25/03/2026
📢 RDF తరపున హర్షం వ్యక్తం 📢
రాంరెడ్డి పల్లి గ్రామంలో పేకాట, గంజాయి, మద్యపానం వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన కోసం గ్రామ సర్పంచ్ గారు శ్రీ లపంగి నర్సింహా గారి ఆధ్వర్యంలో తీసుకున్న కఠిన నిర్ణయాలకు RDF తరపున హర్షం వ్యక్తం చేస్తున్నాము.
గ్రామ అభివృద్ధి, యువత భవిష్యత్తు మరియు సమాజ శ్రేయస్సు కోసం గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, మరియు గ్రామ ప్రజలందరూ కలిసి ముందుకు రావడం ఎంతో అభినందనీయం.
ఇలాంటి చర్యలు గ్రామంలో మంచి మార్పుకు నాంది పలుకుతాయి. వ్యసనాలకు దూరంగా, శాంతి, క్రమశిక్షణ, అభివృద్ధి వైపు రాంరెడ్డి పల్లి ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
🤝 మన గ్రామం – మన బాధ్యత
👉 చెడు అలవాట్లకు అడ్డుకట్ట వేయడం మనందరి కర్తవ్యం
👉 మంచి సమాజ నిర్మాణంలో అందరం భాగస్వాములవ్వాలి
🙏 ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ సర్పంచ్ గారికి, పాలకవర్గానికి మరియు గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు
RDF తరపున 🙏