Potti Sreeramulu Telugu University

Potti Sreeramulu Telugu University

Share

Potti Sreeramulu Telugu University is one of the few language universities in the country.

It was established as "Telugu University" on 2nd December 1985 through an Act of Legislation (Act No. 27 of 1985) with head quarters at Hyderabad and campuses at Sri Sailam and Rajahmundry. Later in the year 1989 the Siddhendra Kalakshetram at Kuchipudi merged with the University. The School of Folk and Tribal Lore was established at Warangal during the year 1994.

10/02/2018

ఈనాడు, హైదరాబాద్‌: కాపీలు కొట్టడం, పక్కవారి జవాబు పత్రాలను తీసుకొని రాయడం, పుస్తకాల్లో పేజీలు పరీక్ష గదిలోకి పట్టుకెళ్లడం, చాటుగా చరవాణులను లోపలకు తీసుకెళ్లి వినియోగించడం.. ఇలా ఏదో ఒక రూపంలో పరీక్షల్లో పలువురు విద్యార్థులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా సంస్కృతి కొన్నేళ్లుగా పలు విద్యాసంస్థల్లో కొనసాగుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం గుర్తింపుతో ముషీరాబాద్‌లో నడుస్తున్న ఒక కళాశాలలో ఇటీవల 55 మంది విద్యార్థులు చూసి రాతలకు పాల్పడి పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే కళాశాలలో మరో 37మంది వరకు చూసి రాతలు రాసినట్లు ఉస్మానియా అధికారులు గుర్తించారు. ఇటీవల హైకోర్టు సైతం ఈ తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నగరంలోని పలు విద్యాసంస్థలు పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా పెడుతున్నాయి. తనిఖీలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో పీజీ కోర్సులకు ఈనెల 5 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంతకు ముందే ఎవరూ చూసి రాతలకు పాల్పడవద్దని విద్యార్థులందరికీ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వర్సిటీ ఆవరణలో జరిగే పరీక్షలను సక్రమంగా నిర్వహిస్తే అనుబంధ కళాశాలలపై పట్టు బిగించవచ్చని అధికారులు భావించారు. తెలుగు వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ పరీక్షలు జరుగుతున్న ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్సిటీలోనే ఉంటున్నారు. పరీక్ష గదుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. మూడు నాలుగు రోజులుగా జరిగిన పరీక్షల్లోను ఇదే తరహా తనిఖీలు చేసినట్లు సమాచారం.
నేరుగా అనలేక..: పరీక్ష గదిలో చూసీచూడనట్లు పోయే అధికారులు.. ఇటీవల విద్యార్థులను ఆసాంతం తనిఖీలు చేస్తున్నారు. దీంతో వారి నుంచి కొన్నిచోట్ల అధికారులకు బెదిరింపులు వస్తున్నాయి.నేరుగా ఏమీ అనలేక.. కొందరు విద్యార్థులు వర్సిటీల్లో సమస్యలను ప్రస్తావిస్తూ బెదిరింపులకు దిగుతున్నట్లు ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తరగతులు సక్రమంగా జరిగేలా చూస్తున్నామని, పరీక్షల్లో అవకతవకలు జరగకుండా అందరినీ అప్రమత్తం చేశానని ఆయన వివరించారు.

ఉపకులపతి ఆకస్మిక తనిఖీ: శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగు వర్సిటీ ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ పరీక్ష గదుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. కాగితాలు, చరవాణులు, పుస్తకాలు వంటివి ఉన్న సుమారు పది మంది విద్యార్థులను పట్టుకుని పరీక్ష గది నుంచి బయటకు పంపించేశారు. చూసిరాతలకు పాల్పడిన వారిపై తదుపరి చర్యలు తీసుకొనేందుకు సంబంధిత అధికారులకు బాధ్యతలు అప్పగించారు.

