Bhashyam Blooms

Bhashyam Blooms

Share

Bhashyam Blooms is a school that thinks and acts differently. Bhashyam Blooms firmly believes qualit

14/06/2025

Bhashyam MEDEX fulfilling Fortunes of Future Doctors in NEET - 2025.

☝️☝️🔥

02/06/2025

Bhashyam's
Timeless Tradition of Excellence in JEE Advanced - 2025.

13/05/2025

AISSE - 2025 (CBSE - X) Results....
Bloomites Legacy of Trailblazing Success..... !

30/04/2025

Bhashyam TS SSC Result - 2025 !

With Credible Credentials
Climbing the Crest of Conquest !

23/04/2025

BHASHYAM’s Blazing Rise in SSC 2025 !
Highly thrilled to announce that our Bhashyamite, Y. Nehanjani scored 600/600 in AP SSC 2025. 206 got more than 590, 6635 more than 500 marks. Thank you for your consistent and constant support – Bhashyam Rama Krishna

19/04/2025

జెఈఈ మెయిన్-2025 ఫలితాలలో భాష్యం అసామాన్య ప్రతిభ
ఫిమేల్ కేటగిరిలో 100 పర్సంటైల్ తో ఆలిండియా టాపర్ గా సాయిమనోజ్ఞ
ఆంధ్రప్రదేశ్ నుండి 100 పర్సంటైల్ సాధించిన ఏకైక విద్యార్థి
జెఈఈ మెయిన్ - 2025 ఫలితాలలో భాష్యం ఐఐటి జెఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో జి.సాయిమనోజ్ఞ ఆంధ్రప్రదేశ్ నుండి 100 పర్సంటైల్ సాధించిన ఏకైక విద్యార్థిగా చరిత్ర సృష్టించిందన్నారు. జి.సాయిమనోజ్ఞ 100 పర్సంటైల్ తో పాటు ఫిమేల్ కేటగిరిలో ఆలిండియా టాపర్ గా నిలిచి ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 18వ ర్యాంకును సాధించిందన్నారు. అదేవిధంగా కె. సాయి షణ్ముఖ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 52వ ర్యాంకును మరియు ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఆలిండియా 2వ ర్యాంకును కైవసం చేసుకున్నారని తెలిపారు. ఈ ఘన విజయాలకు న్కూల్ స్థాయి నుండే మేమందించే భాష్యం ఐఐటి ఫౌండేషన్ కరిక్యులమే కారణమన్నారు. ఈ విజయానికి తోడ్పడిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు ఛైర్మన్ రామకృష్ణ, భాష్యం విద్యాసంస్థల వైస్ ఛైర్మన్ హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ లు అభినందనలు తెలిపారు.

19/04/2025

Bhashyam's Legacy continues in JEE Main-2025.

12/04/2025

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన భాష్యం విద్యార్థులు

ఇంటర్ పరీక్షా ఫలితాలలో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. శనివారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో జూనియర్ ఎంపీసీ విభాగంలో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు ఎన్. శ్రీరామ్, డి.మణికంఠ, కె. చిన్మయి గౌడ్, యాసిన్ సాజిద్, పి.సంజయ్ లు 470 మార్కులకుగానూ 466 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో మొత్తం 420 మంది విద్యార్థులు 460కి పైగా మార్కులు సాధించారన్నారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో ఎన్.జయశ్రీ 1000 మార్కులకుగానూ 991 మార్కులు, జె.తారణి, కె.కావ్యశ్రీలు 990 మార్కులు సాధించారన్నారు. సీనియర్ విభాగంలో మొత్తం 218 మంది విద్యార్థులు 980కి పైగా మార్కులు సాధించారని రామకృష్ణ తెలిపారు. అదేవిధంగా జూనియర్ బైపీసీ విభాగంలో భాష్యం మెడెక్స్ విద్యార్థి ఎ. ప్రమోదలక్ష్మి 440 మార్కులకుగానూ 436 మార్కులతో పాటు పది మంది విద్యార్థులు 435 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. మొత్తం 84 మంది విద్యార్థులు 430కి పైగా మార్కులు సాధించారన్నారు. సీనియర్ బైపీసీ విభాగంలో జి. హాసిని, వై.నాగశరణ్యలు 1000 మార్కులకుగానూ 989 మార్కులు, ఎల్. నవ్య, షేక్ వసీమా, బి. భవ్య లు 988 మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ఛైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ ఇంతటి ఘన విజయాలు సాధించడానికి మా అత్యుత్తమ విద్యా ప్రణాళికలే కాకుండా అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను ఛైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ ఛైర్మన్ హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ రామ్ లు అభినందించారు.

13/03/2025

Happiness is the most beautiful color in life. May God bless you with more colours of happiness, joy and jubilation. Happy Holi - Bhashyam Rama Krishna

🌈 ❤️

Photos from Bhashyam Blooms's post 13/02/2025

కష్టానికి ప్రత్యామ్నయం లేదు
జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే కష్టపడాల్సిందే
జేఈఈ టాపర్ మనోజ్ఞను అభినందించిన మంత్రి లోకేష్
అమరావతి: జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కష్టపడటం ఒక్కటే మార్గం, ఎటువంటి దగ్గర దారులు ఉండవని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. JEE (Mains) - 2025లో నూటికి నూరుశాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞను మంత్రి లోకేష్ అభినందించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ...రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచావు, మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఏ అవసరం ఉన్న ఒక్క మెసేజ్ పెట్టు అన్నగా అండగాఉంటానని ఫోన్ నెంబర్ ఇచ్చారు. ప్రతి బిడ్డ విజయంలో తల్లిపాత్ర ఏంటో నాకు తెలుసు అంటూ ఆమె తల్లిని కూడా లోకేష్ సత్కరించారు. మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న మనోజ్ఞ తండ్రితో కరికులం ప్రక్షాళనపై చర్చించారు. ఇండస్ట్రీకి అవసరమైన కరికులం ఉండాలనేది నా ఆలోచన, జాబ్ రెడీ యూత్ ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువతను ప్రోత్సహించలనేది నా ధ్యేయమని అన్నారు. కేజీ టు పీజీ విద్యలో చేస్తున్న మార్పుల గురించి వివరించారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ చదివి సాధించలేని ఉద్యోగం... నాలుగు నెలలు అమీర్ పేట లో కోర్స్ చేసి ఎలా సాధిస్తున్నారనేది నా ప్రశ్న. విద్యార్థి కాలేజీ నుంచి బయటకు రాగానే ఉద్యోగం సాధించేలా తయారు కావాలన్నది తన ఆకాంక్షగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


Bhashyam Blooms
Hyderabad
500039

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm