Katta Srinivas

Katta Srinivas Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Katta Srinivas, Tutor/Teacher, Hyderabad.

02/10/2015
22/07/2013
విజయవాడ నగరంలోని మొగల్రాజపురం గుహలు చూడదగినవి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దానికి చెందిన ఈ గుహల్లో చెక్కిన మూడు దేవాలయాల్లో ...
11/05/2013

విజయవాడ నగరంలోని మొగల్రాజపురం గుహలు చూడదగినవి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దానికి చెందిన ఈ గుహల్లో చెక్కిన మూడు దేవాలయాల్లో ఒకటి మాత్రమే ప్రస్తుతం మంచి స్థితిలో వుంది. విష్ణుకుండినుల కాలానికి చెందిన ఉండవల్లి గుహలు అందమైన శిల్ప పనితనానికి నిదర్శనం. ఉండవల్లి గుహల్లోని అనంతపద్మనాభ స్వామి భారీ విగ్రహం మనోహరంగా వుంటుంది.

ఈ గుహలను క్రీశ ఐదవ శతాబ్దములో నిర్మించినట్లు చెబుతాతు. వీటిలో నటరాజ స్వామి, వినాయకుడు, మొదలగున వారి విగ్రహములు చూడవచ్చు. ఇక్కడ ఉన్న అర్ధనారీశ్వరుని విగ్రహము దక్షిణ భారతదేశములో మరెక్కడా కనిపించదు.

14/02/2013

అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు అన్న మాటలివి. ‘‘అఫ్జల్ గురుకు ఉరి శిక్ష విధించడం ద్వారానే యావజ్జాతి మనస్సాక్షి సంత్రుప్తి చెందుతుంది’’.

అఫ్జల్ గురు విషయంలో కూడా ఉరిశిక్ష ఖాయం కావడానికి కారణం కేసులోని అంశాల కన్నా కూడా ప్రజలలో వ్యక్తమైన మనోభావాలే ముఖ్య పాత్రను పోషించాయిని వీరి వాదన. దీనితో పాటు వివిధ గ్రూపులు, వ్యక్తులు చేసే ఒత్తిడి కూడా కేసుల భవితవ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. భారత గణతంత్ర రాజ్యవ్యవస్థకు ప్రాతిపదికగా ఉన్న సూత్రం: మన ప్రజల హక్కులకు, స్వేచ్ఛలకు అసలు రక్షణ వీధుల్లో వ్యక్తమయ్యే ప్రజాభిప్రాయం (దీనినే సెంటిమెంట్ అంటాం) కాదు. పౌరుల హక్కులకు, స్వేచ్ఛలకు సంరక్షకురాలు న్యాయసూత్రాలు మాత్రమే. ఈ న్యాయసూత్రాలను స్థిరంగా అన్వయించాల్సి ఉంటుంది. ప్రతీకారం అనే సూత్రం ఆధారంగా న్యాయ తీర్పులను ఖరారు చేయలేం. ప్రపంచ వ్యాప్తంగా ఉరి శిక్షకు వ్యతిరేకత పెరుగుతున్న కాలంలో భారతదేశంలో మాత్రం ఈ శిక్షలు ఇంకా విధించబడ్తున్నాయి. హేతుబద్ధమైన న్యాయసూత్రాల ఆధారంగా కాకుండా ప్రతీకార వాంఛ ప్రజలలో వ్యక్తమయ్యే సహేతుకమైన, లేదా నిర్హేతుకమైన భావోద్వేగాల ఆధారంగా న్యాయస్థానాలు భిన్న సందర్భాలలో భిన్న రకాల తీర్పులను వెలువరుస్తున్నాయి.
...................

ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్. పి.సథాశివం, జస్టిస్ ఫక్కీర్ ఖలీఫుల్లా ఒక కేసులో తీర్పు చెప్తూ మోహీందర్ సింగ్ అనే నేరస్థునికి విధించిన మరణ శిక్షను తగ్గించారు. ఈ కేసులో నేరస్థుడు తన భార్యను, బిడ్డను చంపాడు. ఈ నేరస్థుడు అంతకు ముందు ఒక బాలికపై చేసిన అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తూ పెరోల్లో ఉండగా ఈ హత్యలకు పాల్పడ్డాడు. అయినా కూడా ఇలాంటి నేరస్థునికి విధించిన మరణ శిక్షను కూడా అత్యున్నత న్యాయస్థానం తగ్గించింది
................................

అయితే ఈ తీర్పును ఇచ్చిన వారం రోజుల్లోనే మరో కేసులో ఇందుకు విరుద్ధమైన ఒక తీర్పు చెప్పింది. ఈ కేసులో సుందరరాజన్ అనే నిందితునికి విధించిన మరణ శిక్ష సమంజసమేనని కోర్టు తీర్పు చెప్పింది. ఈ నిందితుడు ఏడేళ్ళ బాలున్ని కిడ్నాప్ చేసి హత్య చేసాడు. ఈ కేసులో తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్.సథాశివం, జస్టిస్.జగదీశ్ ఖెహర్ లు ఈ కేసులో మరణ శిక్షను ఖాయం చేయడానికి అనేక కారణాలు చెప్తూ ‘‘వంశాంకురమైన మగ సంతానం కోల్పోవడం వల్ల ఆ బాలుని తల్లిదండ్రులు అనుభవించిన బాధను కూడా చూడాలి’’ అని పేర్కొన్నారు. ఈ తీర్పును జాగ్రత్తగా పరిశీలిస్తే నాయస్థానాలు ఇచ్చేవాదనలో ఉన్న లింగవివక్ష కూడా అర్థం అవుతుంది.
............................................

1984లో బ్రిటన్‌లో జరిగిన భారత దౌత్యవేత్త హత్యకు ప్రతీకారమా అన్నట్టుగా వెనువెంటనే మక్బూల్ భట్‌ను ఉరితీశారు. అటువంటి కాఠిన్యపు సంకేతం అవసరమే అనుకుని ఉండవచ్చు. కానీ, అది కాశ్మీర్ ఉద్యమాన్ని రాజేసి, రగిలించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒమర్ అబ్దుల్లా, ఈ మధ్యనే కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంటున్న కాశ్మీర్‌లో, తిరిగి మరో కాశ్మీరీని ఉరితీస్తే పరిస్థితి మొదటికి వస్తుందని భయపడడంలో తప్పేమీ లేదు. మొన్నటి దాకా కేంద్రం కూడా ఇటువంటి ధోరణిలోనే ఆలోచిస్తూ ఉన్నది. మరి, ఉగ్రవాదం విషయంలో కఠినంగానే వ్యవహరిస్తుందని ప్రపంచానికి, భారతీయ సమాజానికి చాటడమే అన్నిటికంటె ప్రధానమని కేంద్రం అకస్మాత్తుగా ఎందుకు నిర్ధారణకు వచ్చిందో తెలియదు.
........................................

అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేసిన పద్ధతిపై, అతని కుటుంబ సభ్యులకు ముందుగా సమాచారం ఇవ్వకపోవడంపై జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రితో సహా అనేకులు అభ్యంతరాలు చెబుతున్నారు.
........................................

ఉరి ప్రక్రియ గురించిన వివాదాలతో పాటు, అఫ్జల్ గురుకు న్యాయసహాయం పూర్తిగా అందలేదని, అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అవకాశాలు కల్పించలేదని హక్కుల సంఘాలు చేస్తున్న వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. ఇవికాక, గురు ఉరితీత వెనుక రాజకీయ కారణాలు, పరిగణనలు ఉన్నాయని వస్తున్న విమర్శ కేంద్రప్రభుత్వాన్ని, దానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఇబ్బందిపెట్టేటట్టే కనిపిస్తోంది.
..........................................

ప్రస్తుతం మరణ దండనను ప్రస్తుతం 95 దేశాలు నిషేధించగా కేవలం 58 దేశాలలో మాత్రమే ఆచరణలో ఉన్నప్పటికీ మిగిలినవి గత 10 సంవత్సరాలుగా దానిని విధించనివి లేదా కేవలం యుద్ధకాలం వంటి కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే అనుమతించేవి. ఏమైనప్పటికీ, ప్రపంచ జనాభాలో 60%కి పైగా ప్రజలు, విచారణలలో ఉరిశిక్షను అమలు చేస్తూ సమీప భవిష్యత్తులో దానిని ఎత్తివేసే యోచన లేని ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నాలుగు దేశాలలో (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఇండియా, యునైటెడ్ స్టేట్స్ మరియు ఇండోనేషియా) నివసిస్తున్నారు.
................................................

ప్రారంభ న్యూ ఇంగ్లాండ్లో, బహిరంగ మరణశిక్షలు గంభీరమైన మరియు విషాదకర సందర్భాలుగా ఉండేవి, కొన్నిసార్లు భారీ సమూహాలు హాజరయ్యేవారు, వీరు సువార్త సందేశం కూడా వినేవారు మరియు స్థానిక బోధకుల మరియు రాజకీయనాయకుల వ్యాఖ్యానం కూడా ఉండేవి. కనెక్టికట్ కోరన్ట్ నమోదుచేసిన డిసెంబర్ 1, 1803 నాటి అటువంటి ఒక బహిరంగ మరణశిక్షను గురించి తెలియచేస్తూ, "సమావేశమంతా ఒక క్రమమైన మరియు గంభీర పద్ధతిలో నడుపబడింది, ఇతర దేశాలలో ఇటువంటి సందర్భాలతో పరిచయం ఉన్న ఒక మర్యాదస్తుడు అటువంటి యుక్తమైన మరియు గంభీరమైన సమావేశం న్యూ ఇంగ్లాండ్ లో తప్ప మరెక్కడా జరగదని వ్యాఖ్యానించారు" అని పేర్కొంది.చాలా కాలంగా ప్రపంచంలో అధికభాగంలో మరణశిక్షలు తక్కువ బాధాకరంగా, లేదా మరింత కారుణ్యమైనవిగా ఉండాలనే ధోరణులు ఊపందుకున్నాయి. ఈ కారణంగానే 18వ శతాబ్దపు చివరి సంవత్సరాలలో ఫ్రాన్స్ గిలెటిన్ ను అభివృద్ధి పరచగా బ్రిటన్ ఈడ్చడం మరియు ఖండించడాన్ని 19వ శతాబ్ద ప్రారంభంలో నిషేధించింది. నిందితుడిని నిచ్చెన లాగివేయడం లేదా బల్ల లేదా బాల్చీ తన్నడం ద్వారా వ్రేలాడేటట్లు చేయడంవలన ఊపిరిఆడకపోవడం వలన మరణించేటట్లు చేయడానికి బదులుగా వ్యక్తిని ఎక్కువ దూరం నుండి వ్రేలాడతీసి అతని మెడను స్థానభ్రంశం చేసి వెన్నెముక విరుగునట్లు చేసే పొడవుగా జార్చి "వ్రేలాడదీయుట"ను ప్రవేశపెట్టారు. U.S.లో, ఉరితీయడానికి మరింత కారుణ్యమైన ప్రత్యామ్నాయాలుగా విద్యుత్ కుర్చీ మరియు వాయు ప్రదేశం ప్రవేశపెట్టబడ్డాయి, కానీ విషపు ఇంజక్షన్ వాటన్నిటినీ ప్రక్కకునెట్టింది, అయితే ఇది చివరకు ఎక్కువ బాధను కలిగించేదిగా విమర్శించబడింది. ఏదేమైనా, కొన్ని దేశాలు ఇంకా నిదానంగా ఉరితీసే పద్ధతులు, కత్తితో తల నరకడం మరియు రాళ్ళతో కొట్టడం కూడా అమలు చేస్తున్నాయి, అయితే చివరిది అరుదుగా అమలవుతుంది.
................................

747 మరియు 759ల మధ్య చైనాలో మరణశిక్ష నిషేధించబడినది. ఇంగ్లాండ్ లో, 1395లో వ్రాయబడిన ది ట్వెల్వ్ కంక్లూజన్స్ ఆఫ్ ది లోల్లార్డ్స్ నందు దీనికి వ్యతిరేకంగా ఒక బహిరంగ ప్రకటన చేర్చబడింది. 1516లో ముద్రించబడిన సర్ థామస్ మోరే యొక్క యుటోపియా , మరణశిక్ష యొక్క ప్రయోజనాలను చర్చించింది కానీ స్థిరమైన నిర్ణయాన్ని ప్రకటించలేదు. దగ్గరి గతంలో మరణశిక్షకు వ్యతిరేకత 1764లో ముద్రించబడిన, ఇటాలియన్ రచయిత సీజర్ బెకారియా యొక్క గ్రంధం డి డెలిట్టి ఎ డెల్లె పెనే ("ఆన్ క్రైమ్స్ అండ్ పనిష్మెంట్స్")నుండి మొదలయ్యింది. ఈ గ్రంధంలో, అన్యాయాన్ని వివరించడమొక్కటే లక్ష్యంగాకాక, సాంఘిక సంక్షేమం, హింస మరియు మరణశిక్షల దృష్టి కోణాలనుండి దీని నిరర్ధకతను బెకారియ వెల్లడించారు. ఈ గ్రంధంచే ప్రభావితమై, వివేకవంతుడైన చక్రవర్తి మరియు ఆస్ట్రియా యొక్క భావి చక్రవర్తిగా ప్రసిద్ధుడైన, హబ్స్బర్గ్ యొక్క గ్రాండ్ డ్యూక్ లేపోల్ద్ II, అప్పటి-స్వతంత్ర గ్రాండ్ డ్యుచ్ ఆఫ్ టుస్కానీ లో మరణశిక్షను నిషేధించారు, ఇది ఆధునిక కాలంలో మొదటి శాశ్వత నిషేధం. నవంబర్ 30, 1786న లియపోల్డ్ వాస్తవంగా అధికారంలోకి వచ్చాక మరణశిక్షలను ఆపివేసి(చిట్టచివరిది 1769లో జరిగింది), మరణశిక్షను నిషేధించిన పీనల్ కోడ్ సంస్కరణను ప్రచారంలోకి తెచ్చి తనరాజ్యంలో మరణశిక్షకు ఉపయోగించే పరికరాలన్నిటినీ నాశనం చేయమని ఆజ్ఞాపించారు. 2000లో టుస్కానీ యొక్క ప్రాంతీయ అధికారులు ఈ సంఘటనను సంస్మరించుకుంటూ నవంబర్ 30న సంవత్సరీక సెలవును ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 300 నగరాలు ఈ సంఘటనను సిటీస్ ఫర్ లైఫ్ డేగా సంస్మరించుకుంటున్నాయి.
దస్త్రం:Leopold II as Grand Duke of Tuscany by Joseph Hickel 1769.jpg
టుస్కానీ యొక్క గొప్ప ప్రభువైన పీటర్ లియోపోల్డ్ II, జోసెఫ్ హికెల్ చిత్రం, 1769
రోమన్ రిపబ్లిక్, 1849లో మరణశిక్షను నిషేధించింది. వెనిజుల దీనిని అనుసరించి 1863లో మరణశిక్షను నిషేధించింది మరియు శాన్ మారినో కూడా 1865లో ఇదేవిధంగా నిషేధించింది. శాన్ మారినోలో 1468లో చివరిసారిగా మరణశిక్ష విధించబడింది. పోర్చుగల్ లో, 1852 మరియు 1863లలో శాసనపరమైన ప్రతిపాదనల తర్వాత 1867లో మరణశిక్ష నిషేధించబడింది.
యునైటెడ్ కింగ్డంలో ప్రయోగాత్మకంగా ఐదు సంవత్సరాలకు 1965 లోను మరియు శాశ్వతంగా 1969 లోను హత్యానేరానికి దీనిని నిషేధించారు, (రాజద్రోహం, హింసతో కూడిన పైరసీ, రాయల్ డాక్ యార్డ్స్ లో తగలబెట్టటం మరియు మరణార్హనేరాలైన అనేక యుద్ధకాల సైనిక నేరాలను మాత్రం మినహాయించి) చిట్టచివరి మరణదండన 1964లో విధించబడింది. 1998లో శాంతి నెలకొన్న సమయంలో అన్ని నేరాలకు నిషేధించబడింది.
కెనడా 1976లో, ఫ్రాన్స్ 1981లో మరియు ఆస్ట్రేలియా 1985లో దీనిని నిషేధించాయి. 1977లో, ఐక్యరాజ్యసమితి సాధారణసభ ఒక వ్యావహారిక తీర్మానంలో ప్రపంచవ్యాప్తంగా "మరణశిక్షను నిషేధించాలనే అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని, దానిని విధించడానికి అవకాశం ఉన్న నేరాల సంఖ్యను క్రమంగా పరిమితం చేయడం" అవసరమనే అభిప్రాయాన్ని బలపరచింది.
యునైటెడ్ స్టేట్స్ లో, మే 18, 1846 న మరణశిక్షను నిషేధించిన మొదటి రాష్ట్రం మిచిగాన్. 1972-1976ల మధ్య ఫర్మాన్ v. జార్జియా కేసుని ఆధారం చేసుకొని మరణశిక్ష రాజ్యాంగ విరుద్దగా ప్రకటించబడింది, కానీ 1976లో గ్రెగ్ v. జార్జియా కేసులో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మరణశిక్షకు అనుమతి తిరిగి ప్రవేశపెట్టబడింది అట్కిన్స్ v. వర్జీనియా కేసులో (బుద్ధిమాంద్యతకు ఆధారరేఖ అయిన ప్రజ్ఞా సూచీ 70 కంటే తక్కువ ఉన్న వారికి మరణశిక్ష విధించడం రాజ్యాంగవిరుద్ధం) మరియు రోపర్ v. సిమ్మన్స్ కేసులో మరణశిక్షకు మరిన్ని పరిమితులు ప్రవేశపెట్టబడ్డాయి (నేరం జరిగినపుడు ముద్దాయి వయసు 18 సంవత్సరాలకంటే తక్కువ ఉన్నపుడు మరణశిక్ష రాజ్యాంగవిరుద్ధం). ప్రస్తుతం, మార్చ్ 18, 2009 నాటికి, U.S.లో 15 రాష్ట్రాలు మరియు డిస్ట్రిక్ట్ అఫ్ కొలంబియా మరణశిక్షను నిషేధించాయి. మరణశిక్షను అనుమతిస్తున్న రాష్ట్రాలలో, కాలిఫోర్నియా మరణ పంక్తిలో ఎక్కువమంది ఖైదీలను కలిగిఉండగా, టెక్సాస్ మరణశిక్షలను విధించడంలో ముందువరుసలో ఉంది(మరలా ఈ శిక్ష చట్టబద్ధం చేసిన తరువాత జరిగిన మొత్తం మరణశిక్షలలో సుమారు 1/3 వంతు).
ఇటీవలి కాలంలో, జూన్ 23, 2009న అన్ని నేరాలకు మరణశిక్షలను నిషేధించిన దేశం టోగో.మానవహక్కుల కార్యకర్తలు మరణశిక్షను "క్రూరం, అమానవీయం, మరియు అవమానకరమైన శిక్ష" అని పేర్కొంటూ దానిని వ్యతిరేకిస్తారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ దీనిని "మానవహక్కుల అంతులేని తిరస్కారం" గా భావిస్తుంది.
.................................

న్యాయం సూత్రాలను ఆధారం చేసుకుని నడవాలి. ఎమోషన్స్ ని కాదు

( ఇక్కడ చర్చకి అవకాశం లేదు ఇది కేవలం నోట్సు దయచేసి మిత్రులు అర్థం చేసుకోండి)

07/02/2013

గురు శిష్య సంబంధం ఎలా వుండాలి అన్నది వివరిస్తూ చెప్పిన మంత్రాలు.దీన్ని శాంతి మంత్రం అంటారు.విద్యాభాసానికి ప్రారంభంలో గురుశిష్యులిద్దరూ ప్రతిబంధకాలు లేకుండా ఉండాలని కాంక్షిస్త్తూ పఠించే శ్లోకం, ఇవి విడివిడిగా తెలిసిన శ్లోకాలే కానీ ఈ వరుసలో వున్నాయని నాకింతకు ముందు తెలియదు.

ఓం సహనా వవతు
సహనౌ భునక్తు,
సహ వీర్యం కరవావహై ,
తేజస్వినా మపీదమస్తూ
మా విద్విషావహై ...
ఓం శాంతి, శాంతి, శాంతి:

పూర్ణ మదం పూర్ణ మిదం
పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణ మాదాయ
పూర్ణ మేవాయ శిష్యతే
ఓం శాంతి, శాంతి, శాంతి :

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్దాత్మనావా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యసకాలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి

ఓం అసతోమా సద్గమయ
ఓం తమసోమా జ్యోతిర్గమయ
ఓం మృత్యోర్మా అమృతం గమయ
మృత్యోర్మా అమృతం గమయ
ఓం సర్వేషాం స్వస్తిర్భావతు
సర్వేషాం శాంతిర్భవతు
సర్వేషాం పూర్ణం భవతు
ఓం శాంతి, శాంతి, శాంతి:

పరబ్రహ్మ స్వరూప మైన గురువుగారికి సవినయ సంపన్న విధేయతలతో,ఓర్పుతో విద్యను నేర్చుకుంటానని గురువు యొక్క తేజస్సు తన పై ప్రసరింప జేయాలని శిష్యుడు ప్రార్ధిస్తాడు .
భూమ్యాకాశాలు అంతటా గురువు యొక్క ప్రతిభ పూర్ణంగా వ్యాపించాలని ప్రార్ధిస్తూ ,
శరీరంతోనూ, వాక్కుతోనూ , మనసుతోనూ, ఇంద్రియాలతోనూ, బుద్ధితోనూ, ప్రకృతి నుండి లభించిన ఓరిమి, శ్రద్ధ స్వభావాలతో గురువుని సేవించుకుంటాను అని శిష్యుడు ప్రార్ధిస్తాడు.
ప్రతి ఒక్కరూ మంచి మార్గం లో నడుచుకోవాలని అంధకారంలో నిండిన హృదయాలలో జ్యోతిలా వెలగాలని ప్రార్ధిస్తారు.

06/02/2013

కాలపు రథం కదులుతుంటుంది.
కొందరు కుదురుగా కూర్చని ప్రయాణిస్లుంటారు.
సర్ధుకోలేక చక్రాలకింద నలిగిపోతారు అర్థం చేసుకోలేని మరికొందరు.
వెంబడిస్తూనే వెళుతుంటారు ఏనాటికైనా అందుకోవాలని మరింకొందరు.
అతికొద్దిమంది మాత్రమే
పగ్గాలు చేతిలోకి తీసుకుంటారు.
అనుకున్న దిశగా తమతో పాటు గమనాన్ని తోడుకెళుతుంటారు.

కట్టా శ్రీనివాస్ || కత్తిలాంటి సమాజం తేనెరాసుకొస్తుంది ||తేనే కురిపించే మాటలతోప్రేమ కనిపించే పనులతోస్నేహపు వలలు అల్లుతున...
18/01/2013

కట్టా శ్రీనివాస్ || కత్తిలాంటి సమాజం తేనెరాసుకొస్తుంది ||

తేనే కురిపించే మాటలతో
ప్రేమ కనిపించే పనులతో
స్నేహపు వలలు అల్లుతున్నప్పుడు
అంతా సుందరంగానే వుంటుంది.

గురికోసం బరిలో దింపిన రోజున
గుర్తొస్తుంది గుదిబండగా మారిన బందాల గోల.
పులి బంగారు కడియన్ని ఎరగా ఊపితే
పరిగెత్తని మగాడెవ్వరు ?.
గాలనికి వేళ్ళడే అందానికి
లొంగకనే నిలబడేదెవ్వరు ?.

నా లకుముకి పిట్టా గడబిడ పడకు
కనిపించేవన్నీ నిజాలనే గాటన పడకు.
లోతేమిటో ఎరగకనే
దిగేయాలని ఆత్రుత పడకు.

Address

Hyderabad
500013

Alerts

Be the first to know and let us send you an email when Katta Srinivas posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Katta Srinivas:

Shortcuts

Share

Category