26/01/2018
02/06/2017

UGC Letter reg.:Last reminder to upload Data of Ph.D. Scholars on University Website

Photos 25/05/2017
Photos 27/06/2015

Todays news

26/06/2015

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:తప్పు మీద తప్పు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణను ఇబ్బందులకు గురిచేయాలని చేస్తున్న ప్రతి ప్రయత్నం బూమరాంగ్ అవుతున్నది. తెలంగాణపై ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తూ.. చట్టాన్ని, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించేలా తీసుకుంటున్న ప్రతి చర్యా ఏపీకి నష్టాన్ని కలిగించేదిగా మారుతున్నది. తాజాగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్‌గా తమ రాష్ర్టానికి చెందిన ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వులు జారీ చేయడం.. తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచక తప్పని పరిస్థితిని కల్పించింది. అటు చట్టం, ఇటు న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు, నిబంధనలు ఉన్నప్పటికీ.. సాయం చేద్దామనే ఆలోచనతో ఉన్న తెలంగాణ అధికార యంత్రాంగం ఇకపై ముక్కుసూటిగా వెళ్లాలని భావిస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణలోనున్న పదో షెడ్యూల్‌లోని 97 సంస్థల నిర్వహణపై గురువారం అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సమీక్ష నిర్వహించారు.

షెడ్యూల్ 10లో ఉన్న 97 సంస్థల నిర్వహణ, ఆస్తులు, నిధుల యాజమాన్యం, అధికారుల నియామకాల బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీ అంతగా కావాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని, యూజర్ చార్జీలు చెల్లిస్తేనే ఆ సంస్థలనుంచి సేవలు అందించాలని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో వివాదం సృష్టిద్దామని ఆధిపత్య ధోరణితో ఏపీ తీసుకున్న నిర్ణయం చివరికి బెడిసికొట్టింది.

న్యాయస్థానం చెప్పినా..: ఆరు దశాబ్దాలపాటు చెలాయించిన పెత్తనం సరిపోదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చట్టాన్ని ఉల్లంఘించి, న్యాయస్థానం తీర్పులను కూడా పట్టించుకోకుండా మళ్ళీ.. మళ్ళీ ఆధిపత్య ధోరణికే ఏపీ సర్కారు తెగపడుతున్నది. 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల విషయంలో ఆయా సంస్థలు ఏ రాష్ట్రంలో (భూభాగంలో) ఉంటే ఆ రాష్ర్టానికి అధికారం ఉంటుందని.. వాటి నిర్వహణ, అధికారుల నియామకం, అజమాయిషీ అంతా ఆ రాష్ర్టాలకే ఉంటుందని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా ఉంది.

ఇదే విషయాన్ని ఉమ్మడి రాష్ర్టాల హైకోర్టు తీర్పులోనూ పేర్కొంది. దీని ప్రకారం 10వ షెడ్యూల్ కింద ఉన్న 97 సంస్థలు తెలంగాణకే చెందుతాయి. వాటి ఆస్తులు, డిపాజిట్లు, నిధులపై తెలంగాణ ప్రభుత్వానికే ఆధికారం ఉంటుంది. ఆయా సంస్థలకు అధికారులను నియమించే అధికారం కూడా తెలంగాణకే ఉంటుంది. ఈ అంశాన్ని జీర్ణించుకోలేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఎలాగైనా వివాదం రాజెయ్యాలని, కలహం సృష్టించాలనే దుర్బుద్ధి, కుట్ర, కుతంత్రాలతో పావులు కదిపింది. ఇప్పటికే రెండు సంస్థలకు తమ అధికారులను బాస్‌లుగా నియమించిన ఏపీ.. తాజాగా బుధవారం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు ఎంకే మీనాను డీజీగా నియమించింది. తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఉన్న సీజీజీకి తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు డీజీగా ఉన్నారు.

