ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏🙏🌹🌹🌹
స్మరణాత్ అరుణాచలే అని సాక్షాత్తు శివుడే సెలవిచ్చాడు జ్ఞాన లు మాత్రమే చిదంబరాన్ని దర్శిస్తారు తిరువారూరు లో జన్మించిన వారు కాశీ లో మరణించిన వారు మోక్షానికి అర్హులు అవుతారు🙏🌹అరుణాచలం అనే ఊరు పేరు మాత్రం తలిస్తే చాలు... మోక్ష అర్హత లభిస్తుంది అన్నాడు .అరుణగిరి కార్తీకదీపం దర్శిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం 🙏🌹
ప్రతి ఏడు కార్తీకమాసంలో కృత్తిక నక్షత్రం వేళ అరుణగిరి పై దర్శనమిస్తారని పరమేశ్వరుడు భక్తులకు వాగ్దానం చేశాడు 🙏🌹
అరుణాచలేశ్వరుని కార్తీకోత్స వైభవాన్ని తిలకించడం కోటి జన్మల పుణ్య ఫలం 🙏🌹
అరుణాచల ప్రాశస్త్యాన్ని గురించి అనేక పురాణాలు ప్రతిపాదించాయి గౌతముడు అగస్త్యుడు మొదలైన మహర్షులూ ఈ గిరిని శోభనాచలమని కీర్తించారు 43 కోణాలున్న శ్రీ చక్ర ఆకారంతో విరిసిల్లే సుదర్శన గిరి అరుణగిరి అందుకే దీన్ని శంకరులు మేరువు అన్నారు అరుణాచలం కొండ పై ఉన్న గుహలన్నీ తపోవనాలు 🙏🌹
రమణ మహర్షి ప్రేరణతో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ప్రధానంగా మారిందని చెబుతారు నిత్యం ఎంతో మంది చేస్తుంటారు ముఖ్యంగా పౌర్ణమి దినాలలో ఎక్కువమంది చేస్తారు 🙏🌹
ప్రతి ఏడు కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం వేళ అరుణగిరి పై దర్శనమిస్తారు పరమేశ్వరి భక్తులకు వాగ్దానం చేశాడు అదేవిధంగా ప్రతి ఏటా ఇక్కడ లక్షల భక్తులు సమక్షంలో కొండపై అతిపెద్ద ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తారు దీని కోసం కొన్ని కిలోల నెయ్యి ని ఉపయోగిస్తారు కొండ దిగువన నిలబడి చూసేవారికి కూడా కార్తీకదీపం చక్కగా దర్శనం ఇస్తుంది ఇది చూసిన వారికి మోక్షం సిద్ధిస్తుందని చెబుతారు 🙏🌹
Indian Institute of Divine Sciences, Patancheru
Marriage Matching Astrology/Matrimonial Astrology,
General Astrology Prediction,
Preaching Astrology and Vaastu.
🙏🌺ఏ రాశివారు ఏ జ్యోతిర్లింగం పూజించాలి 🌺🙏
🌺01. మేషరాశి: "రామేశ్వరం" :
శ్లోకం:- "సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యై
శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామేశ్వరాఖ్యం నియతం నమామి."
ఈ రాశి కుజునికి స్వగృహం, చర రాశి వారికి పదకండవ ఇంటి అధిపతి అయిన శని బాధకుడు. గ్రహ పీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర,, పైన చెప్పిన శ్లోకం రోజు చదువుకొనుట చేయవలెను, శ్రీరామ చంద్రుడు శని బాధ నివారణార్ధం ఈ లింగము స్తాపించేనని చెప్పబడినది. కుజునకు కందుల దానము, యెర్ర వస్త్ర దానములుకుడా చేసిన మంచి ఫలితములు వచ్చును. 🌺
🌺02. వృషభ రాశి: "సోమనాధ జ్యోతిర్లింగము"
శ్లోకం:- "సౌ రాష్ట్ర దేశే విదేశే తిరమ్యే జ్యోతిర్మయం చంద్ద్ర కళావ సంతం,భక్తి ప్రాధానాయ క్రుపావతీర్ణం తం సోమనాధం శరణం ప్రపద్యే."
ఈ రాశి శుక్రునికి స్వ గృహం, చంద్రునికి ఉచ్చ రాశి. సోమనాధ జ్యోతిర్లింగం శ్రీ క్రిష్ణుడుచే స్తాపించ బడింది. ఈ రాశికి శని నవామాదిపత్య బాధకుడు అయినందున శని దోషాలకు సోమనాధ దేవాలయ దర్శనం, పై శ్లోక ధ్యానము చేసిన సుభ ప్రదము. జన్మ నక్షత్రమందు రుద్రాభిషేకం చేయించుట వలన మంచి ఫలితములు పొందగలరు. బొబ్బర్ల దానము, బియ్యము దానము చేసిన మంచిది 🌺
🌺03. మిధున రాశి: "నాగేశ్వర జ్యోతిర్లింగం"
శ్లోకం:-"యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భొగై ,
సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీ నగనాధం శరణం ప్రపద్యే."
ఈరాశి బుధునికి స్వగృహము. దోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, ప్రతి రోజు పై శ్లోకమును చదువుట, ఈ రాశి శని సంచరించు కాలమునందు జన్మ నక్షత్ర రోజున కైలాస యంత్ర ప్రస్తార మహా లింగార్చన జరిపించిన విశేషమైన ఫలితములు కలుగును.🌺
🌺04. కర్కాటకం: "ఓం కార జ్యోతిర్లింగం":
శ్లోకం:-"కావేరికా నర్మదాయో పవిత్రే , సమాగమే సజ్జన తారణాయ,
సదైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే"
ఈ రాశి చంద్రునకు స్వగృహం , . ఓం కార జ్యోతిర్లింగ దర్శనం, రోజు పై శ్లోకం చదువుట , జన్మ నక్షత్రం రోజున ఓం కార బీజాక్షరం ఉచారిస్తూ ఉండటం మంచి నివారణ ఉపాయములు.🌺
🌺05. సింహరాశి : "శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం"
శ్లోకం:-"ఇలాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్ల సంతం చ జగద్వ రేణ్యం,
వందే మహా దారాతర స్వభావం, ఘ్రుశ్నేస్వరాఖ్యం శరణం ప్రపద్యే."
సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘ్రుష్నేస్వర జ్యోతిర్లింగ దర్శనం, పై శ్లోకమును రోజు చదువుట, జన్మ నక్షత్రం నాడు ఏక దశ రుద్రాభిషేకం ద్వారా దోషాలనుండి విముక్తి పొందవచ్చును.🌺
🌺06. కన్యా రాశి: "శ్రీ శైల జ్యోతిర్లింగం".
శ్లోకం:-"శ్రీ శైల శ్రుంగే విభుధాతి సంగే తులాద్రి తుంగే పి ముదావసంతం,
తమర్జునం మల్లిక పూర్వ మేకం, నమామి సంసార సముద్ర సేతుం."
ఈ రాశికి అధిపతి బుధుడు. బాధల నుండి ఉపశమనం పొందుటకు శ్రీ శైల మల్లిఖార్జున దర్శనం, భ్రమరాంబ కి కుంకుమ అర్చన, జన్మ నక్షత్రం రోజున చండి హోమం చేసిన ఉపశమనం పొందగలరు. రోజు పైన చెప్పిన శ్లోకం చదువుట, జన్మ నక్షత్రం రోజున ఆవుకి ఆకు కూరలు, పచ్చ పెసలు తినిపించుట మంచిది.🌺
🌺07. తులారాశి: "మహాకాళే శ్వరం":
శ్లోకం:- "అవన్తికాయాం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం
అకాల మృత్యో : పరిరక్ష ణా ర్థం వందే మహాకాల మహాసురేశం "
ఈ రాశికి శుక్రుడు అధిపతి, మహాకాళేశ్వర దర్శనము ద్వారా, , శుక్ర వారము సూర్యోదయ సమయములో బొబ్బర్లు దానం చేయుట ద్వారా దోషములు, బాధలనుండి విముక్తి పొందవచ్చును.🌺
🌺08. వృశ్చిక రాశి: "వైద్యనాదేశ్వరుడు:
శ్లోకం:-"పూర్వొత్తరె ప్రజ్వాలికానిధానే , సాదావసంతం గిరిజాసమేతం ,
నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్య నాదం తమహం నమామి."
ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్ర చికిత్సలకి కారణ భూతం. బాధలకు వైద్య నాదేశ్వరుని దర్శించి , పూజించుట ద్వారా , మంగళ వారము జన్మ నక్షత్రము రోజున కందులు, యెర్రని వస్త్రములు దానము చేయుట మంచిది. ఋతు క్రమ దోషములున్న స్త్రీలు పెద్ద ముత్తైదువులకు యెర్రని వస్త్రములు దానము చేయుట మంచిది.🌺
🌺09. ధనురాశి : "విశ్వేశ్వర లింగం":
శ్లోకం:- "సానంద వనే వసంతం, ఆనందకందం హత పాప బృందం
వారణాసీనాధ మనాద నాదం, శ్రీ విశ్వ నాదం శరణం ప్రపద్యే."
ఈ రాశి వారికి గురుడు అధిపతి, స్వస్తానం. వేదాంత ధోరణి విపరీత ఆలోచనలు, సైంటిఫిక్ ఆలోచనలు, వీరి లక్షణం. అద్దిశంకరుల వారికి మోక్షం ప్రసాదించిన కాశీ క్షేత్రం, , అన్నపూర్ణ వద్ద శివుడు భిక్ష అడుగుట, అర్ధరాత్రి గంగకి ఆవలి ఒడ్డున "నారాయణ మంత్రం"తొ శివుడు జీవులకి మోక్షము ప్రసాదిస్తాడని పురాణాలలో చెప్పబడింది. పై శ్లోక పారాయణ, పూజ చేయుట, కాశి క్షేత్ర దర్శనము , గురువారము రోజున, జన్మ నక్షత్రము రోజున శనగల దానము ఇచ్చుట ద్వారా శని, గురు గ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చును. 🌺
🌺10. మకరము: "భీమ శంకరం" :
శ్లోకం:- "యం డాకినీ శాకినికాసమాజై : ,నిషేవ్యమాణం పిశితా శనైశ్చ ,
సదైవ భీమాది పద ప్రసిధం, తం శంకరం భూత హితం నమామి."
