Telangana News Analytics

Telangana News Analytics

Share

INEXT is a live, interactive platform of software training furnishing personalities with a momentary exclusively only for Prabhas Fans

04/11/2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా BRS పార్టీకి చెందిన ఒక సందేశం ఇప్పుడు వైరల్ అవుతోంది.
"బండి నడపడం చేతనైనోడి చేతిలోనే స్టీరింగ్ ఉండాలె.. రాష్ట్రం నడపడం చేతనైనోడి చేతిలోనే రూలింగ్ ఉండాలె.." అనే నినాదంతో ఈ ప్రచారం సాగుతోంది. ఈ సందేశం ద్వారా, BRS అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారికి మద్దతుగా 'కారు' గుర్తుకు ఓటు వేయాలని ఆ పార్టీ శ్రేణులు పిలుపునిస్తున్నాయి.
ఈ ప్రచార వీడియోలు మరియు పోస్టులు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతూ, , , వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ( Kalvakuntla Taraka Rama Rao - KTR, BRS Party)

04/11/2025

*విద్యాశాఖ అధికారి లచ్చిరాం నాయక్ అక్రమాల పర్వం – వ్యక్తిగత లాభాల కోసం ప్రజా రోడ్డును మళ్లించి, యువకుడి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన MEOపై DSFI ధర్నా......*

*తక్షణ తొలగింపు, అరెస్టుకు డిమాండ్.*

*DSFI రాష్ట్ర కార్యదర్శి సాయి కుమార్,కోశాధికారి గుగులోతు సూర్య ప్రకాష్......🔥*

కురవి, [04/11/2025]: నేర చరిత్ర కలిగి, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న సీరోల్ మండల విద్యాశాఖ అధికారి (MEO) లచ్చిరాం నాయక్‌ను తక్షణమే సర్వీస్ నుండి తొలగించి, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ DSFI నాయకులు ఈరోజు కురవి మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.

అక్రమ రోడ్డు నిర్మాణం & అధికార దుర్వినియోగం పై
DSFI నాయకులు మాట్లాడుతూ, లచ్చిరాం నాయక్ తన అధికారాన్ని పూర్తిగా వ్యక్తిగత లాభాల కోసం దుర్వినియోగం చేశారని ఆరోపించారు,ప్రజల అవసరాల కోసం వేయాల్సిన రోడ్డును, తన సొంత లాభాల కోసం, తాను ఏర్పాటు చేసుకున్న కోళ్ల ఫారంకు వీలుగా మళ్లించారని నాయకులు తెలిపారు..

*కంబాల సంపత్ భూమిలో అక్రమ రోడ్డు:* ఈ క్రమంలో, మాధాపురం గ్రామానికి చెందిన యువకుడు కంబాల సంపత్కు చెందిన భూమిలో అక్రమంగా రోడ్డు వేశారని, దీనిని సంపత్ అడ్డుకోవడానికి ప్రయత్నించగా MEO లచ్చిరాం నాయక్ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.

*ఆత్మహత్యాయత్నం & బెదిరింపులు*

MEO లచ్చిరాం నాయక్ వేధింపులు, బెదిరింపుల కారణంగానే కంబాల సంపత్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని DSFI నాయకులు స్పష్టం చేశారు. "తనకు న్యాయం జరగదనే నిస్సత్తువతోనే ఆ యువకుడు ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీనికి నూటికి నూరు శాతం కారకుడు లచ్చిరాం నాయకే," అని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

*గత నేర చరిత్రపై తీవ్ర ఆందోళన*

MEO లచ్చిరాం నాయక్‌కు నేర చరిత్ర ఉందని, గతంలోనూ ఆయన బెదిరింపుల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉందని DSFI నాయకులు గుర్తు చేశారు. ఆనాటి కేసులో అసలైన నిందితుడైన లచ్చిరాం నాయక్‌ను జైలుకు పంపకుండా, ఈసారి లచ్చిరాం నాయక్‌ను తప్పించుకోనివ్వకుండా వెంటనే అరెస్ట్ చేయాలని వారు పోలీసులను గట్టిగా ప్రశ్నించారు.

మండల విద్యాశాఖ అధికారిగా ఉంటూ విద్యాశాఖ కే మచ్చుతునక తెస్తున్న ఇటువంటి విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు,లేని యెడల దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు...

*DSFI యొక్క కీలక డిమాండ్లు*

*తక్షణ తొలగింపు చేయాలి:* అధికార దుర్వినియోగం, నేర చరిత్ర కలిగిన MEO లచ్చిరాం నాయక్‌ను విద్యాశాఖ సర్వీస్ నుండి తక్షణమే రిమూవ్ చేయాలి.

*కేసు నమోదు మరియు అరెస్టు చేయాలి:* కంబాల సంపత్ ఆత్మహత్యాయత్నానికి కారకుడైన MEO లచ్చిరాం నాయక్‌పై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలి మరియు జైలుకి పంపాలి.

*అక్రమ రోడ్డు తొలగింపు చేయాలి:* కంబాల సంపత్ భూమిలో అక్రమంగా వేసిన కోళ్ల ఫారం రోడ్డును తక్షణమే తొలగించి, ప్రజా అవసరాల రోడ్డును పునరుద్ధరించాలి.

ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే, DSFI ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నాయకత్వం హెచ్చరించింది....

ఈ కార్యక్రమంలో సురేష్,రవి,అనిల్,సంతోష్, సునీల్, మోహన్, నాగేష్, భరత్, చంటి, రతన్ తదితరులు పాల్గొన్నారు

04/11/2025
04/11/2025

సరికొత్త ప్రచార వ్యూహంతో
Kalvakuntla Taraka Rama Rao - KTR గారు
! కాంగ్రెస్ ప్రభుత్వ దారుణాలను జూబ్లీ హిల్స్ ప్రజల కళ్లకు కట్టినట్లు చూపించారు. హైడ్రా (HYDRAA ) కూల్చివేతల వీడియోలను నేరుగా ప్రజల సమక్షంలోనే ప్రదర్శించి, ప్రభుత్వ చర్యలను బట్టబయలు చేశారు!

11/06/2017

Kindly invite u r friends

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Hyderabad
500072