ఆయన బుధవారం ఉదయం సెలవుపై విదేశాలకు వెళ్లారు. దీంతో ఇన్‌చార్జి బాధ్యతలను ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్‌కు అప్పజెప్పుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇదే అదనుగా ఏపీ ప్రభుత్వం నిబంధనలను తోసిపుచ్చుతూ ఎంకే మీనాను ఆ సంస్థకు డీజీగా నియమించింది. దీంతో మరోసారి వివాదం తలెత్తింది. ఏపీ ప్రభుత్వం కయ్యానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో అదేస్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిస్పందించింది. రాష్ట్రంలోనున్న 10వ షెడ్యూల్ సంస్థల నిర్వహణపై సీఎస్ రాజీవ్ శర్మ సచివాలయంలో గురువారం అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని ఆహ్వానించారు. ఆయన నుంచి సలహాలను కూడా తీసుకున్నారు. 10వ షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్రంలో ఉన్న సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. ఈ సంస్థలకు ఏపీకి ఎలాంటి సంబంధంలేదని, అన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చునన్నారు. ఈ సంస్థలకు రాజకీయ నియామకాలు చేసుకోవచ్చునని సలహా ఇచ్చారు. ఇప్పటివరకు 10వ షెడ్యూల్‌లో ఉన్న కొన్ని సంస్థలకు చెందిన రూ.100 కోట్ల నిధులను ఏపీ సర్కారు వాడేసుకున్న నేపథ్యంలో.. ఆ నిధులు కూడా వెనక్కి రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వానికి ఏజీ ఇచ్చిన సలహాలు ఇలా ఉన్నాయి..
- 10 వషెడ్యూల్‌లో పేర్కొన్నవిధంగా తెలంగాణ రాష్ట్ర భూభాగంలోని సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయి. ఇందులో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు.
- ఏపీ ప్రభుత్వం ఈ సంస్థల సేవలను వినియోగించుకోవాలంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకోవాలి. ఆ తర్వాత తీసుకునే సేవలకు యూజర్ చార్జీలు చెల్లిస్తేనే ఆయా సేవలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. డబ్బులు చెల్లించకపోతే సేవలు అందించేది లేదు.
- 10వ షెడ్యూల్‌కు చెందిన పలుసంస్థల్లో ఇప్పటి వరకు రూ.100 కోట్లను ఏపీ ప్రభుత్వం అక్రమంగా తీసుకున్నది. ఆంధ్రాకు వెళ్లిన ఈ సొమ్మును వెంటనే తిరిగి వెనక్కు తీసుకురావాలి. ఉన్న నిధులను ఆంధ్రాకు తరలిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంస్థలకు చెందిన నిధులపై ఏపీకి ఎలాంటి అధికారం లేదు.
- 10వ షెడ్యూల్ సంస్థలపై ఏపీకి అధికారం ఉందని ఇచ్చిన జీవో చెల్లదు. ఏపీకి ఈ సంస్థల్లో ఎలాంటి అధికారం లేదు.
- బ్యాంకు అకౌంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సంస్థలపై పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికే అధికారం ఉంటుంది. ఈ విషయాన్ని కోర్టుకూడా స్పష్టం చేసిందని బ్యాంకులకు తెలియజేయాలి. బ్యాంకుల్లో ఉన్న ఆయా సంస్థల డిపాజిట్లు, నిధులు, అకౌంట్లన్నీ తెలంగాణకే చెందుతాయని స్పష్టం చేయాలి. ఈ మేరకు ఆయా అకౌంట్లన్నింట్లో తెలంగాణ ప్రభుత్వమే లావాదేవీలు నిర్వహిస్తుందని స్పష్టం చేయాలి. ఈ మేరకు తెలంగాణకు చెందిన అధికారులు చేసే సంతకాలు మాత్రమే చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలి.

పదో షెడ్యూల్‌లో తెలంగాణ పరిధిలో ఉన్న సంస్థలు
1. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్, హైదరాబాద్
2. ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్
3. ఆంధ్రప్రదేశ్ ఫారెస్టు అకాడమీ, రంగారెడ్డి జిల్లా
4. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఏపీసీఓఎస్‌టీ) హైదరాబాద్
5. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, హైదరాబాద్
6. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, హైదరాబాద్
7. స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హైదరాబాద్
8. స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్
9. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్
10. వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్

11. ఏఎంఆర్ ఏపీ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, హైదరాబాద్
12. శ్రీరామానంద తీర్థ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
13. ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ అకాడమీ
14. స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, హైదరాబాద్
15. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్
16. ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్, హైదరాబాద్
17. గిరిజన సంస్కృతి, పరిశోధన సంస్థ, మాసబ్‌ట్యాంక్ హైదరాబాద్
18. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, హైదరాబాద్
19. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ సర్టిఫికేషన్ ఏజెన్సీ, హైదరాబాద్
20. ఆంధ్రప్రదేశ్ లైవ్‌స్టాక్ డిపార్ట్‌మెంట్ ఏజెన్సీ, హైదరాబాద్