ఈ రాశి అధిపతి శని. గురునికి నీచ, కుజునికి ఉచ్చ,గురుడు అంటే జీవుడు , అహంకార పూరితమైన గజరాజు మొసలిచే పీదిన్చాబడి గజేంద్ర మోక్షము అనే ఆర్తి పూరితమైన ఘట్టం పురాణాలలో చెప్పబడింది. దోషాలకి భీమ శంకరం దర్శనం,,పూజ చేయుట, పై శ్లోక పారాయణము నిత్య పారాయణము, శని వారము నల్ల నువ్వుల దానము, నల్లని వస్త్రాలు దానము ఇచ్చుట, అవిటివారికి, ముసలి వారికి వస్త్ర దానము చేయుట మంచిది. 🌺
🌺11. కుంభం:"కేదారేశ్వరుడు":
శ్లోకం:-"మహాద్రి పార్శ్వే చ రమంతం, సంపూజ్య మానం సతతం మునీన్ద్రై :
సురాసురై ర్యక్ష మహోర గాద్యై : కేదారమీశం శివమేక మీడే ".
ఈ రాశికి శని అధిపతి, దోషాలకి కేదాద్రేశ్వర దర్శనము, పూజించుట, నిత్యమూ పై శ్లోక పారాయణము, శని వారము నువ్వుల దానము, అభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభి షేకం చేసిన మంచిది. 🌺
🌺12. మీనా రాశి: "త్రయంబకేశ్వరుడు" :
శ్లోకం:-"సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే ,
యద్దర్శనాథ్ పాతక మాశు నాశం, , ప్రయాతి తం త్రయంబక మీశ మీడే ".
ఈ రాశి అధిపతి గురుడు. త్రయంబకేశ్వరుడు ఎప్పుడు నీటి మధ్యలో ఉంటాడు. అధిక ఫలితాలని ఇస్తాడని పురాణ ప్రసిద్ది. దోషాలకు త్రయంబకేశ్వర దర్శనము, చిత్రపటము పూజ మందిరము నందు ఉంచి నిత్యమూ పై శ్లోకము పారాయణము చేయుట మంచిది.. . .
ఓం నమః శివాయై చ నమః శివాయ !!🌺
అరుణాచలం - గిరి ప్రదక్షిణ -
*(రమణ మహర్షి ఆశ్రమం)*
తిరువణ్ణామలై’గా పిలువబడే అరుణాచలం తమిళనాడులో ఉంది. చెన్నైకి 120 మైళ్ళు, కాట్పాడి జంక్షన్‌కు 60 మైళ్ళ దూరంలో వుంది. ఈ రెండుచోట్ల నుంచి నేరుగా చేరుకునే బస్‌లు చాలా తరచుగా నడుస్తాయి. అలాగే తిరుపతి నుంచి కూడా కాట్పాడి (వేలూర్) మీదుగా బస్‌లు 5 గం.లో చేరుస్తాయి. వైజాగ్, విజయవాడల నుంచి తిరువణ్ణామలై స్టేషన్ మీదుగా పోయే రైళ్ళు రెండున్నాయి (No 22603/5, 22604/5). హైదరాబాద్ (లకడీ-కా-పుల్) నుంచి డైరెక్టు బస్ రోజూ నడుస్తోంది అలాగే ఇక్కడినుంచి తమిళనాడు, పొరుగు రాష్ట్రాలకు నేరుగా పోయే బస్‌లు, రైళ్ళు అసంఖ్యాకంగానే వున్నాయి. ఆశ్రమం – బస్‌స్టాండ్ నుంచి 3 కి.మీ. రైల్వేస్టేషన్ నుంచి 4 కి.మీ. పెద్దగుడి దక్షిణ గోపురంనుంచి 2 కి.మీ. దూరంలో వుంది.
*వాతావరణం:*
ఏడాది పొడుగునా వేడిగా, పొడిగా ఉంటుంది. వేసవి తీవ్రంగానే ఉంటుంది. ఏప్రిల్-జూన్‌లో అధిక వేడి కనిపిస్తుంది.
జూన్ – జూలైలలో కొంత జల్లులు మొదలై వేడి తగ్గుతుంది. అక్టోబర్ – నవంబర్ ప్రాంతంలో వర్షాలు కనబడే అవకాశముంది. డిసెంబర్-ఫిబ్రవరిలో వాతావరణం బహుప్రసన్నంగా చల్లగా వుంటుంది.
*ఆశ్రమ ప్రవేశం:-*
బెంగళూరు రోడ్డులో కుడిపక్కగా వున్న ఆశ్రమంవద్ద వాహనం దిగి శ్రీరమణాశ్రమం అని రాసివున్న కమాన్ (గేట్‌పైన ఆర్చ్) లోంచి ఆశ్రమంలో ప్రవేశించగానే సువిశాలమైన ప్రాంగణంలో అడుగుపెడతారు. నాలుగు వందల సంవత్సరాల విప్పచెట్టుతో సహా మామిడి, బాదం తదితర మహావృక్షాల నీడతో పురాతనమైన వాతావరణమేదో స్ఫురిస్తుంది. ఈ ఆవరణ ప్రతి ఉదయం 10.30కు నారాయణసేవతో కళకళలాడుతుంది. ఎదురుగా మెట్లు, తరువాత ఎడమపక్క రెండు గోపురాలు. మొదటిది భగవానుల మాతృమూర్తి సమాధి సన్నిధి శ్రీమాతృభూతేశ్వరాలయం. రెండవది భగవాన్ శ్రీరమణ మహర్షుల సన్నిధి శ్రీరమణేశ్వరాలయం.
