SFI Osmania University

SFI Osmania University

Share

Official page of the Osmania University (OU) unit of the Students' Federation of India (SFI

18/05/2026

ఉద్యమాల ఉస్మానియా విశ్వవిద్యాలయం సమాజ శాస్త్ర విభాగం నుండి డాక్టరేట్ సాధించిన ఆర్ ఎల్ మూర్తి గారికి అభినందనలు

నేటి సమాజంలో యువత ముందున్న అతిపెద్ద సవాలు “దారి” ఎంపిక. అవకాశాల కోసం విలువలను మార్చుకోవాలా? లేక విలువల కోసం అవకాశాలను త్యజించాలా? అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న ఈ కాలంలో, డా. ఆర్.ఎల్. మూర్తి ప్రయాణం ఒక స్పష్టమైన మార్గదర్శిగా నిలుస్తోంది.

జనగామ జిల్లా జఫర్గడ్ మండలం, తమ్మడపల్లి(జి ) అనే కమ్యూనిస్టు భావజాలని కీ కేంద్రమైన చిన్న గ్రామం విప్లవ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి ప్రారంభమైన ఆయన జీవన యాత్ర, కేవలం వ్యక్తిగత విజయం కథ కాదు. అది ఒక సిద్ధాంతం పట్ల నిబద్ధత, ఒక ఉద్యమం పట్ల అంకితభావం, ఒక లక్ష్యం పట్ల నిరంతర కృషి కలిసిన సమగ్ర రూపం.
“గ్రామమే పాఠశాల… కమ్యూనిజమే ఊపిరి!” అనే భావజాలం ఆయన వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, ఆయన చేసిన ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేసింది.
అధ్యయనం, పోరాటనికి డా. మూర్తి ఆదర్శంగా నిలిచాడు
అతడు ప్రైమరీ ఎడ్యుకేషన్ గ్రామంలో ఆ తర్వాత మర్కాజి స్కూల్ హన్మకొండలో పదవ తరగతి వరకు చదివాడు, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్, బిఈడి పూర్తి చేశాడు చారిత్రాత్మక మైన నిజాం కాలేజ్ లో సమాజ శాస్త్రాన్ని చదివాడు,ఆర్ట్స్ కాలేజీ లో మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ పూర్తి చేశాడు చదువుతూనే విద్యార్థి ఉద్యమాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడుగా రెండుసార్లు కార్యదర్శిగా పనిచేస్తూ అంచలంచలుగా రెండుసార్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆరు సంవత్సరాల పాటు కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేశాడు ఆయన “చదువు + పోరాటం” అనే సమన్వయాన్ని ఆచరణలో చూపించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ రామ్ షఫర్డ్ గారి గైడెన్స్ లో ఆయన చేసిన పరిశోధన – “Ideological Alliance and Emergence of Alternative Politics – An Analytical Study of Telangana State” – కేవలం ఒక అకాడమిక్ అధ్యయనం కాదు. అది తెలంగాణ రాజకీయ పరిణామాలను లోతుగా విశ్లేషిస్తూ, ప్రత్యామ్నాయ రాజకీయాల అవసరాన్ని ప్రతిపాదించే ఒక మేధోపరమైన కృషి చేశాడు దీనికోసం అతను అనేకమంది మేధావులను రాజకీయ నాయకులను వారి అభిప్రాయాలను రికార్డు చేశారు ఈ పరిశోధన ద్వారా ఆయన విద్యను కేవలం వ్యక్తిగత పురోగతికి కాకుండా, సమాజ అవగాహనకు ఉపయోగించారు.
విద్యార్థి రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్ర ప్రత్యేకంగా గుర్తించదగినది. ఎస్ఎఫ్ఐ నాయకుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో, వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత కోసం చేసిన కృషి గమనార్హం. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ, ఉద్యమాన్ని ముందుకు నడిపించడం ఆయన నాయకత్వ లక్షణాలను స్పష్టంగా తెలియజేస్తుంది.
అయితే, ఈ ప్రయాణం అంత సులభం కాదు. , అరెస్టులు, నిర్బంధాలు – ఇవన్నీ ఆయన మార్గంలో అడ్డంకులుగా ఉన్న,కానీ ఆ అడ్డంకులు ఆయనను వెనక్కి నెట్టలేదు; మరింత బలంగా తీర్చిదిద్దాయి. ఇది ఒక వ్యక్తి ధైర్యం మాత్రమే కాదు, ఆయన నమ్ముకున్న సిద్ధాంతం పట్ల ఉన్న విశ్వాసం కూడా.
నేటి యువతలో వేగంగా మారుతున్న విలువల మధ్య, మూర్తి జీవితం ఒక గంభీరమైన ప్రశ్నను మన ముందుంచుతోంది:
“సిద్ధాంతం కోసం మనం ఎంతవరకు నిలబడగలుగుతాం?”
సిద్ధాంతం అంటే కేవలం మాటలు కాదు,
అది ఎన్నో త్యాగాల మధ్య నిలబెట్టుకునే నిబద్ధత.
ప్రలోభాలు ఎదురైనా, ఒత్తిడులు వచ్చినా,
తన నమ్మకాల్ని అమ్ముకోకుండా నిలబడటం నిజమైన వ్యక్తిత్వం. ఆ బాటలోనే ఆయన ఉస్మానియా గడ్డపై ఎస్ఎఫ్ఐ జెండా పట్టుకుని నికరంగా నిలబడ్డా మార్కిస్ట్ విద్యార్థి నేత అతను

వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన చూపించిన సరళత, పార్టీ పద్ధతుల్లోనే నిరాడంబరంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వివాహం చేసుకోవడం వంటి నిర్ణయాలు – మాటలకంటే ఆచరణ గొప్పదని నిరూపిస్తాయి. ఇది యువతకు ఒక స్పష్టమైన సందేశం: నాయకత్వం అంటే కేవలం మాటలు కాదు, జీవన విధానం ఆచరణ కూడా.
ఆయనలో కనిపించే విప్లవ స్పూర్తి, నిబద్ధత, ధైర్యం – ఇవన్నీ మహానుభావుల వారసత్వాన్ని గుర్తు చేస్తాయి. అయితే, ఇది కేవలం పోలిక మాత్రమే కాదు; ఆ విలువలను నేటి కాలంలో ఆచరణలో పెట్టే ప్రయత్నం.
నేడు డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా నిరుద్యోగ సమస్యలపై ఆయన చేస్తున్న పోరాటం, విద్యార్థి ఉద్యమాల నుంచి సమాజ ఉద్యమాల దిశగా జరిగిన పరిణామాన్ని సూచిస్తుంది. ఇది ఒక సహజమైన విస్తరణ – వ్యక్తిగత ప్రయాణం సమాజ ప్రయోజనంతో కలిసినప్పుడు ఏర్పడే మార్పు.
చివరగా, డా. ఆర్.ఎల్. మూర్తి సాధించిన డాక్టరేట్‌ను కేవలం ఒక అకాడమిక్ మైలురాయిగా చూడటం సరిపోదు. అది ఒక సందేశం –
నేటి యువతకు ఈ ప్రయాణం చెప్పేది ఒకటే:
“రాజీపడకుండా కూడా విజయం సాధించవచ్చు… నమ్ముకున్న మార్గంలో నిలబడితే చరిత్ర మీవైపు తిరుగుతుంది.”
ఆయన సాధించిన ఈ 'డాక్టరేట్' పట్టా ఆయన పోరాట పటిమకు దక్కిన మరో గౌరవం
*ఇది డాక్టరేట్ కాదు*…
*పోరాడిన చరిత్రకు పెట్టిన సంతకం*

*Once again congratulations
*Dr. R. L Murthy* Anna 💐❤️💐💐💐

.... *మీ మిత్రులు*
**ఉస్మానియా యూనివర్సిటీ*

14/04/2026

ఉస్మానియా ఉద్యమ తార, విద్యార్థి ఉద్యమాల పెద్దన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక ఉద్యమాలు విద్యార్థుల గొంతుకగా పనిచేసి అనేక నిర్బంధాలను ఎదుర్కొన్న నేత, నమ్మిన సిద్ధాంతం కోసం నికరంగా నిలబడిన ఉస్మానియా ఉద్యమ గళం, నేడు నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న యువనేత ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్ ఆర్ ఎల్ మూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు.........
Thank you Sharath Anna,kota Srinu Anna& friends
birthday Anna
scholar hostel OU

25/03/2026

విద్యార్థులకు నిరంతరం అండగా నిలుస్తూ, అందరికీ సేవలు అందించిన ప్రొఫెసర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు అనేక ఉద్యమాలకు అండగా నిలబడ్డాడు. ఆయన యూనివర్సిటీకి విస్తృతమైన సేవ చేసినప్పటికీ, ఆయన పట్ల యూనివర్సిటీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరించారు ఆయనకు పింఛను ప్రయోజనాలను నిరాకరించారు, ఆయన ప్రొఫెసర్‌ హోదాను గుర్తించడానికి నిరాకరించారు, మరియు అనేక సందర్భాల్లో, పరిపాలనా ప్రాంగణంలోకి ప్రవేశించకుండా లేదా గేటు వద్ద కూర్చోకుండా కూడా అడ్డుకున్నారు.
ప్రొఫెసర్ అన్సారీ త్వరగా కోలుకుని మన మధ్యకు తిరిగి రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను.

