Vashista 360

Vashista 360 Vashista 360 - The world of english.
(359)

23/09/2026

Pain from the RURAL ROOTS😖 The Story of Palletoori Rythu Bidda 🌾 Vashista 365

23/09/2026

It'll be yours definitely‼️ Ft Murali Buddha Vashista 365

22/09/2026

Is Rice Really Harmful for Common People⚠️⁉️|| Ft.Lakshmi Narayana || The Real Talks

ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్‌లోని అత్యంత సంపన్నుడు...పదివేల రూపాయిల ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్‌తో గడుస్తున్న కుటుంబం. 14 మం...
22/09/2026

ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్‌లోని అత్యంత సంపన్నుడు...

పదివేల రూపాయిల ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్‌తో గడుస్తున్న కుటుంబం. 14 మంది కుటుంబసభ్యులు. అందులో ఒక పిల్లాడు. అతని ఆశయాలు చాలా గొప్పవి కానీ వాటిని సాధించే పరిస్థితులు మాత్రం అంతంతమాత్రమే. మచిలీపట్నంలో ఇంటర్‌‌ సెకెండియర్ రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు.. అయినా ఏదో సాధించాలన్న అతని తపన.. ఆ తర్వాత మణిపాల్ హైయర్ స్టడీస్ కాలేజీలో చేరి బీఎస్సి చదివాడు. అదే అతని జీవితంలో అనుకోని మలుపుకి దారితీసింది. ఇంటర్ రెండుసార్లు ఫెయిల్ అయిన అదే కుర్రాడు నేడు అపరకోటీశ్వరుడిగా నెలకొనడానికి పునాది వేసింది. అతనెవరో చూడండి..

ఆంధ్రప్రదేశ్‌లో ఓ చిన్న టౌన్‌కు చెందిన మురళీ దివి.. నేడు ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్‌లోనే అత్యంత కోటీశ్వరుడిగా నిలిచారు. 53 వేల కోట్ల ఆస్తితో మురళీ దివి భారతీయులు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఒకరోజులో, ఒక ఏడాదిలో జరిగిన పరిణామం కాదిది. నలభై ఏళ్ళ సుదీర్ఘ శ్రమతో ఏర్పడిన సామ్రజ్యం. అదే‌‌.. దివీస్ ల్యాబ్స్.

చిన్నప్పుడు పెద్దగా చదువు ఒంటబట్టని మురళీ.. ఒకానొక సందర్భంలో అతని అన్నలాగే తను కూడా బీఎస్సీ చదవాలని నిశ్చయించి మణిపాల్ కాలేజీలు చేరాడు. అప్పటికే పద్నాలుగు మంది సభ్యులున్న కుటుంబం వారిది‌. వాళ్ళ నాన్నగారు ప్రభుత్వోద్యోగి. పదివేల పెన్షన్‌. ఆ డబ్బుతోనే కుటుంబం గడవాలి. ఆ డబ్బుతోనే నెట్టుకుని వచ్చారు.

డిగ్రీ అయిన తర్వాత మురళి ఓ సంస్థలో ఫార్మసిస్ట్‌గా ఉద్యోగం చేశారు. అప్పుడు అతని జీతం నెలకు 250 రూపాయిలు. 1976లో మురళి తన 25వ ఏట అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ టైంలో మురళి చేతిలో ఉన్న డబ్బు 500 వందల రూపాయిలు. తెలిసినవాళ్ళ సహాయ సహకారంతో మురళి అమెరికాకి వెళ్ళగలిగారు‌. అక్కడ ట్రినిటీ కెమికల్స్, ఫైక్ కెమికల్స్ వంటి సంస్థల్లో ఫార్మసిస్ట్‌గా జాబ్ చేశారు. అతి తక్కువ కాలంలోనే ఏటా 65 వేల డాలర్ల జీతం గడించే స్థాయికి చేరుకున్నారు‌. ఆ తర్వాత మురళి దివి పలు ఫార్మసిటికల్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ సైంటిస్ట్‌గా ఎదిగారు. 1984 లో మురళి 40 వేల డాలర్లతో ఇండియాకు తిరిగి వచ్చారు‌. ఒక స్నేహితుడితో కలిసి కెమినార్ అనే సంస్థను స్థాపించారు. 1989లో కెమినార్ సంస్థను రెడ్డి ల్యాబ్స్ టేకోవర్ చేసింది. అక్కడి నుంచి మురళీ దివి రెడ్డి ల్యాబ్స్‌లో ఆరేళ్ళ పాటు పనిచేశారు. 1995 లో మురళీ రెడ్డి ల్యాబ్స్ నుంచి బయటికి వచ్చి సొంతంగా దివీస్ ల్యాబ్స్ అనే సంస్థను నెలకొల్పారు. హైదరాబాద్ చౌటుప్పల్‌లో మొదటి ఫ్యాక్టరీని 1995లో స్థాపించారు. ఆ తర్వాత ఏడేళ్ళకి అంటే.. 2002 లో దివీస్ ల్యాబ్స్ రెండో ఫ్యాక్టరీని విశాఖపట్నంలో స్థాపించారు.