21. సెంటర్ ఫర్ ఫారెస్టు అండ్ నాచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ స్టడీస్, రంగారెడ్డి జిల్లా
22. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, హైదరాబాద్
23. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ హైదరాబాద్
24. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ అర్థోమెటిక్ ప్లాంట్స్ బోర్డు, హైదరాబాద్
25. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు, హైదరాబాద్
26. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్
27. ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ, హైదరాబాద్
28. స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, హైదరాబాద్
29. సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెట్‌వర్క్ (శాప్‌నెట్), హైదరాబాద్
30. ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ లాబ్స్, హైదరాబాద్

31. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ, హైదరాబాద్
32. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ సర్వీస్ ఫర్ ది పూర్, హైదరాబాద్
33. మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా, హైదరాబాద్
34. ఆంధ్రప్రదేశ్ రూరల్ లైవ్‌లీఉడ్ ప్రాజెక్టు (ఎంపీయూ) హైదరాబాద్
35. వాటర్ కన్వర్జేషన్ మిషన్
36. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, హైదరాబాద్
37. ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్, హైదరాబాద్
38. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ హైదరాబాద్
39. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్‌సొసైటీ, హైదరాబాద్
40. ఏపీఆర్‌ఈఐ సొసైటీ, హైదరాబాద్

41. ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ, హైదరాబాద్
42. స్టేట్ అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ అండ్ ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (సమితి) హైదరాబాద్
43. సాయిల్ కన్వర్‌జేషన్ టైనింగ్ సెంటర్, హైదరాబాద్
44. స్టేట్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్(స్మిల్దా), హైదరాబాద్
45. మహాత్మా జ్యోతిబాపులే ఆంధ్రప్రదేశ్ బ్యాక్‌వార్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్
46. ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్, హైదరాబాద్
47. హిందీ అకాడమీ, హైదరాబాద్
48. తెలుగు అకాడమీ, హైదరాబాద్
49. సంస్కృత అకాడమీ, హైదరాబాద్
50. ఓరియంట్ మ్యానుస్క్రీప్ట్సు లైబ్రరీ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్

51. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్చీవ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్
52. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, హైదరాబాద్
53. జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్ఛర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, హైదరాబాద్
54. తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్
55. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్
56. ఆర్‌వీఎం (ఎస్‌ఎస్‌ఏ) అథారిటీ హైదరాబాద్
57. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్స్‌బుక్ ప్రెస్, హైదరాబాద్
58. స్టేట్‌సెంట్రల్ లైబ్రరీ, హైదరాబాద్
59. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, హైదరాబాద్
60. ఆంధ్రప్రదేశ్ బయో డైవర్సిటీ బోర్డు, హైదరాబాద్

61. ఆంధ్రప్రదేశ్ గ్రీన్‌కార్ప్స్, సికింద్రాబాద్
62. డైరెక్టరేట్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, హైదరాబాద్
63. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, ఏపీ సొసైటీ ఫర్ నాలెడ్జ్ నెట్‌వర్క్, హైదరాబాద్
64. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్
65. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు, హైదరాబాద్
66. ది సర్వే కమిషనర్ ఆఫ్ వక్ఫ్స్, హైదరాబాద్
67. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనార్టీస్, హైదరాబాద్
68. డైరాతుల్ మారీఫ్, ఓయూ, హైదరాబాద్
69. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అజ్ అకాడమీ, హైదరాబాద్
70. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ, హైదరాబాద్

71. ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్‌సెంటర్, రాజేంద్రనగర్
72. ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్‌సెంటర్, హసన్‌పర్తి (వరంగల్ జిల్లా)
73. రాజీవ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయిమెంట్ మిషన్ ఇన్ ఏపీ, హైదరాబాద్
74. సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్ హైదరాబాద్
75. సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్ఫరెన్సీ, హైదరాబాద్
76. శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, హైదరాబాద్
77. ఆంధ్రప్రదేశ్ సర్వే ట్రైనింగ్ అకాడమీ, హైదరాబాద్
78. అంబేద్కర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్, హైదరాబాద్
79. ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, హైదరాబాద్
80. విక్టోరియా మెమోరిల్ హోం (రెసిడెన్షియల్ స్కూల్) హైదరాబాద్