*కొత్త హాల్*
తూర్పు ముఖద్వారంగల మాతృభూతేశ్వరాలయంలో ప్రవేశిస్తే మొదట ‘కొత్త హాల్’: అందులో కుడిపక్క దక్షిణాభిముఖంగా, చక్కగా చేయబడిన రాతిసోఫాలో పద్మాసనంలో కూచున్న శ్రీభగవాన్‌ల రాతివిగ్రహం. పెరుగుతున్న భక్తుల వసతికోసమై నిర్మించబడిన ఈ కొత్త హాల్‌లో స్వామి మహానిర్వాణానికి ముందు కొద్ది నెలల కాలం నివాసమున్నారు. ఉదయం 5-12.30; మధ్యాహ్నం 2-9 తెరచి ఉంచుతారు.
*మాతృభూతేశ్వరాలయం:-*
కొత్త హాల్‌లో పడమరగా ఉన్న రెండో పెద్దద్వారం శ్రీమాతృభూతేశ్వర మహాసన్నిధానానికి దారితీస్తుంది. ప్రఖ్యాత శిల్పి వైద్యనాథ స్థపతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ అద్భుత నిర్మాణం రూపుదిద్దుకొంది. గర్భగృహంలో శ్రీమాతృభూతేశ్వర లింగం, గోడలో అమర్చిన శ్రీచక్ర మహామేరు యంత్రం, మరో భూప్రస్థార యంత్రం భగవానుల స్పర్శతో పునీతమై దర్శినమిస్తాయి. నవావరణ విధాన శ్రీచక్ర పూజ ప్రతి శుక్రవారం, పౌర్ణమి, తమిళ మాసాల మొదటిరోజున సాయంత్రం 6 గం. మొదలై, 3 గం. పాటు సాగుతుంది. గర్భాలయం గోడల వెలుపల దక్షిణామూర్తి, లింగోద్భవ మూర్తి, అక్ష కమండలు ధారి బ్రహ్మ, యోగాంబిక దర్శనమిస్తారు. నైఋతి, వాయువ్య మూలలలో గజానన, షడానన సన్నిధులున్నాయి. ఉత్తరాన సోమసూత్రానికి ఎదురుగా చండికేశ్వరుని సన్నిధి ఉంది. ఈశాన్యంలో నవగ్రహ మండపం, పక్కనే నటరాజ, శివకామనాయికిల పంచలోహ మూర్తులున్నాయి. పై కప్పుకు ఆధారంగా ఉన్న రాతిస్తంభాలపై దేవీదేవతల విగ్రహాలు, ద్వారానికి ఇరుపక్కల పశ్చిమ ముఖంగా సూర్యచంద్రులు, గర్భాలయం ఎదురుగా పెద్దవేదికపై కొలువైన శ్రీనందికేశ్వరుడు విరాజమానమై ఉన్నారు. ఉదయం 5 – 12.30, మధ్యాహ్నం 3.30 – 8 వరకు తెరచి ఉంటుంది.
*రమణుల సమాధి:-*
మాతృభూతేశ్వర ఉత్తరద్వారంనుంచి మహర్షుల సమాధి మందిరంలోకి ప్రవేశిస్తాము. సన్నిధిలో మండపం, దానికి ఆచ్ఛాదనగా విమానం ఉన్నాయి. 4 గ్రానైట్ స్తంభాలీ విమానానికి ఆధారం. మండపం మధ్యలో పాలరాతి పద్మం, దానిమధ్యలో శివలింగం – శ్రీరమణేశ్వర మహాలింగం దివ్య తేజోమయంగా, ప్రసన్న జ్ఞాన కిరణాలను వెదజల్లుతూ, సందర్శకులలో మహద్భక్తి భావాన్ని ఆవిష్కరించే విధంగా దర్శనమిస్తుంది. ఈ మండపం చుట్టూతా, ఇంకా హాలులోను రమణుల పెద్ద పెద్ద ఫొటోలు సజీవమూర్తులై దీవిస్తాయి. 300మంది కూర్చోగల ముందుహాల్ కడప-చలువరాళ్ళతో ప్రకాశిస్తూంటుంది.
_ఉదయం 5am – 12.30pm, మధ్యాహ్నం 2pm – 9pm వరకు తెరచి ఉంటుంది._
*పాతహాల్*
*సమాధిహాల్* ఉత్తరద్వారంలోంచి నిర్గమిస్తే పెద్దనుయ్యి ‘అఘశమన’ లేక ‘రమణ’తీర్థం ఉంది. శ్రీరమణుల మహిమా ప్రసాదమైన ఈ జలాలను అభిషేకాదులకు వినియోగిస్తారు. ఎడమపక్కగా ఉన్నది పాతహాల్ లేక ధ్యాన మందిరం. భగవాన్ శ్రీరమణులు అత్యధిక భాగం ఈ హాల్‌లో సోఫాపై ఆసీనులై దర్శన, సత్సంగములను ప్రసాదించేవారు. ఆబ్రహ్మకీటక పర్యంతం అనేకులు వారిని దర్శించి, వారితో సంభాషించి, వారి అనుగ్రహానికి పాత్రులైనది ఇక్కడే. నేటికీ ఈ స్థానం సాధకులకు స్ఫూర్తిప్రదాయినిగా, సందర్శకులకు శాంతిప్రదాత్రిగా విరాజిల్లుతోంది.
