోపల పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా GHMC పరిధిలో పనిచేసే ఉద్యోగులతో సమానమైన పట్టణ జీవన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది.వీరిదీ కూడా అధిక గృహ అద్దెలు,రవాణా ఖర్చుల పెరుగుదల మరియు మొత్తం జీవన వ్యయం అధికంగా ఉండే పరిస్థితియే,ఇటీవలి ప్రొసీడింగ్స్ పట్టణ విస్తరణ మరియు జీవన పరిస్థితుల ఆధారంగా సమానత్వ (parity) సూత్రాన్ని గుర్తించిన నేపథ్యంలో,న్యాయం మరియు ఏకరీతి దృష్ట్యా GHMC పరిధి నుంచి 8 కిలోమీటర్ల లోపల పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 24% HRA వర్తింపజేయవలసిందిగా వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము.
అందువల్ల,ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలించి, అవసరమైన ఉత్తర్వులు జారీ చేయుటకు ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనను సిఫారసు చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాము.
ఈ కార్యక్రమంలో సేవ్ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల మధుకర్ రెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలారి సురేష్ కుమార్,రాష్ట్ర గౌరవాధ్యక్షులు బొడ్డు రవి,జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,ఇబ్రహీంపట్నం మండల శాఖ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి బి భాషయ్య తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి జిల్లా విద్యాశాఖలో GO317 అమలులో కేటాయించిన అక్రమ ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసి స్థానిక ఉపాధ్యాయులకు మరియు నిర...
13/11/2025

రంగారెడ్డి జిల్లా విద్యాశాఖలో GO317 అమలులో కేటాయించిన అక్రమ ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసి స్థానిక ఉపాధ్యాయులకు మరియు నిరుద్యోగులకు న్యాయం చేయాలి

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

25/10/2025

03/08/2025

29/04/2025

  SAVT సేవ్ టీచర్స్ ఉపాధ్యాయ సంఘం నేడు భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి తన నివాసంలో ...
26/03/2025



SAVT సేవ్ టీచర్స్ ఉపాధ్యాయ సంఘం నేడు భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి తన నివాసంలో వినతిపత్రం అందజేశారు రంగారెడ్డి జిల్లాలో 317 Go నేపంతో జరిగిన అక్రమ ఉపాధ్యాయ పోస్టింగ్స్ రద్దు చేయించాలని భాజపా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు శ్రీ బోసుపల్లి ప్రతాప్ ఆధ్వర్యంలో సేవ్ టీచర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బత్తుల మధుకర్ రెడ్డి మరియు తలారి సురేష్ కుమార్
ఈ సందర్బంగా శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఉపాధ్యాయ పోస్టింగ్స్ అన్నింటిపైన న్యాయ విచారణ జరిపించేటట్లు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తానని హామీ ఇచ్చారు,రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఉపాధ్యాయ అక్రమ పోస్టింగ్స్ ఉద్యోగ అవకాశాలు కోల్పోయి నష్టపోయిన నిరుద్యోగ యువకులకు న్యాయం జరిగే వరకు మద్దత్తుగా ఉంటానని అన్నారు

20/03/2025


20/03/2025


  Go 317 అమలులో రంగారెడ్డి జిల్లా స్థానికులకు జరిగిన అన్యాయంపై రంగారెడ్డి జిల్లా స్థానిక సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్...
20/03/2025


Go 317 అమలులో రంగారెడ్డి జిల్లా స్థానికులకు జరిగిన అన్యాయంపై రంగారెడ్డి జిల్లా స్థానిక సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మధు యాష్కి గౌడ్ గారికి ప్రాతినిధ్యం చేసిన SAVT సేవ్ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల మధుకర్ రెడ్డి,రాష్ట్ర గౌరవాధ్యక్షులు బొడ్డు రవి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలారి సురేష్ కుమార్,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Address

Kongar Kalan Timmapur
Ibrahimpatan

Website

Alerts

Be the first to know and let us send you an email when SAVT సేవ్ టీచర్స్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share