23/04/2023
ఈ రోజు పివికెఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజి లో AULMNI అసోసియేషన్ సమావేశంలో కాలేజీ నందు జరిగినది. సమావేశంలో కళాశాల డెవలప్మెంట్ కొరకు అందరూ కలసి పట్టు దాలతో ఏదైనా చెయ్యాలి అని, క్లాస్ రూమ్స్ కి కావలసిన వాటి విషయం పై, విద్యార్థులకు డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసే లోపు ఏదైనా కంపెనీస్ లో ప్లేస్మెంట్స్ గురించి, ఇంటెన్షిప్, మరియు తదితర కార్యక్రమాల కు సంబంధించి చర్చిమాచడం జరిగింది. ముఖ్యం గా పివికెఎన్ ప్రభుత్వ కళాశాల కు సంబంధించిన ఆస్తిని కాజేస్తుహున్నవాళ్ళ మీద AULMNI అసోసియేషన్ వారు దృష్టి పెట్టి ఉన్న భూమిని కాపాడుకుంటూ, కాజేసినటువంటి భూమిని మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ తగ్గకుండా పివికెఎన్ కళాశాల తల్లి తో సమానంగా భావిస్తూ మళ్ళీ మన తల్లి భూమిని వెన్నకి తీసుకోవడాని అన్ని విధాలా ప్రయత్నం చేసి సాధిస్తామని నిర్మొహమాటంగా చెబుతున్నాము. అదే విధంగా పూర్వ విద్యార్థులు ఎవరైతే పివికెఎన్ కళాశాలలో చదివారో వారు ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య పై పోరాటం చెయ్యాలి. ఇప్పటివరకు ఎవరైనా ALUMNI లో లేకుంటే ప్రతి ఒక్క పూర్వ విద్యార్థి కళాశాలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మనకు చిత్తూరు లో గొప్పగా ఏదైనా ఉంది అని చెప్పుకోవడానికి ఒక్క పివికెఎన్ కాలేజ్ త్తప్ప మరొక్కటి లేదు. రేపటి దినములలో మనకు యూనివర్సిటీ కావాలన్న అంత మొత్తంలో ఆస్తి ఎక్కడా దొరకదు, మనం ఉన్న భూమిని కాపాడుకుందాం. ఈ విషయం పై ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది, ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి అని ALUMNI అసోసియేషన్ కోరుకొంటుంది.