ఈ హాలుకి ఉత్తరంగా చిన్నగోడ దాటగానే కొంత ఆవరణ, కొంత ఎత్తులో స్వామి స్పర్శదీక్షతో ముక్తిపొందిన కాకి, కుక్క, గోవు లక్ష్మి – మొదలైన జంతువుల సమాధులున్నాయి. గోలక్ష్మికి ప్రతి శుక్రవారం 7-15కు పూజాభిషేకాలు జరుగుతాయి. ఎడమపక్క బిల్డింగ్ – పాత డిస్పెన్సరీ హాల్, దాని నానుకొని పూదోట. సమాధుల వెనుక కొండపైనున్న స్కందాశ్రమానికి దారితీసే మెట్లు, వాటికి ఎడమపక్కన మురుగునార్ మొదలైన భక్తుల సమాధులు కన్పిస్తాయి.
*భోజన హాల్*
రమణతీర్థం నుయ్యికి ఉత్తరంగా ఉన్న పాత భోజనహాల్, దానిని ఆనుకొని నిర్మించిన కొత్తహాలు కలిపి సుమారు 7-8 వందల మంది భోంచెయ్యవచ్చును. పాతహాల్‌లో రమణులు భోజనంచేసే చోట ఓ పాలరాతి వేదిక, దానిపై శ్రీవారు భోంచేస్తున్న ఫొటో ఉన్నాయి. పాత భోజనహాల్ పక్కనే వంటశాల (కిచెన్) సర్వప్రకార ఆధునిక పరికర సమృద్ధితో అలరారుతుంది. దీని తూర్పు ద్వారం ఎదురుగా స్టోర్ రూం, దాని వెనకాల యజుర్వేద పాఠశాల, ఎదురుగా పురుషుల వసతి గృహం (ఉద్యోగులకు); ఈ రెండూ దాటాకా విశాలమైన ప్రాంగణంలో గోశాల, పురుషుల స్నానగదులు కనబడతాయి.
*గోశాల*
భగవాన్ ఆదరానుమతితో ఆశ్రమ ప్రవేశం చేసిన గోవు లక్ష్మి సంతతి, తదితర గోమాతల పాడితో దినదినాభివృద్ధి చెందినది ఆశ్రమ గోశాల. ప్రస్తుతం నూటికిపైగా గోసంతతి అందించే పాడియే అందరికీ పోషకామృతం.
*వేదపాఠశాల:*
యజుర్వేద సంప్రదాయానుగుణంగా విద్యార్థులు శిక్షణ పొందుతారు.
నిర్వాణగది
శ్రీమాతృభూతేశ్వరాలయానికి తూర్పున, ఆఫీసు గదులకు
ఉత్తరంగాను చిన్నగది సర్వాలంకార శోభితంగా ఏదో ప్రత్యేకత ఉన్నట్లు తేజరిల్లుతుంటుంది. రమణుల అవసాన కాలం మరియు వారి మహానిర్వాణానికీ, ఈ గది వేదిక అయింది. ఇందులో వారిచే తయారుచేయబడిన, వారికి భక్తులు సమర్పించుకొన్న అనేక నిత్యవాడక వస్తువులు, తదితరాలు మెరుస్తూ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
దక్షిణాభిముఖంగా వున్న ఈ గదికి తూర్పున భగవాన్ సోదరుడు నిరంజనానంద స్వామిదీ, వారి ఏకైక పుత్త్రుడు శ్రీరమణానందసరస్వతీ స్వామి (టి.ఎన్. వేంకటరామన్)ల సమాధులున్నాయి. స్వామి నిరంజనానంద భగవానుల కాలంలో ఆశ్రమ సర్వాధికారి. వారి అనంతరం వేంకటరామన్ ఆశ్రమ అధ్యక్షులు. వీటి వెనకాల కొబ్బరితోట.
*అతిథి గృహాలు*
భగవాన్ నిర్యాణానంతరం ఆశ్రమప్రాంగణంలో ఎన్నో గదులు, గదుల సముదాయాలు, భవనాలు వెలిసాయి. ఆలయాల వెనుకగా ఉన్న పాలితీర్థం పడమర గట్టున కురంగు (కోతుల) తోట అనే గృహ సముదాయం ఉంది. ఆశ్రమ ఆవరణకు బయట రోడ్డుదాటితే, ‘మోర్వీ కాంపౌండ్’ అనే మరో సముదాయం. కొంచెం దూరంలోనే మరిన్ని అతిథి గృహాలు ఉన్నాయి. ఇవన్నీ పరిశుభ్రంగా, కొద్దిపాటి సామానుతో, కరెంట్ వసతులతో సరిపడా వుంటాయి.
హాస్పిటల్: కురంగు తోటలో ఉంది అతిథులకు, బయటి పేదలకు ఉచిత వైద్యం.
పుస్తకాలయము
తెలుగు, ఇంగ్లీషు, తమిళం తదితర భాషల్లో శ్రీరమణులకు సంబంధించిన పుస్తకములు; వారిచే వ్రాయబడినవి; తెలుగు, ఇంగ్లీష్, తమిళం తదితర భాషల్లో శ్రీరమణులకు సంబంధించిన పుస్తకములు; వారిచే వ్రాయబడినవి, జీవిత చరిత్రలు, వ్యాఖ్యానాలు స్మృతులు లభిస్తాయి. ఇంకా ఫోటోలు, ఆడియో, వీడియో టేప్ – సిడి-డివిడిలు, జ్ఞాపికలు. ద మౌంటెన్ పాత్ అనే త్రైమాస పత్రిక ఇంగ్లీషులో ప్రచురణ.
ఉదయం 7.30-11, మధ్యాహ్నం 2.30.- 6.30 తెరచి ఉంటుంది.
*శ్రీ రమణ గ్రంథాలయము*
వంటగదికి, స్టోర్‌రూమ్‌కు మధ్యనుంచి కొండవైపుగా ఉత్తరదిశలో ఉంది. 2012లో నిర్మింపబడి శ్రీరమణులవే కాక, అనేక మార్గాలకు చెందిన ఆధ్యాత్మిక గ్రంథాలు వివిధ దేశభాషలలో వేలాదిగా సమకూర్చబడి వున్నాయి. సందర్శకులను శ్రీ దక్షిణామూర్తి నిండువిగ్రహంతో ఆకర్షిస్తుంది. పుస్తకాలు తీసుకెళ్ళడానికి మెంబర్‌షిప్ ఉండాలి.
*స్కందాశ్రమం*
కొండపైకి 1.4 కి.మీ దూరంలో 30 ని.లో చేరుకోవచ్చు. టౌన్‌లోంచి గిరిహృదయంగా కనబడే ఈ గుహనిర్మాణం పెద్దవృక్షాలతో కప్పబడి చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. భగవాన్ ఇక్కడ 1916-22 కాలంలో నివసించారు.
*విరూపాక్షగుహ*
స్కందాశ్రమానికి కొంచెం కిందుగా మెట్లవెంట దిగి చేరుకోవచ్చు. ఓంకారాకృతిలో ఉండే ఇది విరూపాక్షదేవుల సమాధి. బ్రాహ్మణస్వామిగా పిలువబడే శ్రీరమణులు ఇక్కడ 1899-1916 కాలంలో నివసించారు. ఇక్కడే శ్రీకావ్యకంఠ గణపతిముని (నాయనగారు) వారికి భగవాన్ శ్రీరమణమహర్షి అని నామకరణం చేసారు.
శ్రీరమణాశ్రమం ఈ రెండు స్థలాలను సాధకుల ధ్యానం కొరకు సంరక్షిస్తోంది. ఇవి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 4గం.వరకు తెరచిఉంటాయి.
కోవిడ్ నిబంధనల కారణంగా ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఆశ్రమ దర్శన సమయాలలో ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు జరుగుతున్నాయి గమనించగలరు
అరుణాచలం - గిరి ప్రదక్షిణ కు సంబంధించిన పూర్తి వివరాలు మొత్తం ఆరు భాగాలుగా మీకు అందించడం జరిగింది ఇంతకు ముందు భాగములు చదవని వారు, ప్రొఫైల్ లో పరిశీలించగలరు మరియు మొదటి సారి అరుణాచలం యాత్ర చేసేవారు, గిరి ప్రదక్షణ చేసేవారికి చాలా ఉపయుక్తంగా ఉండేలా పూర్తి వివరాలను ఇంతకుముందు భాగాల్లో అందించడం జరిగింది
*ఓం నమో భగవతే శ్రీ రమణాయ*🙏
ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏
500 ఏళ్ళ క్రితం జరిగిన అద్భుత సంఘటన శ్రీ సుబ్రహ్మణ్యుడే శ్రీ సుబ్బారాయుడుగా వెలసిన క్షేత్రం శ్రీ సుబ్బారాయుడి నిజరూప దర్శనం🙏🙏🙏
పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది. ఆదివారం అందరికీ సెలవు. ఆ పల్లెకూ సెలవే. కానీ మిగిలినవారికంటే కాస్త ఎక్కువ సెలవు. ఆదివారం మాంసాహారం ముట్టకపోవడం, అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం.
మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా.. ఆ ఊరిలో దొరకదు. ఆరు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థల పురాణ నేపథ్యం ఉంది.
స్థలపురాణం;-
500 ఏళ్ళ క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయిం చాడు. మాఘ శుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించారు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డుతగులుతుంది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమౌతుంది. ఆ తేజస్సుకు రైతు కంటిచూపు కోల్పోతాడు.
కాసేపటి చుట్టు పక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కులాగి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయట పడుతుంది. ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడినని(సుబ్రహ్మణ్యేశ్వస్వామి), మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతారు. అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటిచూపు వస్తుంది.
దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్థులు నిర్ణయించుకుంటారు. స్వామివారిని వేడుకుంటారు. ‘రాత్రి రోకలిపోటు తరువాత మొద లుపెట్టి.. తెల్లవారు జామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలి’ అని స్వామి సెలవిస్తారు. లేదంటే ఏడుగురు బలి అవుతారని హెచ్చరి స్తాడు.
స్వామివారి స్వయంభు విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పులేని ఆలయం సిద్ధమౌతుంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా.. స్వామి వెలసిన తరువాత సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది. ఇదీ స్థల పురాణం.
ఆదివారం సెలవెందుకు..?
సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం. ఎస్ కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. కేవలం ఆదివారం రోజే సుమారుగా 6 నుంచి 8 వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు. ఆ ఒక్కరోజే సుమారు మూడు వందల అభిషేకాలు జరుగుతాయి.
స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తమను చల్లాగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్థులు.
ఆదివారం వస్తే మాంసాహారం వండరు, తినరు. గ్రామంలో మాంసాహార దుకాణాలు లేవు. మామూలు రోజుల్లో కావాలన్నా.. గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రిపండుగ నిర్వహించడం సాధారణం. ఆ పండుగ ఆదివారం వస్తే.. సోమవారానికి వాయిదా పడుతుంది.
*🐍ఆ మూడు మాసాల్లోనూ అంతే..*
ఏడాది పొడవునా ఆదివారాలతోపాటు కార్తీకం, మాఘం, శ్రావణ మాసాల్లో గ్రామస్థులు మాంసాహారం ముట్టరు. ఈ కట్టుబాటును ఎవ్వరూ మీరింది లేదు. ఆదివారాలతో కలిపి ఇలా ఏడాదిలో సుమారు నాలుగు నెలల పాటు మాంసా హారానికి దూరంగా ఉంటూ గ్రామస్థులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుం టున్నారు. ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు.
*🐍అంత్యక్రియలకూ సెలవే....*
కొత్తూరులో 220 కుటుంబాలు ఉన్నాయి. జనాభా సుమారు 900. ఆదివారం గ్రామస్థుల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించరు. మరుసటిరోజు వరకూ మృత దేహాన్ని ఇంటివద్దే ఉంచుతారు.సోమవారం అంత్యక్రియలు నిర్వహి బస్తారు. ఇందుకూ స్వామిపై ఉన్న అపార మైన భక్తే కారణం. గ్రామానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాన్ని తీసుకువెళితే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని గ్రామస్థులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మృతదేహంతో వెళితే భక్తులకు అంటు తగులుతుందని తమకు తామే కట్టడి చేసుకున్నారు.
ఎలా చేరుకోవచ్చు...?
బనగానపల్లె మండలం నందివర్గం నుండి S.కొత్తూరు 5 కి.మీ దూరంలో కలదు.ఇక్కడ నుండి ఆటో సదుపాయం కలదు.
🐍🙏🙏
🍁🍁 దైవదర్శనం తరువాత 🍁🍁
🌿 మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.
🌺 అది ఏమిటంటే.
❄️ అనాయాసేన మరణం
❄️ వినా ధైన్యేన జీవనం
❄️ దేహాంతే తవ సాన్నిధ్యం
❄️ దేహిమే పరమేశ్వరం
🍁 మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి,
కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.
🍁 దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.
🍁 #అనాయాసేన_మరణం
నాకు నొప్పి లేక బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు.
🍁 #వినా_ధైన్యేన_జీవనం
నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,
నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా,
ఎవరినీ నొప్పించకుండా,
నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.
🍁 #దేహాంతే_తవ_సాన్నిధ్యం
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.
🍁 #దేహిమే_పరమేశ్వరం
ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.
🌺 1. అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.
నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.
🌺 2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.
🌺 3. నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.
🌿 ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాధిస్తాడని మరువకండి.
🍁 #దీనినే_దర్పణ_దర్శనం_అంటారు,
మనస్సనే దర్పణం లో దర్శించి,
ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశన ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ
🙏🙏 లోకా సమస్తా సుఖినో భవంతు🙏🙏
🍁🍁 ఓం శ్రీ మాత్రే నమః🍁🍁
*మూడు జల్లెడ్ల పరీక్ష కథ......*
ఒక సారి *చాణ్యుకుడి* దగ్గరకు,
అతని మిత్రుడు ఒకడు వచ్చి ,
నీకు తెలుసా?
*నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను" అని,*
ఎంతో ఉత్సాహంగా
ఏదో చెప్పబోతున్న అతన్ని ,
చాణిక్యుడు ఆపి,
"నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు, ఒక్క నిముషం సావధానంగా,
నీవు చెప్పబోయే విషయాన్ని
కొద్దిగా జల్లెడ పడదాం.
దీన్ని నేను *"మూడు జల్లెడ్ల పరీక్ష, (Triple Filter Test)"* అంటాను అని,
అడగటం మొదలు పెట్టాడు.
మొదటి జల్లెడ *"నిజం:"* -
"నీవు,
నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం, ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?" అని అడిగాడు.
అందుకు ఆ స్నేహితుడు,
"లేదు, ఎవరో అంటుండగా విన్నాను" అని అన్నాడు.
"అంటే ...
నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని,
నీకు తెలీదన్న మాట" అని చాణిక్యుడు అన్నాడు.
సరే రెండో జల్లెడ *"మంచి "* -
" నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?" అని అడిగాడు చాణిక్యుడు,
"కాదు" అన్నాడు చాణిక్యుని స్నేహితుడు .
"అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు,
అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం-
సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం"అన్నాడు చాణిక్యుడు.
మూడో జల్లెడ *"ఉపయోగం:"* -
"నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? " అని చాణిక్యుడు అడిగాడు.
"లేదు" అన్నాడు ఆ మిత్రుడు.
"అయితే నీవు చెప్పబోయే విషయం *నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానపుడు,*
నాకు చెప్పటం ఎందుకు ?" అని అన్నాడు చాణిక్యుడు
*నీతి :*
మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు.
ఒక విషయం (చాడి) వినేముందు
ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే,
మన బంధాలు నిలబడతాయి,
*మంచి పెంపొందుతుంది.*
*చాడీలు నివారించబడతాయి.*
Guru purnima celebration
మా గురువు గారు డా౹౹ పండిట్ మల్లాది మణి గారి దివ్య పాద పద్మాలకు అంకితమిస్తూ ఈ చిరు కవిత
ఏ జన్మలో చేసిన పుణ్యఫలమో చేరితి నీ పదముల,
మట్టిలో కలిసేడి జోలెను చాచితి అభయము నీయవయా,
కళ్లను కమ్మిన అజ్ఞానవు పొరలను తొలిచెడి జ్యోతిని వెలిగించవయా,
దోషము తీరగ మరి మరి దీవెనలీయవయా,
తెలియక చేసిన తప్పుల కాయగ మార్గము చూపవయా,
నీ పదముల సేవ చేయ ,శిష్యుడిగ నా కో అవకాశము నీయవయా
Copy pasting it
There is a story of the mystic Madhusudan, and his meeting with Gorakhnath, the saint of Gorakhpur, where my body was born. When I heard this story, that cured me of any wish for miraculous powers. Gorakhnath had attained all the eight powers, or aiswaryas, of a fully enlightened yogi. At the time of his departure from the body, he wanted to bestow his powers on some worthy soul...
One day Gorakhnath saw in vision a young man, a very spiritual soul, standing by the Ganges in Banaras. Having the power to transport himself astrally from one place to another, Gorakhnath appeared before the young man, Madhusudan, who looked up and, seeing the saint, said, "Please do not stand in front of me. You are obstructing the sun."
The saint replied, "Do you not know who I am? I am Gorakhnath."
"I know," the young man said, "but I am busy now with my devotions." After some time the devotee inquired of the saint, "What is it you want of me?"
Gorakhnath explained, "I have eight powers,- and the one to whom I give this chintamani [a mystical gem that grants all wishes] will have these powers. I wish to offer them to you."
Madhusudan said, "All right, give them to me." Whereupon, to the great astonishment of Gorakhnath, he took the mystical gem and threw it far out into the waters of the Ganges.
"Why did you do that?" Gorakhnath demanded.
Then the young man said, "Delusion still, delusion still. Those powers were given to me to do with as I wished, were they not? Well, that is the only use I have for them. Compared to That which I already have, they are nothing." The great Gorakhnath bowed down to him and said, "You have rid me of the last delusion that was keeping me from God."
Even the great ones sometimes get distracted from the Goal. Gorakhnath was so enamored with his powers that he had not gone beyond them to God. But when at last he renounced attachment to that treasured possession, he attained God-union. You see, delusion takes many forms; but the divine devotee is like the single-hearted Madhusudan in this story.
When you love God, you do not desire anything else, because God is the most lovable of anything you could possess. The devotee will accept no substitute for God. He knows that God is all in all, that He is ever present, and that He alone is a sure refuge from the travails of life.
Paramahansa Yogananda
Journey To Self-Realization
Good news to all
People those who have ill placement of jupiter in their birth charts and who have promise of pending karma related to guru in their birth charts, all can do remedy for guru on this aspicious day. respect your teachers and respect your gurus.
24 july 2021 is Gurupurnima
Guru Brahma Gurur Vishnu
Guru Devo Maheshwaraha
Guru Saakshat Para Brahma
Tasmai Sree Gurave Namaha.
Guru is Shiva sans his three eyes, Vishnu sans his four arms, Brahma sans his four heads. He is parama Shiva himself in human form – Brahmanda Puran
Guru and God both appear before me. To whom should I prostrate? I bow before Guru who introduced God to me. – Kabir
Full moon day during Ashadha month is known as Guru Purnima day. Traditionally this day is reserved for Guru Puja or Guru Worship. On this day disciples offer Puja or pay respect to their Gurus. Guru refers to spiritual guide who enlighten disciples by his knowledge and teachings.
Guru Purnima is also known as Vyasa Purnima and this day is commemorated as birth anniversary of Veda Vyasa. Veda Vyasa was the author as well as a character in the Hindu epic Mahabharata.
regards
Rajesh Goud Rachamalla
Click here to claim your Sponsored Listing.
Location
Contact the school
Telephone
Address
Jpcolony
Hyderabad
502319
Opening Hours
| Monday | 10am - 5pm |
| Wednesday | 10am - 5pm |
| Thursday | 10am - 5pm |
| Friday | 10am - 5pm |
| Saturday | 10am - 5pm |
| Sunday | 10am - 5pm |