Chembiosis Chemistry Coaching Centre

Chembiosis Chemistry Coaching Centre

Share

Romana plaza

28/09/2023
25/08/2023

R Praggnannandhaa , third youngest player , World Cup chess !!!

20/08/2023

*ఆమె ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్.*
*ఆరోజు ఆమె ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.*
*ఆమె రోజులాగే ఆఫీసులో అన్ని గదులు ఊడ్చి సిబ్బందితో రోజు మాదిరే సంతోషంగా గడుపుతూ ఉంది,సిబ్బంది మాత్రం మమ్మల్ని విడిచి పోతున్నావు అంటూ భావోద్వేగాలతో కళ్ళు చెమర్చుతున్నాయి.*
*సాయంత్రం 5 గంటలయ్యింది,సిబ్బంది బొకేలతో హడావుడిగా వున్నారు,*
*అంతలో జిల్లా కలెక్టర్ కారు వచ్చి ఆగింది,కలెక్టర్ కారు దిగి నేరుగా అస్వీపర్ వద్దకు వెళ్లి ఆమె కాళ్లకు దండం పెట్టాడు,మరో పెద్దకారు వచ్చి ఆగింది,ఆకారులో పెద్ద పేరున్న సివిల్ ఇంజనీర్.ఆయన కూడా వచ్చి అస్వీపర్ కాళ్లకు దండం పెట్టాడు.మరో కారు వచ్చింది,ఆకారులో పేరున్న గుండె వైద్య నిపుణులు వచ్చి రాగానే ఆస్వీపర్ కాళ్ల మీద నన్ను క్షమించమ్మా 5నిమిషాలు ఆలస్యంగా వచ్చాను అని ప్రాధేయపడ్డాడు.ఈ ముగ్గురూ(కలెక్టర్,సివిల్ ఇంజనీర్,గుండె వైద్య నిపుణులు)అస్వీపర్ కుమారులట. అక్కడ వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారింది.అందరి కళ్ళలో కన్నీళ్లే.స్వీపరుగా పని చేస్తూ కుమారులను చదివించానని,నాకష్టాన్ని పిల్లలు వృధా చేయలేదని,స్వీపరుగా నాఉద్యోగం ఆనందంగా నిర్వహించానని ఇంతకంటే నాకు మాటలు రావటం లేదంటూ, ఇక్కడి ఆఫీసుని, సిబ్బందిని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందని కన్నీళ్ళు తుడుచుకుంటూ ప్రసంగాన్ని ముగించారు.(బీహార్ లోని ఓప్రభుత్వ కార్యాలయంలో జరిగిన యదార్థ సంఘటన).*

29/07/2023

హైటెక్‌సిటీ చెంతన ఓ బస్తీలోని ఇరుకు గదిలో నివాసం. తండ్రి కూలీ. తల్లి హౌస్‌కీపర్. వీరి అబ్బాయి నర్సింహ విద్యా ప్రమాణాలు మచ్చుకైనా లేని ప్రభుత్వ పాఠశాల విద్యార్థి.

సున్నాల్లేని గోడలు, గొళ్లాల్లేని తలుపులు... ఇరుకిరుకు గదులు, సమయానికి రాని మాస్టార్లు, నాణ్యతలేని మధ్యాహ్న భోజనం... అరకొర చదువులు... ప్రభుత్వ పాఠశాలలు అనగానే అందరికీ గుర్తుకువచ్చే దుస్థితి. అయితే అలాంటి పరిస్థితుల నుంచి కూడా విశేషమైన విజయాలు పుట్టుకొస్తాయి. అలాంటి విజయం సాధించిన బాలుడు నర్సింహ... ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ‘ఇంటలిజెన్స్’ ముందు దిగదుడుపే అని నిరూపించాడు. రూ.లక్షలు చెల్లించి చదివే విద్యార్థులతో పోటీపడి గెలిచాడు. అది కూడా తెలుగు మీడియం విద్యార్థులను అనుక్షణం భయపెట్టే ఆంగ్లభాషా ప్రావీణ్యంలో...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా పోటీలలో ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో నర్సింహను ఎంపిక చేస్తే... ఏకంగా విజేతగా నిలిచి నర్సింహ అందర్నీ ఆశ్చర్యంలో ముంచాడు. అల్లిబిల్లిగా ఉండే ఆంగ్ల అక్షరాలతో పదాలను కూర్చడం, ఉచ్ఛరించిన ఆంగ్లపదాల స్పెల్లింగులు కరెక్ట్ చేయడం... వంటి విభిన్న రకాల అంశాలతో నిర్వహించిన ఈ పోటీకి నగరానికి చెందిన దాదాపు అన్ని టాప్ క్లాస్ కార్పొరేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీలో కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా ల్యాప్‌టాప్‌పై సమాధానాలు ఇస్తూ నర్సింహ ముందు వరుసలో నిలిచాడు.

