28/06/2025
ప్రతిక్షణం మా పాఠశాల అభివృద్ధి లో మావెన్నెంటే ఉండి మాకు అన్నివిధాలుగా ప్రోత్సాహం మరియు సహకారం అందిస్తున్న డైనమిక్ సెక్రటరీ సైదులు (IFS)సార్ గారికి, తెలంగాణ గురుకుల విద్యాలయం నాగార్జున సాగర్ లో 2001 బ్యాచ్ విద్యార్థి ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నందు సిఐగా విధులు నిర్వర్తిస్తున్న గౌరవనీయులు శ్రవణ్ కుమార్ గారికి, మరియు (నావా) నాగార్జునసాగర్ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులందరికి మా విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు..💐💐💐నాగార్జునసాగర్ పాఠశాలలో ఉన్న అతిపెద్ద సమస్య నీటి సమస్య అని బోరు వేస్తె ఆ సమస్యను కొంత మేరకు తీర్చవచ్చు అని నావ జనరల్ సెక్రటరీ శివాజీ గారిని కోరటం తో వారు గ్రూప్ లో చెప్పగానే ఆ అవకాశం నాకివ్వండి నేను తీర్చుతాను అని నావ సభ్యులైన శ్రవణ్ కుమార్ గారు ముందుకు రావటం జరిగింది.
సంవత్సరాలనుండి ఇక్కడ బోర్ పడదనే విశ్వాసం తో ముందేవ్వరు ప్రయత్నించలేదు....
కానీ మేము కోరగానే భగీరత ప్రయత్నం నకు అంగీకరించి పాఠశాల కి విచ్చేసి రాత్రి 12 గంటల తర్వాత బోరుబండి వస్తే మాతో పాటు రాత్రి మొత్తం మెలకువగా ఉండి బోరు త్రవ్వించి నీళ్లు నేలను తాకగానే ఏంతో సంతోషం తో దానికి కావాల్సిన మోటారు, స్టార్టర్, కేబుల్ వైర్ కి దాదాపు గా ఒక లక్ష రూపాయలు తాను చదువుకున్న పాఠశాల కి ఖర్చుచేసిన మనసున్న మహారాజు మా పాఠశాల పూర్వ విద్యార్థి శ్రవణ్ కుమార్ గారికి మరొక్క సారి హృదయ పూర్వక ధన్యవాదములు...💐💐💐🙏
ఇట్లు,
ప్రిన్సిపాల్
ఎంజేపీ నాగార్జున సాగర్ (బాలుర )