16/04/2020
తల్లిదండ్రులకు నమస్కారం.
అనుకోని సెలవులతో పిల్లలు పాఠశాలకు దూరమయ్యారు మీకు దగ్గరయ్యారు. మీరు కూడా లాక్ డౌన్ లో ఖాళీగానే ఉన్నారు. పిల్లలతో పుస్తకాలు చదివించడమో, కథలు చెప్పడమో,వాళ్ళచేత చెప్పించడమో చేస్తున్నారా! ఒక విద్యా సంవత్సరం పాడైపోతే దాని విలువ మీతోపాటు టీవీలకతుక్కుపోయిన పిల్లలకు తెలియదు. మీకు తెలుసు. నిజంగా నేనిలా అనడానికి ఎంత బాధపడుతున్నానో మీకు అస్సలు తెలియదు. ఒక ఉపాధ్యాయునిగా మాకెంత ఆవేదన కలుగుంతుందో మీరస్సలు అర్థం చేసుకోరు. తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచించండి మీ పిల్లలకు పుస్తక ఫఠనం అలవాటు చేయించండి. టెక్స్ట్ బుక్సు చదకపోతే పోనీ కథలపుస్తకాలు కానీ పేపరు కానీ లేదా ఇంకేది అందుబాటులో ఉంటే అది చదవమనండి.ఈరోజు పేపరు లేకుంటే నిన్నటిది, మొన్నటిది, ఏడాది కిందటిదైనాసరే చదివడం వల్ల పఠనం అలవాటౌతుంది. బొమ్మలు గీయించండి, ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకూ ఏం చేశారో రాయమనండి. రచనా కౌశలం పెరుగుతుంది. మీరీ రోజు వండే కూర ఎలా చెయ్యాలో రాయమనండి. ఊరు గురించీ, బడి గురించీ,కుటుంబం గురించీ, చుట్టాల గురించీ, వాళ్ళింట్లో జరిగిన పెండ్లో, ఫంక్షనో దాని.గురించీ చెప్పమనండి, రాయమనండి.అదీ పొద్దంతా కాదు సుమా,రోజులో ఒక గంటో రెండు గంటలో వారికోసం మీరూ కూర్చోండి. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు సమస్త ఉపాధ్యాయ లోకానిది. ఇది ప్రతి తల్లిదండ్రులకు చేరాలి. గ్రామాల్లో ఉన్న యువకుల్లారా మీకు నా విన్నపం. అందరికీ స్మార్టు ఫోన్లు ఉండకపోవచ్చు, లేదా వాళ్ళు మెసేజ్ చదవలేక పోవచ్చు. మీరు ఫోన్ల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించండి. మీరు గనక ఈ పని చెయ్యకపోతే బడి తెరిచిన తర్వాత పిల్లలను మునుపటి స్థాయికి తీసుకు రావడానికి చాలా సమయం పట్టొచ్చు.అప్పుడు మీ పిల్లలు వెనకబడే అవకాశం ఉంటంది.
మీ పిల్లలను తీర్చి దిద్దండి.
మీ ఉపాధ్యాయులకు సహకరించండి.
మీ...
విష్ణు వర్ధన్ రెడ్డి,
Correspondent,
GEMS,
Choppadandi.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