ప్రొఫెసర్ అన్సారీ గారు జూబ్లీ హిల్స్‌లోని టిఎక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఎంత విషమంగా ఉందంటే కనీసం మాట్లాడలేకపోతున్నారు. ఆయన ఇంకా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి చూసి నాకు చాలా బాధ కలిగింది. తన వృత్తి జీవితంలో ఎంతో మంది విద్యార్థులకు సహాయం చేసిన అన్సారీ సార్ ఇలాంటి పరిస్థితికి రావడం విచారకరం. అన్సారీ సార్‌కు న్యాయం చేయడానికి మనం ఏమి చేయగలమో ఆలోచించండి. ఇది మన బాధ్యత కూడా. లేకపోతే, మనకు పోరాట పాఠాలు నేర్పిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మనల్ని క్షమించదు

20/03/2025
Photos from SFI Osmania University's post 03/01/2024

ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193 వ జయంతి ఘనంగా నిర్వహించారు.SFI

తెలంగాణ కోటి మహిళా యూనివర్సిటీ పేరు సావిత్రిబాయి ఫూలే పేరు నామకరణం చేయాలి ప్రభుత్వం

ఈ సందర్భంగా *ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవి నాయక్* సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం మాట్లాడుతూ
భారతీయ సంఘ సంస్కర్త బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, బ్రాహ్మణిజానికి, మనస్మృతికి, వ్యతిరేకంగా పోరాడి బడుగు, బలహీన,దళిత వర్గాల మహిళల కోసం పాఠశాల ఏర్పాటు చేసి విద్యను అందించిన మొట్టమొదటి భారతీయ మహిళ యోధురాలు సావిత్రిబాయి పూలే. కుల,మత, ప్రాంతం, వర్ణం, బేధం వివక్షకు, పితృసామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల హక్కుల కోసం పోరాటం చేయటం గొప్ప పరిణామం. నూతన సమాజం కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోటి మహిళా యూనివర్సిటీ పేరును సావిత్రిబాయి ఫూలే పెరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. *ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు శ్రీను ప్రశాంత్ శిరీష సహాయక కార్యదర్శి కృష్ణ, సందీప్ నాయకులు శ్రీనాథ్,యశ్వంత్,మాళవిక, మేఘన, భాను, విష్ణు, నరేష్ తనుష్ తదితరులు పాల్గొన్నారు.*

*అభినందనలతో*
ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవి నాయక్

10/09/2023

09/09/2023

State plenary meeting

03/09/2023

ఆర్ట్స్ కాలేజ్ ముందు భూ కబ్జాదారుల దిష్టిబొమ్మ దగ్ధం

Murthy OU Ravi Malothu OU Sfi Telangana

Photos from SFI Osmania University's post 03/09/2023

ఓయు భూములను ఆక్రమణ చేస్తున్న భూ కబ్జాదారులారా ఖబడ్దార్

SFI - AISF - PDSU - PDSU (V) - స్కాలర్స్

వందేళ్లు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ భూములపై కన్నేసిన భూ కబ్జాదారులకి, వాళ్ళకి సహకరిస్తున్న ప్రభుత్వానికి, ఉస్మానియా యూనివర్సిటీ పాలక వర్గానికి వామపక్ష విద్యార్థి సంఘాలుగా హెచ్చరికలు జారీ చేస్తున్నాము. యూనివర్సిటీ భూముల కోసం కేసులకు, జైళ్లకు బెదరకుండా పోరాటాలు చేసిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి, వామపక్ష విద్యార్థులకు ఉన్నది. ఈ భూముల కోసం ఎన్నో ఎంతో మంది విద్యార్థుల త్యాగాలు ఉన్నాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా రాజకీయ లాభాల కోసం, విలువైన భూముల కోసం రాజకీయ నాయకులు, భూ ఆక్రమణ దారులు కుట్రలు చేస్తూ విద్యార్థులకు చెందిన భూములను ఇతరులకు అన్యాక్రాంతం చేయడం, దానిని ఇంతవరకు యూనివర్సిటీ పాలక వర్గం స్పందించకపోవడాన్ని యూనివర్సిటీ విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి వ్యతిరేఖంగా ఎంత దూరం పోవడానికి అయినా, ఎన్ని పోరాటాలు చేయడానికి అయినా మేము సిద్ధపడి ఉన్నాము. అందులో భాగంగానే ఇవ్వాల ఆర్ట్స్ కాలేజి ఆవరణలో భూ కబ్జా దారుల, ప్రభుత్వ దిస్తి బొమ్మలను తగలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో SFI రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి, స్కాలర్స్ అజాద్, SFI రాష్ట్ర నాయకుడు రవి నాయక్, AISF - OU కార్యదర్శి సత్య నెల్లి, PDSU రాష్ట్ర నాయకుడు శ్రీను, PDSU (V) OU కన్వీనర్ అఖిల్ బొడ్డుపల్లి లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లెనిన్, మహేష్, కిషోర్, దిలీప్, శ్రీను, శర్మ లు పాల్గొన్నారు.

SFI - AISF - PDSU - PDSU (V) - స్కాలర్స్

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Osmania University
Hyderabad