ప్రపంచం ఫార్మసిటికల్ రంగానికి అవసరమైన క్రియాశీలక ఔషద పదార్ధాల ఉత్పాదన, సరఫరా చేసే ప్రముఖ సంస్థగా దివీస్ ల్యాబ్స్ ఎదిగింది. 2022లో దివీస్ ల్యాబ్స్ ఏకంగా 88 బిలియన్ల (8800 కోట్లు) వ్యాపారాన్ని చేసి చరిత్ర పుటల్లోకి ఎక్కింది‌. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో మురళీ దివి కీ చోటు కల్పించింది‌‌. ప్రస్తుతం మురళీ దివి 53 వేల కోట్ల ఆస్తులతో హైదరాబాద్‌లోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచారు.

Author - Unknown

21/09/2026

‼️Beware of REAL ESTATE scams ‼️ Ft VENKAT RAJ Real estate expert Vashista 365 Vashista 365 10

21/09/2026

‼️It’s all about Livelihood ‼️ II Ft. Dr.M.ABDUL KAREEM I Vashista 365 I EP : 30

21/09/2026

‼️గాంధీజీ దళిత వ్యతిరేక ?‼️ II Ft. Dr.M.ABDUL KAREEM I Vashista 365 I EP : 30

వరంగల్ దగ్గరలోని ఓ కుగ్రామంలోని స్కూల్ లో.. గవర్నమెంట్ టీచర్ గా నాకు పోస్టింగ్ రావడం నాకిష్టం లేదు. అయినా తప్పదు కాబట్టి...
20/09/2026

వరంగల్ దగ్గరలోని ఓ కుగ్రామంలోని స్కూల్ లో.. గవర్నమెంట్ టీచర్ గా నాకు పోస్టింగ్ రావడం నాకిష్టం లేదు. అయినా తప్పదు కాబట్టి ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఇదే కాకుండా, పక్కనే ఉన్న ఇటుకబట్టీల్లో పనిచేసే వాళ్ళ పిల్లల్ని కూడా మా school కే పంపడం. ఇంకా ఇంకా నాకస్సలు నచ్చేది కాదు. అసలే నాకు ఈ ఊళ్లంటేనే పడదు. అలాంటిది మళ్లీ ఈ ఊరమాస్ పిల్లలకు చదువు చెప్పాలి. "దేవుడా ! ఏంటీ పరీక్ష" అని రోజూ చిరాకుతో కూడిన చిర్రబుర్రులతోనే బడికి వెళ్లేదాన్ని.

అందులో ఒక్కణ్ణి చూస్తే నాకు అస్సలు నచ్చేది కాదు. నాకెప్పుడు వాణ్ని చూసినా కోపంగా అనిపించేది. వాడి పేరు సాంబడు. 9 ఏళ్ళుంటాయి. వాడు మూడో తరగతి చదువుతున్నాడు. సరైన బట్టలు వేసుకోడు. ఎప్పుడు చూసినా చిరిగిన చొక్కాలు వేసుకొనేవాడు. ఆరాతీస్తే, వీడి తల్లిదండ్రులు ఇటుకల బట్టీల్లో పని చేస్తారని తెలిసింది. మొదట మధ్యాహ్నం అన్నం కోసం బడికి పంపించేవారు. ఇప్పుడు వాడు బాగా చదువుకుంటాడని, పంపిస్తూన్నా రనిపించింది.*

నా దృష్టిలో అయితే వాడు చాలా poor student. ఏమీ గుర్తుండవు. సరిగ్గా ఎక్కాలు అప్ప చెప్పమన్నా కూడా వాడికి 5 కి మించి రావు. పైగా వాడి నలుపు రూపు చూస్తేనే అసహ్యంగా అనిపించి అస్సలు వాడి వైపు చూడ్డం కానీ, మాట్లాడటం కానీ అస్సలు చేసేదాన్ని కాదు.