81. ఏపీటీడబ్ల్యూ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్
82. డాక్టర్ వైఎస్సార్‌స్టడీ సర్కిల్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, సికింద్రాబాద్
83. ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కమిషన్, సికింద్రాబాద్
84. ఆంధ్రప్రదేశ్ సొషల్ వెల్ఫేర్ అడ్వజరీ బోర్డు, హైదరాబాద్
85. స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, సికింద్రాబాద్
86. ది ట్రైనింగ్ సెంటర్ ఫర్ టీచర్స్ ఆఫ్ విజువల్లీ హాండిక్యాప్డ్, సికింద్రాబాద్
87. స్టడీ సర్కిల్ ఫర్ డిజేబుల్డ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్
88. ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హైదరాబాద్
89. ట్రక్ ఆపరేటర్స్ హైవే ఎమినిటీస్ సొసైటీ (తోహాస్)హైదరాబాద్
90. నేషనల్ క్యాడేట్ కార్ప్స్ డైరెక్టరేట్, హైదరాబాద్

91. శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ కల్చరల్ సొసైటీ, మాదాపూర్, హైదరాబాద్
92. డాక్టర్ వైఎస్సార్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, హైదరాబాద్
93. స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మిషన్స్, చంచల్‌గూడ, హైదరాబాద్
94. ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్
95. వీవర్స్ ట్రైనింగ్‌సెంటర్ కరీంనగర్ (డబ్ల్యూటీసీ) కరీంనగర్
96. పవర్‌లూమ్ సర్వీస్‌సెంటర్, సిరిసిల్లా, కరీంనగర్
97. ఖాదీ గ్రామోద్యోగ మహా విద్యాలయ, హైదరాబాద్

ఏపీ రాష్ర్టానికి చెందిన సంస్థలు
1. శ్రీపద్మావతి మహిళా వర్సిటీ, తిరుపతి
2. ద్రవిడ యూనివర్సిటీ, కుప్పం
3. ఎక్స్‌టెన్షన్ ట్రెయినింగ్ సెంటర్ బాపట్ల
4. ఎక్స్‌టెన్షన్ ట్రెయినింగ్ సెంటర్, శ్రీకాకుళం
5. ఎక్స్‌టెన్షన్ ట్రెయినింగ్ సెంటర్ శ్రీకాళహస్తి
6. శ్రీప్రగడ ఓటయ్య మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్, నెల్లూరు
7. ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ ఆప్ బ్యాక్‌వార్డ్ క్లాసెస్, విశాఖపట్నం
8. తెలుగు చేనేత పారిశ్రామిక శిక్షణ కేంద్రం, అనంతపురం
9. స్టేట్ ఎనిమల్ హజ్బండరీ ట్రెయినింగ్ సెంటర్, తూర్పుగోదావరి
10. స్టేట్ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీస్, కాకినాడ

11/02/2015

Today i attended a meeting regrading finalization of the Telugu Dialect Dictionaries of 23 districts. Our Honorable VC Prof.E Shiva Reddi, Registrar Prof. K Thomasaiah, Project Coordinator Prof K.Ashirwadam, Prof. K Ramanjaneyulu, Dean, School of Language Development, Dr. G. S Gabriel, Head, Department of Linguistics, Prof. Reddy Syamala, Controller of Examinations, B Venkateswarlu, Associate Professor, and Prof. B Ramakrishna Reddy, Prof. V Swarajya Lakshmi, Prof K. Ramesh Kumar discussed about editing the dictionaries.

Telugu University may be renamed after Suravaram 31/12/2014

Telugu University may be renamed after Suravaram The Telangana government might soon issue orders changing the name of the Potti Sreeramulu Telugu University, in the aftermath of the State bifurcation. The names of Suravaram Prathap Reddy and Bammera Pothana are in

Photos 31/12/2014

Contact Classes in Distance Education from tomorrow

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Hyderabad

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm