Osmania University Non-Teaching Contract Employees Union

Osmania University Non-Teaching Contract Employees Union

Share

Osmania University � Unofficial
█║▌│█│║▌║│█║▌│█║▌║▌║ © This Page is Against to the Contract System in Telangana state.

In Osmania University Contract Employees working above 1800, who form the backbone of Osmania University functions, have been overlooked for a reasonable pay hike for the last two decades.

21/05/2026
08/05/2026

ప్రెస్ నోట్
07-05-2026

ఉస్మానియా విశ్వవిద్యాలయం బోధనేతర ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఆందోళన

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న బోధనేతర ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి గత ఐదు నెలలుగా వివిధ ఉద్యోగ సంఘాలు యూనివర్సిటీ అధికారులకు అనేక వినతిపత్రాలు సమర్పించాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఎలాంటి సానుకూల పురోగతి కనిపించలేదని సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగుల న్యాయసమ్మతమైన డిమాండ్ల పట్ల యూనివర్సిటీ యాజమాన్యం వివక్షతతో వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. రెగ్యులర్, టైమ్-స్కేల్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని తెలిపారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ మరియు టైమ్-స్కేల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.

ఉద్యోగ సంఘాల ప్రతినిధులు యూనివర్సిటీ అధికారులతో నాలుగు విడతల్లో చర్చలు జరిపినా, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ లేదా కార్యాచరణ కనిపించలేదని తెలిపారు. ఈ పరిస్థితుల కారణంగా బోధనేతర ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని వెల్లడించారు.

రాబోయే మూడు వారాల్లో ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా యూనివర్సిటీ యాజమాన్యం సానుకూల చర్యలు తీసుకోవాలని సంఘాలు డిమాండ్ చేశాయి. లేనిపక్షంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించాయి.

ఈ ప్రకటనను ఎన్‌.జీ.ఓ స్టాఫ్ అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయిస్ అసోసియేషన్, టైమ్ స్కేల్ అసోసియేషన్ మరియు కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సంయుక్తంగా విడుదల చేశారు.

18/02/2026

తేదీ: 17-02-2026
వేదిక: హైదరాబాద్

ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నాన్-టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు మరియు సికింద్రాబాద్ ఇంచార్జ్ శ్రీ ఆడమ్ సంతోష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, తమ దీర్ఘకాలిక సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు యారాల రాజేష్ గారు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జంగయ్య, రాము, ప్రవీణ్, వీరు నాయక్, అలీం, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శ్రీ ఆడమ్ సంతోష్ గారు ఓపికగా విని, చాలా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం గౌరవనీయ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తక్షణమే తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా చొరవ చూపుతానని ఆయన భరోసా కల్పించారు.

తమ విన్నపానికి సానుకూలంగా స్పందించి, అండగా నిలుస్తామని హామీ ఇచ్చినందుకు ఉస్మానియా యూనివర్సిటీ నాన్-టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున శ్రీ ఆడమ్ సంతోష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు.

04/02/2026

రేవంత్ రెడ్డి గారు ఓయూ గడ్డమీదికి వచ్చి నిరుద్యోగులను విద్యార్థులను మాట్లాడనివ్వలేదు

1. రెగ్యులర్ ఉద్యోగుల సిపిఎస్ ప్రకటించలేదు

2. OU నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ విషయం పై ప్రకటించలేదు,

3. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు మర్చిపోయాడు ప్రస్తావించలేదు

4. పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు మాట్లాడలేడు

సభలో ప్రకటిస్తాడని ఉద్యోగులు అనుకుంటారు, కానీ సొంత డబ్బా కొట్టుకొనికి బిల్డప్ ఇవ్వడానికి వచ్చాడు

డా. #ఎల్చాల #దత్తాత్రేయ

Osmania University Contract Employees Union

Photos from Osmania University Non-Teaching Contract Employees Union's post 04/02/2026

Today 04-02-2026 Vartha Main Paper

ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ!

జీవో 25 ప్రకారం విద్యాశాఖ కసరత్తు – 2025-26 అకడమిక్ ఇయర్ లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

G.O.25 ప్రకారం అర్హులైన ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించే ప్రక్రియను ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు.

2025-26 విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలనే లక్ష్యం.

స్కూళ్లలో టీచర్ల కొరత తీవ్రంగా ఉండటంతో ఇది తప్పనిసరి నిర్ణయం అన్న భావన స్పష్టంగా ఉంది.


University Non-Teaching Contract Employees Union

Photos from Osmania University Non-Teaching Contract Employees Union's post 29/01/2026

పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్‌లో తార్నాక థండర్స్ ఘన విజయం

సికింద్రాబాద్, జింఖానా గ్రౌండ్:

ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ క్రికెట్ ఫెస్టివల్‌ను బుధవారం సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు ఓస్మానియా యూనివర్సిటీ సంఘ నాయకులు రాజశేఖర్ రెడ్డి, ఎన్జీవోస్ అధ్యక్షులు ఖదీర్ ఖాన్, టైమ్ స్కేల్ నాయకులు నారాయణ, విట్టల్, అలాగే ఓయూ నాన్-టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘ అధ్యక్షులు రాజేష్, సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మీడియా క్రికెట్ లీగ్‌లో తార్నాక థండర్స్, జూబ్లీహిల్స్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తార్నాక థండర్స్ 128 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి ఘన విజయం సాధించింది. విజేత జట్లకు బహుమతులు అందజేయగా, పాల్గొన్న క్రీడాకారులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఎన్జీవోస్ అధ్యక్షులు ఖదీర్ ఖాన్ మాట్లాడుతూ, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంలో ఈ తరహా క్రీడా పోటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏబీవీ ఫౌండేషన్ ద్వారా పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ 2026 కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి నిర్వాహకులు, హైదరాబాద్ స్పోర్ట్స్ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.

27/01/2026

ఈ రోజు (27-01-2026) ఉస్మానియా యూనివర్సిటీ ఈపీఎఫ్ 60% బకాయిలపై కీలక భేటీ

అడిషనల్ సీపీఎఫ్ కమిషనర్ హామీ – ఉద్యోగుల్లో ఆశలు

ఉస్మానియా యూనివర్సిటీలో (OU) గత చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్ 60 శాతం బకాయిల సమస్యపై ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజశేఖర్ రెడ్డి గారి అధ్యక్షతన, ఓయూ ఎన్జీవోస్ అధ్యక్షులు ఖదీర్ ఖాన్, టైం స్కేల్ నాయకులు నారాయణ, విట్టల్ గౌడ్, అలాగే ఓయూనాన్-టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు యారాల రాజేష్, సురేష్‌లు కలిసి ఎంఎస్‌కేవీవీ సత్యనారాయణ, అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (ACC) గారిని కలిసి ఉద్యోగుల సమస్యలను సవివరంగా వివరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ గారు, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఈపీఎఫ్ బకాయిల సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నామని, దీనికి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఈ అంశాన్ని కేంద్రస్థాయిలో కమిషన్ ద్వారా పరిష్కరించేందుకు, సంబంధిత కేంద్ర మంత్రి ద్వారా కూడా లేఖ రాయించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.

అడిషనల్ కమిషనర్ హామీతో ఉద్యోగుల్లో ఆశలు పెరిగాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు ఆయనను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

కాంట్రాక్టు ఉద్యోగులు మరియు టైం స్కేల్ ఉద్యోగుల సమస్యలను తమ సమస్యగా భావించి పరిష్కారానికి చొరవ చూపుతున్నందుకు గౌరవనీయులు ప్రొఫెసర్ ఎం. కుమార్ గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి, ఎన్జీవోస్ అధ్యక్షులు ఖదీర్ ఖాన్ గారికి, అలాగే మూడు సంఘాల నాయకులకు కాంట్రాక్టు ఉద్యోగులు మరియు టైం స్కేల్ ఉద్యోగుల తరఫున పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ భేటీతో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగుల ఈపీఎఫ్ బకాయిల సమస్య త్వరలోనే పరిష్కార దిశగా ముందడుగు పడుతుందని ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Administration Building SBI ATM, Near Ladies Hostel, OU
Hyderabad
500007