అలాంటోడు కొన్ని రోజులుగా school కు రావడమే మానేశాడు. ఇలాంటి places లో school ki రావడం, మానేయడం వీళ్ళకు మామూలే కదా! అని నేను కూడా అంతగా పట్టించుకోలేదు...

ఒకరోజు హెడ్మాస్టర్ గారు రమ్మంటే ఆయన రూమ్ కి వెళ్లాను. ఆయన రూమ్ లో ఆయనకెదురుగా ముప్పై ఏళ్ళున్న ఒక labour ఆవిడ చేతులు కట్టుకుని నిల్చుని ఉంది.

ఆవిణ్ణి నాకు పరిచయం చేస్తూ..._"ఈవిడ మన సాంబడి తల్లి. దురదృష్టవశాత్తు సాంబడు పదిరోజుల కిందటే విషజ్వరంతో చనిపోయాడంట. వాళ్ళమ్మ మీతో మాట్లాడాలని వచ్చింది madam ఒక్కసారి మాట్లాడండీ"_ అన్నారు హెడ్మాస్టర్.

వాళ్ళమ్మ నా వైపు తిరిగి కళ్లెంబడి నీళ్లతో కుప్పకూలి, మేడమ్...! వాడు పోయే ముందు ఎప్పుడూ... _"నళిని మేడమ్ తో ఒక్కసారన్నా good అనిపించుకోవాలి అమ్మా"_ అని నాతో రోజూ చెప్పేవాడు.

వాడు చనిపోయే ముందురోజు కూడా మీ గురించే మాట్లాడాడమ్మా...! వాడు తనకు తానే _" సాంబడు good"_ అని పుస్తకంలో రాసుకొని మీ లాగే సంతకం చేసుకున్నాడు," అని తాను తెచ్చుకున్న సంచిలోనుండి పుస్తకం తెరిచి వాడి చిన్ని చిన్ని రాతలతో నా పేరు చూపించింది వాళ్ళమ్మ... నాకళ్ళ నుండి ఒక్కొక్కటిగా రాలుతున్న నీటిబొట్లతో వాడు పెట్టిన నా.. నా.. సంతకం తడిసి, పేజీ ముద్దగా అవుతోంది. నాకు దుఃఖం ఆగడంలేదు.

వాడు బతికుండగా ఒక్కసారి కూడా వాణ్ని మెచ్చుకోలుగా చూడలేదు. అసలు మనిషిగా కూడా చూళ్ళేదు వాణ్ని.

పాపం పిల్లాడు ఎంతగా ఆరాటపడ్డాడో! _"తండ్రీ ఎక్కడున్నా నన్ను క్షమించు... జాతి, వర్ణ, ఆర్ధిక బేధాలతో.. వివక్షలతో చిన్నారులను చిన్న చూపు చూసే నాతో పాటు నాలాంటి ఎందరో బుద్ధిలేని పెద్దమనుషును కూడా క్షమించరా" అని మనసులోనే వెక్కి వెక్కి ఏడుస్తూ...

“సాంబడు is Very Good” నాలాంటి ఎందరో కళ్లు తెరిపించావు తండ్రీ!_ అని అదే బుక్ లో రాసి ఆ గదిలోనే ఉన్న bench మీద కూర్చుని హెడ్మాస్టర్ గారి వెనుక ఉన్న అంబేద్కర్ గారి ఫోటోని చూసి _"తప్పు చేశాను సార్! 🙏 ఇక మీదట ఇలా జరగదు"_ అని నాకు నేను మనస్సులోనే ప్రమాణం చేసుకున్నాను.
_దయచేసి పిల్లలని ప్రేమించండి.🙏_ బడికి పంపించే ప్రతి తల్లిదండ్రులు పిల్లల యొక్క మైండ్ సెట్ ను వాళ్ల యొక్క సైకాలజీని కూడా స్కూల్ నుంచి ఇంటికి రాగానే గమనిస్తూ ఉండాలి . రోజువారి విషయాలు టీచర్ల యొక్క ప్రవర్తన కూడా పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి అని మనవి చేస్తున్నాను 🙏

19/09/2026

‼️AurangzebFormer Mughal Emperor‼️ II Ft. Dr.M.ABDUL KAREEM I Vashista 365 I EP : 30

18/09/2026

‼️యువరాజుల తిరుగుబాటు‼️ II Ft. Dr.M.ABDUL KAREEM I Vashista 365 I EP : 30

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Vashista 360 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Vashista 360:

Shortcuts

Share

Category