14/08/2016
ఈ రోజు ఆదివారం అంటె దాదాపుగా అందరు ఎంజాయ్ చేసె రోజు . వారం అంతా కష్టపడి రెస్ట్ తీసుకునే వారు కొందరు. సినీమాలకీ , షికార్లకి వెళ్లే వారు కొందరు . పబ్ లకి ,క్లబ్ లకి కొందరు ,పార్కులకి కొందరు, తాగడానికి , కొందరు, రెస్టారెంట్ లకి కొందరు, షాపింగ్ మాల్ కి కొందరు , చికెన్ ,మటన్ , చేపలు , రొయ్యలు, పీతలు ,బిర్యానీ లు ,పలావ్ లు ,
అబ్బో చాలా అంటె చాలా ఎంజాయ్ చేస్తారు చాలా మంది .
చెయ్యండి ...మీ డబ్బు మీ ఇష్టం కానీ ఒక్క సారి ఒక్కపూట కుడా తిండి లేని పేద వారికోసం ఆలోచించండి . ఒంటి మీద గుడ్డ లేకుండా తిరిగే బీద వారి కోసం అలోచించండి. మీకు తోచినంతలోనే సహాయపడండి. వారి ఆకలి తీర్చండి.
అందరికి కాదు కష్టం చేసే వయసు లేక , వయసు ఉన్నా అంగవైకల్యంతో ఉండేవారికి, గుడ్డి వారికి , ప్రమాదంలో పోగొట్టుకున్న శరీర భాగాల వారికి
మీకు తోచినంత సహయం చెయ్యండి. డబ్బులు ఇచ్చే బదులు కూడు ,గుడ్డ ఇస్తే ఇంకా మంచిది ....సహయం చేస్తే అందులో ఉన్న అనందమే వేరు ...
నాది కుడా మధ్యతరగతి కుటుంబమే . అయినా ఉన్న దాంట్లోనే సహయం చేస్తా . సహాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదు మంచి మనసు అని మదర్ థెరిస్సా చెప్పింది.
డబ్బు శాశ్వతం కాదు అంటారు చాలా మంది . కాని డబ్బే శాశ్వతం మనుషులు కాదు . మనిషికే చావు డబ్బుకి కాదు .....
like ల కోసమో , commont ల కోసమో కాదు ఈ పోస్టు చేసింది... నేటి కాలం లో బుక్ ల కంటే ఫేసుబుక్ లోనే ఎక్కువ ఉంటున్నారు . చదివి స్పందిస్తారని ఆశతో ......
ఇట్లు ,
ప్రేమతో ,
మీ చంద్రశేఖర్ ఇండియన్...