29/06/2022
We are hiring tele callers with basic 15000 salary at sr nagar contact immediately 9848085400
Swamy vivekananda educational academy
we are providing genuine information about entrance exams and colleges details for all admissions
02/08/2021
to call students for joining engineering medicine extra
12/08/2014
హైదరాబాద్: ఎంసెట్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి పొరపాటు చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. తమ వ్యక్తిగత ముద్ర, ప్రాబల్యం కోసం విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ ఆడుకోవడం దురదృష్టకరం అన్నారు.
కెసిఆర్ 70 రోజుల పాలనలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ప్రజలను ఇబ్బందిపెట్టే విధంగానే కేసీఆర్ పాలన ఉందని పొన్నాల విమర్శించారు.
12/08/2014
హైదరాబాద్: మీరు ఏ పథకమైనా పెట్టుకోండి ఏ రోజు అడ్మిషన్ అయితే ఆ రోజే ఫీజులు చెల్లించాలని తెలంగాణ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధి రమేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మీద నమ్మకం లేకనే అడ్మిషన్ రోజునే ఫీజులు చెల్లించాలని అడుగుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 31లోపు పాత బకాయిలన్నీ చెల్లించాలని ఆయన కోరారు.ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో పాత విధానాలే కొనసాగించాలన్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం(ఫాస్ట్) కమిటీ ప్రశ్నలకు రమేష్ ఘాటుగా స్పందించారు. మీరు కాలేజీలు వ్యాపారంలాగా పెట్టుకున్నారా? అని కాలేజీ యాజమాన్యాలను ఫాస్ట్ కమిటీ ప్రశ్నించింది. తాము వ్యాపారం చేయడం కాదు, తమ డబ్బులతోనే జెఎన్టియు, ఎంసెట్ ఆఫీసులు నడుస్తున్నాయని రమేష్ పేర్కొన్నారు.
01/08/2014
ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై తెలంగాణా ప్రభుత్వం...........
తెలంగాణా ప్రభుత్వం ఈ సమస్యలను సామరస్య ధోరణితో పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకపోగా, ఆంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగి సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఆంధ్రరాష్ట్ర మంత్రులు కూడా వారి విమర్శలకు అంతే ధీటుగా బదులిస్తున్నారు. అయితే ఈ వివాదాల వలన లక్షలాది విద్యార్ధుల జీవితాలు అస్తవ్యస్తమవుతాయనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చొరవ తీసుకొని, జనాభా ప్రాతిపదికన 52:48 నిష్పత్తిలో ఇరు ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్ మెంట్ ఖర్చు భరిద్దామని ప్రతిపాదించారు. ఉన్నత విద్యామండలి అంచనా ప్రకారం ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం మొత్తం రూ.4000 కోట్లు అవసరం ఉంటుందని, దానిలో తమ ప్రభుత్వం 52శాతం భరించేందుకు సిద్దంగా ఉందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు తెలంగాణా ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. ఆయన ఈవిధంగా చొరవ చూపడం చాలా అభినందనీయం. తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఈ సమస్యకు బహుశః ఇదే పరిష్కారం సూచించవచ్చును.
01/08/2014
ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై తెలంగాణా ప్రభుత్వం పెట్టిన స్థానిక మెలికతో ఇంజనీరింగ్ కౌన్సిలింగు చాలా గందరగోళంగా మారింది. ఆంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కౌన్సిలింగుకు తెలంగాణా విద్యార్దులెవరూ వెళ్ళవద్దని స్వయంగా తెలంగాణా విద్యాశాఖ మంత్రే పిలుపునీయడంతో లక్షలాది విద్యార్ధులు అయోమయంలో పడ్డారు. తెలంగాణా ప్రభుత్వం 1956సం.ను స్థానికతకు ప్రతిపాదికగా తీసుకోవడంతో తెలంగాణాలో పుట్టిపెరిగిన ఆంధ్రా విద్యార్ధులే కాక, తెలంగాణా విద్యార్ధులు కూడా అయోమయంలో పడ్డారు. కౌన్సిలింగుకు వెళితే ఒక సమస్య వెళ్ళకపోతే మరొక సమస్య అన్నట్లు తయారయింది వారి పరిస్థితి.
తెలంగాణా ప్రభుత్వం ఈ సమస్యలను సామరస్య ధోరణితో పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకపోగా, ఆంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగి సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఆంధ్రరాష్ట్ర మంత్రులు కూడా వారి విమర్శలకు అంతే ధీటుగా బదులిస్తున్నారు. అయితే ఈ వివాదాల వలన లక్షలాది విద్యార్ధుల జీవితాలు అస్తవ్యస్తమవుతాయనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చొరవ తీసుకొని, జనాభా ప్రాతిపదికన 52:48 నిష్పత్తిలో ఇరు ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్ మెంట్ ఖర్చు భరిద్దామని ప్రతిపాదించారు. ఉన్నత విద్యామండలి అంచనా ప్రకారం ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం మొత్తం రూ.4000 కోట్లు అవసరం ఉంటుందని, దానిలో తమ ప్రభుత్వం 52శాతం భరించేందుకు సిద్దంగా ఉందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు తెలంగాణా ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. ఆయన ఈవిధంగా చొరవ చూపడం చాలా అభినందనీయం. తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఈ సమస్యకు బహుశః ఇదే పరిష్కారం సూచించవచ్చును. అందువల్ల తెలంగాణా ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకొంటే అందరూ హర్షిస్తారు.
01/08/2014
హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరీపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తోందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
1956 స్థానికతపై కేసీఆర్ అయిన... తన గ్రామంలో సర్టిఫికెట్ తెచ్చుకోగలడా అంటు తెలంగాణ సీఎంను కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వాల వైఖరీ వల్ల బీసీ, ఎస్టీ, ఎస్పీ విద్యార్థులే నష్టపోతున్నారని తెలిపారు. పరిపక్వతతో ఆలోచించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్బంగా కిషన్ రెడ్డి హితవు పలికారు.