చివరకి... మాదాపూర్‌లోని మహీంద్రా సత్యంలో అట్లాంటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లెర్నేసియం ఓపెన్ వొకాబ్ కాంటెస్ట్- 2013-14’ ఫైనల్స్‌లో అందర్నీ తోసిరాజని... అంజయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరఫున ప్రైమరీ స్కూల్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ప్రశంసా పత్రం, మెమొంటోతో పాటు రూ.50 వేల నగదు పురస్కారాన్ని సైతం దక్కించుకున్నాడు.

26/07/2023

బడి నుంచి గెంటేశారు...అయితేనేం అమెరికా పిలిచింది. ఆర్థిక సమస్యలూ, ఆకలి బాధా...
అమ్మానాన్నలకు అవమానాలు...అన్నీ ఆ అమ్మాయికి తెలుసు...అన్నింటినీ దూరం చేయాలంటే...చదువుకోవడమే పరిష్కారమనుకుంది. అందుకే కష్టపడింది. ఇప్పుడు ఆమెరికాలో ఉచిత విద్యను అభ్యసించే అవకాశాన్ని దక్కించుకుంది. డిగ్రీ చదువుతూ... ఏడాది విరామం తీసుకుని అమెరికా ప్రభుత్వం ఇచ్చిన అరుదైన అవకాశాన్ని అందుకోవడానికి వెళుతోన్న #ప్రియాంక జీవితం ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శం.

మేం బతుకుదెరువు కోసం వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడాం. నాన్న కూలీ. అమ్మ బాలానగర్‌ ఏసీపీ కార్యాలయంలో స్వీపర్‌. మేం ముగ్గురం పిల్లలం. నాకో చెల్లీ, తమ్ముడూ. అమ్మానాన్నలిద్దరూ రెక్కలు ముక్కలు చేసుకుంటేనే మా కుటుంబం గడిచేది. నా చిన్నప్పుడు ఒకపూట తింటే మరోపూట పస్తులున్న రోజులు నాకు ఇప్పటికీ గుర్తే. కొన్నిసార్లు మా అమ్మ వీధి చివరన ఉన్న దుకాణంలో నూకలు తెచ్చి వండి పెట్టేది. కూరగాయలు కొనే స్థోమత లేక కారంతోనే సరిపెట్టుకునేవాళ్లం. అయినా అమ్మానాన్నలకు మమ్మల్ని బాగా చదివించాలని ఉండేది.

ఎంతో అవమానం: మేం వాళ్లలా కాకుండా ఉన్నతంగా ఎదగాలని అమ్మానాన్న మమ్మల్ని ప్రయివేట్‌ స్కూల్‌లో చేర్పించారు కానీ... ఫీజులు కట్టలేకపోయారు. నాలుగో తరగతిలో ఉన్నప్పుడు ఫీజు కట్టలేదని స్కూల్లోంచి గెంటేశారు. ఆ రోజు ఎంత బాధ అనిపించిందో. అమ్మానాన్న కూడా ఎంతో కుమిలిపోయారు. అప్పుడు నేను చిన్నదాన్నే అయినా వాళ్ల బాధ నాకు అర్థమైంది. ఆ క్షణంలోనే అనుకున్నా నా గురించీ, నా చదువు విషయంలో వాళ్లెప్పుడూ బాధపడకూడదని. ఆ రోజు నుంచీ చదువే ప్రపంచం అనుకున్నా. ఇకపై మా చదువు భారం కాకుండా ఉండాలంటే ఏం చేయాలని అందరం ఆలోచించాం. అప్పుడే ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదువుకుంటే చదువూ, వసతి ఉచితమని తెలిసింది. నాన్న నా చేత ఆ పరీక్ష రాయించారు. అలా బోరబండలోని రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పదో తరగతి పూర్తిచేశా. అప్పుడప్పుడూ ఇంటికి వెళ్తే ఛార్జీలు పెట్టుకోవాల్సి వస్తుందనీ, కేవలం దసరా, సంక్రాంతి సెలవులకే ఇంటికి వెళ్లేదాన్ని. చివరకు 90 శాతం మార్కులతో పదో తరగతి పాసయ్యా.

