14/01/2022
#సంక్రాంతి_శోభ
కోడి కూతలు పల్లె నిద్రలు
కొండపలుకులు వేకువ ముద్రలు
కోటి ఆశలు మొద్దు నిద్రలు
కొలను కళలు జల ముద్రలు
ఊరు ఊరంతా సంక్రాంతి శోభయే
భోగి మంటలు పూల ముగ్గులు
గొబ్బి పాటలు బాల మొగ్గలు
తోట కందులు పప్పు వంటలు
కొమ్ము మెరుగులు బండియెద్దులు
ఊరు ఊరంతా సంక్రాంతి శోభయే
కొత్త బియ్యాలు సల్ల ముద్దలు
కోడె గిత్తలు వెన్న ముద్దలు
కొత్త కోకలు కొమిరె సద్దులు
కోడె కారులు కొంటె సుద్దులు
ఊరు ఊరంతా సంక్రాంతి శోభయే
లేగ దూడలు లేత చిందులు
వేప చిగురులు వెలుగు తోరణాలు
తేట తెలుపులు ఇంటి రంగులు
వేధ నిర్దేశాలు తుంటరి పిల్లలు
ఊరు ఊరంతా సంక్రాంతి శోభయే
హరి దాసులు శ్రీహరి నామాలు
గ్రామ దేవతలు చలిబిండి పొంగళ్ళు
గింగిరెద్దులు గంగడోలులు
కోడి పంద్యాలు ఎద్దుల పోటీలు
ఊరు ఊరంతా సంక్రాంతి శోభయే
పిల్ల కాలువలు వాగు వంకలు
చల్లని కుటీరాలు మంచు మేఘాలు
రాళ్ళ బండలు గిట్టల సవ్వడులు
గళ్ళ చెరుకులు పంట పొలాలు
ఊరు ఊరంతా సంక్రాంతి శోభయే
కాలిగజ్జెలు కుళుకు నడకలు
వాడి కనులు ఓర చూపులు
వాలు జడలు జాణ విసురులు
కాళీ పూజలు వరాల మగువలు
ఊరు ఊరంతా సంక్రాంతి శోభయే
🚩🔱🚩🔱🚩🔱🚩🔱🚩🔱🚩
©®✍ప్రభాకర్🌞పలకరింపుల
https://youtu.be/Vy-UNfU-iiw
భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు 🌹🌹🌹
#సంక్రాంతి_శోభకోడి కూతలు పల్లె నిద్రలుకొండపలుకులు వేకువ ముద్రలుకోటి ఆశలు మొద్దు నిద్రలుకొలను కళలు జల ముద్రలు.....