03/03/2019
దొంగలు బాబోయ్ దొంగలు...!!
టీడీపీ డేటా ఎత్తుకెళ్లిన తెలంగాణ పోలీసులు
-జగన్ కోసం..కేసీఆరే చేయించారు
-లోటస్ పాండ్ యువరాజుల చర్చలోనే స్కెచ్
-టీడీపీకి ఐటీ సపోర్ట్ ఇస్తున్న కంపెనీలపై వరుస దాడులు
-కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రల డేటా చోరీ
-డేటా ఆధారంగా టీడీపీని దెబ్బతీయాలని టీఆర్ఎస్, వైసీపీ కుట్ర
-మోడీ,కేసీఆర్, జగన్ కలిసినా తెలుగుదేశాన్ని ఏం చేయలేరు
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక సమాచారాన్ని తెలంగాణ పోలీసులు ఎత్తుకెళ్లడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఈ సారి ఎన్నికల్లోనూ జగన్ కి భంగపాటు తప్పదని గ్రహించిన కేసీఆర్ తెలంగాణ పోలీసులను రంగంలోకి దింపి టీడీపీ డేటా ఎత్తుకెళ్లారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సభ్యత్వ నమోదు, సంక్షేమ కార్యక్రమాల అమలు, పార్టీ కార్యకర్తలు, సేవా మిత్రల సమాచారం ఇప్పుడు తెలంగాణ పోలీసుల చేతిలో ఉందని, ఈ డేటాతో టీడీపీని దెబ్బ తీయాలనే పక్కా ప్రణాళికతో ఉన్నారని ఆందోళన వ్యక్తం అవుతోంది. చోరీ చేసిన తెలుగుదేశం పార్టీ సమాచారం ద్వారా కీలక వ్యక్తులను బెదిరించి వైసీపీకి అనుకూలంగా పనిచేయించడం, టీడీపీ మద్దతుదారులకు తెలంగాణలో ఆస్తులు..కంపెనీలుంటే వాటిపై దాడులు చేయించి వారిని లొంగదీసుకుని, జగన్‌కి మద్దతుగా నిలవాలని బెదిరించడం ఈ దాడుల ముఖ్యోద్దేశంగా కనిపిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ పైనా, తెలుగుదేశంపైనా సాగిస్తున్న కుట్రలను చట్టపరంగానే ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ నేటివరకూ పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తల గుర్తింపు కార్డులు వంటివన్నీ సాంకేతికత సహాయంతో అన్ని పార్టీల కంటే పారదర్శకంగా టీడీపీ రూపొందిస్తోంది. దీని కోసం టీడీపీ కొన్ని ఐటీ కంపెనీల సేవలను తీసుకుంటోంది. టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న కంపెనీలలో దాడులు చేసి, కంపెనీ ఉద్యోగులను కిడ్నాప్ చేసి, బెదిరించి భారీగా డేటాను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డేటాను వాడుకుని టీడీపీ కేడర్, లీడర్లను గుర్తించి వారిని బెదిరించి జగన్‌కు అనుకూలంగా మార్చాలనేదే టీఆర్ ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ని అస్తవ్యస్తం చేయాలన్నదే కేసీఆర్, జగన్ ప్లాన్ గా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి కావాలనే అత్యాశతో ఆంధ్రప్రదేశ్‌ని తెలంగాణకు తాకట్టు పెట్టిన జగన్‌కి ప్రజలే బుద్ధి చెబుతారనే ధీమాతో టీడీపీ నేతలున్నారు. చట్టవ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ డేటాను దొంగిలించుకుపోయిన తెలంగాణ పోలీసులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ నిర్ణయించింది. నేరుగా తెలుగుదేశం పార్టీని ఎన్నికల క్షేత్రంలో ఎదుర్కోలేని జగన్ ఇటువంటి తెరవెనుక కుట్రలకు పాల్పడుతున్నారని, దీనికి కేసీఆర్, కేంద్రంలో ప్రధాని మోడీ మద్దతు ఉందని టీడీపీ అనుమానిస్తోంది. టీడీపీ సభ్యత్వ నమోదు డేటాను, బూత్ కన్వీనర్ల డేటాను, టీడీపీ కమిటీల సభ్యుల వివరాలు తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకూ పనికిరావని, కేవలం వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకే ఈ డేటాను తెలంగాణ పోలీసులను ఉసిగొల్పి ఎత్తుకెళ్లారని టీడీపీ అనుమానిస్తోంది. త్వరలో ఎన్నికలు రానున్న సమయంలో టీడీపీకి ఐటీపరంగా సేవలు అందిస్తున్న కంపెనీలు, నిపుణులను అక్రమంగా నిర్భందించడం ద్వారా పార్టీని దెబ్బతీయాలనే కుట్ర ఉందనే కోణంలోనూ టీడీపీ ఆలోచిస్తోంది. తెలంగాణ పోలీసులకు అందిన ఫిర్యాదు, ఆ తరువాత ఐటీ కంపెనీలపై జరిగిన దాడులు, స్వాధీనం చేసుకున్న డేటాకు..ఒకదానికొకటి సంబంధంలేకపోవడంతో ..దీని వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. సేవామిత్ర అనే మొబైల్ యాప్ లో ఓటర్ల వివరాలు, కుటుంబ వివరాలు ఉన్నాయని, ఇవి సదరు ఐటీ కంపెనీ అక్రమంగా సేకరించిందని తెలంగాణ పోలీసులకు వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ దాడులు జరిగాయి. అయితే ఓటర్ల వివరాలు ఎన్నికల కమిషన్ అందరూ చూసే విధంగా బహిరంగంగానే ఉంచింది. అలాగే ఒక డోర్ నెంబర్ ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో కొడితే ఆ ఇంట్లో నివసిస్తున్న కుటుంబసభ్యుల వివరాలన్నీ వస్తాయి. బహిరంగంగా అందరూ తెలుసుకునే సమాచారమే ఉన్న సేవామిత్ర యాప్‌ను బూచిగా చూపి...టీడీపీ కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రల వివరాలున్న డేటాను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకోవడం వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉందని బయటపడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు సేకరించారని కూడా వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులో ఉంది. అయితే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు గ్రామాల వారీగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు సేకరించి పార్టీకి అందజేశారు. తమ పార్టీ ఐటీ సేవలు అందిస్తున్న కంపెనీకి పార్టీయే ఈ వివరాలు ఇచ్చింది. అయితే సేవామిత్ర, లబ్ధిదారుల వివరాలున్నాయనే నెపంతో వచ్చి దాడులు చేసి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక సమాచారం తెలంగాణ పోలీసులు ఎత్తుకెళ్లడంతో దీని వెనుక కేంద్రం స్థాయిలో కుట్ర జరిగి, తెలంగాణలో ప్రభుత్వం అండదండలతో అది అమలవుతుందని స్పష్టమవుతోంది.