ఉచితంగా చదువు: కార్పొరేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదవాలంటే బోలెడు ఫీజు కట్టాలి. మాకు అంత స్థోమత లేదు. పైగా నాన్న ఇంకా చెల్లినీ, తమ్ముడినీ చూసుకోవాలి. అవన్నీ ఆలోచించి బాగా చదువు చెప్పే కాలేజీలు ఎక్కడుంటాయో తెలుసుకున్నా. అప్పుడే తెలిసింది గౌలిదొడ్డి ప్రభుత్వ కాలేజీ గురించి. కార్పొరేట్‌ కాలేజీలకు దీటుగా అక్కడ బోధన ఉంటుంది. ఆ కళాశాలలో చదువుకున్నవారిలో చాలామంది ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. అక్కడ సీటు రావడమూ కష్టమే. స్క్రీనింగ్‌, మరో రాత పరీక్షలో పాస్‌ కావాలి. నేను అవన్నీ పాసయ్యా. రెండేళ్ల పాటు అక్కడి హాస్టల్‌లో ఉండి చదువుకున్నా. అక్కడికి అందరిలా మా అమ్మానాన్న రావాలంటే వాళ్లు పని వదులుకోవాలి. ఒక్కరోజు పని డబ్బులు కూడా చాలా విలువైనవే. అవన్నీ నాకు తెలుసు కాబట్టి రాకపోయినా బాధపడేదాన్ని కాదు. వాళ్లు ఎలా ఉన్నారో అని మాత్రం బెంగపడేదాన్ని. ఆ ఆలోచనలన్నీ దూరం కావడానికి పుస్తకాలు పట్టుకునేదాన్ని. మా లెక్చరర్‌ ప్రమోద మేడం నాకు అండగా ఉండేవారు. పాకెట్మనీ ఇచ్చేవారు. బయటకు తీసుకెళ్లేవారు. నన్ను గమనిస్తూ.. అమ్మలా చూసుకునేవారు. ఏం చదవాలీ, ఎలా చదవాలి, కెరీర్‌ గురించి గైడెన్స్‌ ఇస్తుండేవారు.

అమెరికా ప్రయాణం: ఇంటర్‌ ఎంఈసీలో 97 శాతం మార్కులొచ్చాయి. అంతేనా తెలంగాణలో టాప్‌ పదో ర్యాంకు. ఆ రోజు అమ్మానాన్నల సంతోషం అంతా ఇంతా కాదు. నేను వాళ్లకి ఇచ్చిన మొదటి కానుక అదే. ఇక మీదట ఎప్పుడూ వాళ్ల ముఖంలో అలాంటి నవ్వే చూడాలనుకున్నా. అలానే అమ్మావాళ్లకి భారం కాకుండా బుద్వేల్‌లోని సోషల్‌ వెల్ఫేర్‌ కాలేజీలో డిగ్రీ చదివే అవకాశం తెచ్చుకున్నా. డిగ్రీలో మొదటి ఏడాది పూర్తయ్యింది. ఇంతలోనే నాకు కమ్యూనిటీ కాలేజీ ఇనిషీయేటివ్‌ ప్రోగ్రాంలో భాగంగా అమెరికా వెళ్లి చదువుకునే అవకాశం వచ్చింది. అంటే ఏడాదిపాటు చదువుకు దూరమవ్వాలి. అయితే నేను నాలుగో సెమిస్టర్‌ సమయానికి తిరిగి వచ్చి ఒకేసారి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నా. ఇంతకీ నాకు ఈ అవకాశం ఎలా వచ్చిందంటే.. హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ వాళ్లు ఏటా టోఫెల్‌ మాదిరి పరీక్షలు పెడతారు. అందులో ఎంపికైన వారిని అమెరికాలోని కమ్యూనిటీ కాలేజీలో చదువుకోవడానికి పంపుతారు. ఈ అవకాశం కోసం వేల మంది పోటీ పడతారు. ఎంపిక ప్రతిభp ఆధారంగానే ఉంటుంది. నేనూ ఆ పరీక్షలన్నీ పాసయ్యా. అక్కడికి వెళ్లాక ఐటీ తరగతులకు హాజరు కావాలి. డెబ్భై గంటలు ఇంటర్న్‌షిప్‌ కూడా చేయాలి. వందగంటలు వలంటరీ సేవలు అందించాలి. మన సంప్రదాయాల్ని అక్కడి విద్యార్థులకు పరిచయం చేసి వాళ్ల గురించీ తెలుసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే... కంప్యూటర్‌ చదువుతోపాటూ, జీవితాన్ని కూడా అధ్యయనం చేసి రావాలి. ఇందుకోసం నేను మసాచూసెట్స్‌లోని బంకర్‌హిల్‌ కమ్యూనిటీ కాలేజీలో చదువుకోబోతున్నా. ఈనెల 29న ప్రయాణం. ఏడాది తరువాత తిరిగొస్తా. మాకు సంబంధించిన ఖర్చులన్నీ అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. ఫీజు కట్టలేదని ప్రయివేట్‌ స్కూల్‌లోంచి బయటకు గెంటినప్పుడు ఎంత బాధపడ్డానో... ఇప్పుడు రెట్టింపు సంతోషంగా చదువుకోవడానికి వెళుతున్నందుకు గర్వంగా ఉంది.
అరుదైన అవకాశాన్ని అందుకోవడానికి వెళుతోన్న ప్రియాంకకి అభినందనలు

15/07/2023

ఏ హైపో సోనిక్ విమానాలు చూపెట్టి అమెరికా ప్రపంచాన్ని భయ పెడుతుందో....
చైనా మన మీదకు మాటి మాటికి కాలు దువ్వుతుందో.
గాలి కంటే ఆరు రెట్ల వేగం
అంటే సెకనుకు రెండు కిలో మీటర్లు.... నిమిషానికి నూట ఇరవై కిలో మీటర్లు వేగంతో ప్రయాణించే హైపోసోనిక్ మిసైళ్లను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి అగ్రరాజ్యాలకు సవాలు విసిరాడు.......
మన తెలుగోడు.
నెల్లూరుకు చెందిన
#గండ్రా సతీష్ రెడ్డి
ఇది హీరోయిజం అంటె.....
గౌరవం ఇవ్వాలిసింది కరెన్సీ కోసం కెమెరా ముందు కులికే నటులకో సెంచరీలు కొట్టే క్రికెటర్లకో కాదు. తొడగొట్టి రైలాపి డూపూలతో వందమందిని చితకొట్టే యాక్టర్లకు కాదు.
యాడ్ రెమ్యూనేషన్ పెంచుకునేందుకు సెంచరీలు చేసే క్రికెటర్లకు కాదు.
హీరోలంటే శత్రుదేశం మనవైపు చూడాలంటేనే వెన్నులో వణుకు పుట్టించే #సైంటిస్ట్ సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు అసలుహీరోలు.

08/06/2023

భారత యువ సింహం భగత్ సింగ్ ను ఉద్దేశించి

జడ్జి:- ఏమయ్యా భగత్ సింగ్
నువ్వు తప్పు చేసానని ఒక్కమాట ఒప్పుకో ఉరిశిక్షను యావజ్జీవ కారాగారంగా మారుస్తాం.

భగత్ సిం(ఝం)గ్:-నా దేశం బ్రిటీషు రాబందుల పాలిటపడి చిత్రహింసలనుభవిస్తుంటే ఒక భారత మాత బిడ్డగా దుష్టరాబందులున్న పార్లమెంటు పై బాంబులు వేసిన నేను తప్పు చేసానంటే స్వాతంత్రం,ధర్మం కోసం పోరాడుతున్న యావత్భారతసింహాలన్ని తప్పుచేసినట్టౌతుంది.
నీ దయాబిక్ష నాకక్కర్లేదు.

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


3-6-726 Romana Plaza, Street No 11
Hyderabad
500027

Opening Hours

Monday 6am - 7pm
6pm - 7pm
Tuesday 6am - 7pm
6pm - 7pm
Wednesday 6am - 7pm
6pm - 7pm
Thursday 6am - 7pm
6pm - 7pm
Friday 6am - 7pm
6pm - 7pm
Saturday 6am - 7pm
6pm - 7pm
Sunday 7am - 5:30pm
6pm - 7pm