ZPHS Kothapeta Chirala

ZPHS Kothapeta Chirala unique facilities available in this school

23/05/2025
recalling a sequence of related memories
20/05/2025

recalling a sequence of related memories

23/02/2025
05/01/2025

పదవ తరగతి ఫిజికల్ సైన్స్ పరీక్షల్లో విజయం సాధించాలంటే.........

ప్రశ్నాపత్రం పూర్తిగా ప్రభుత్వం చే జారీ చేయబడిన బ్లూ ప్రింట్ ఆధారంగా తయారు చేయబడుతుంది బ్లూ ప్రింట్ పై పూర్తి అవగాహన తెచ్చుకుంటే పాస్ కావడం సులభమే కాకుండా మంచి మార్కులు కూడా తెచ్చుకునే అవకాశాలు బాగా మెరుగుపడతాయి బ్లూ ప్రింట్ ప్రకారం ఏ పాఠంలో ఏ సామర్థ్యం కింద ఎన్ని మార్కుల ప్రశ్నలు ఇచ్చారు అదే విధంగా ప్రశ్నాపత్రంలో కూడా అదే పాఠంలో అదే సామర్థ్యం కింద అన్ని మార్కుల ప్రశ్నలే వస్తాయి.ప్రశ్న
మారవచ్చునేమో కానీ వెయిటేజ్ మాత్రం మారదు.
ఇలా "ఫిజికల్ సైన్స్" ఒకటే కాదు అన్ని సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలు బ్లూ ప్రింట్ ఆధారంగానే తయారు చేయబడతాయి.
ఇంతకీ బ్లూ ప్రింట్ ప్రకారం ఏఏ పాఠాల్లో ఎన్ని ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాం.

ముందుగా ప్రశ్న పత్రం యొక్క స్వరూపాన్ని పరిశీలిస్తే 17 ప్రశ్నలు ఉంటాయి.
1 మార్క్ ప్రశ్నలు
ప్రశ్న సంఖ్య
1 నుండి 8 వరకు ఇవ్వబడతాయి.
9,10,11వ ప్రశ్నలు రెండు మార్కుల ప్రశ్నలు
కాగా
12,13,14 ప్రశ్నలు నాలుగు మార్కులకు సంబంధించినవి.
15,16,17 ప్రశ్నలు 8 మార్కులకు సంబంధించినవి.
ఫిజిక్స్ లో నాలుగు పాఠా లు కెమిస్ట్రీలో నాలుగు పాఠాలు ఉన్నాయి కదా
ఛాయిస్ తో కలుపుకొని ఫిజిక్స్ లో నుండి 39 మార్కులకు అలాగే కెమిస్ట్రీలో నుండి 39 మార్కులకు ప్రశ్నాపత్రం రూపొందించబడి మొత్తం 78 మార్కులకు ఇవ్వబడతాయి.
ఛాయిస్ 28 మార్కులు తీసివేస్తే నెట్ 50 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది.
అర్థమైంది కదా చాయిస్ తో కలుపుకొని 78 మార్కులకు ప్రశ్నాపత్రం ఇస్తే చాయిస్ తీసేసి 50 మార్కులకు మీరు పరీక్ష రాయాలి.
అంటే ఫిజిక్స్ నాలుగు పాఠాలకు, కెమిస్ట్రీ నాలుగో పాఠాలకు మొత్తంగా సమన్యాయం జరిగిందన్న మాట!
ఇప్పుడు పాఠాల వారీగా ఏఏ పాఠంలో ఎన్నెన్ని మార్కులు వస్తాయో చూద్దాం

Chemical reactions and equations -
9 marks

Acids bases and salts 10 marks

Metals and non-metals 9 marks

Carbon and its compounds
11 marks

Light reflection and refraction
10 marks

The human eye and colourful world
9 marks

Electricity
12 marks
Magnetic effects of electric current
8 marks

ఒక మార్కు ప్రశ్నలు "లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్" మరియు "మాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్" పాఠాలు తప్పించి మిగిలిన అన్ని పాఠాల నుండి వస్తాయి.
యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ మరియు ఎలక్ట్రిసిటీ పాఠాల నుండి రెండేసి ప్రశ్నలు తప్పకుండా వస్తాయి.

రెండు మార్కుల ప్రశ్నలు లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్,
ఎలక్ట్రిసిటీ మరియు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ పాఠాల నుండి వస్తాయి.

ఇక 12వ ప్రశ్న "డయాగ్రమ్" కు సంబంధించినది. నాలుగు మార్కులకు "ఇంటర్నల్ ఛాయిస్" తో ఉంటుంది.
లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ లేదా
ఆసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ పాఠాల్లో ఏదో ఒక పాఠం లోని మొత్తం డయాగ్రమ్స్ నేర్చుకుంటే సరిపోతుంది ( పాస్ అయితే చాలు అనుకునే వారికి మాత్రమే).
13వ ప్రశ్న "లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్"
నుండి
14వ ప్రశ్న ఆసిడ్స్,
బేసెస్ అండ్ సాల్ట్స్ పాఠం నుండి వస్తాయి. ఇవి రెండు నాలుగు మార్కుల ప్రశ్నలు.

ఇక ఎనిమిది మార్కుల ప్రశ్నల విషయానికి వస్తే

15వ ప్రశ్న
"హ్యూమన్ ఐ అండ్ కలర్ ఫుల్ వరల్డ్"
లేదా "ఎలక్ట్రిసిటీ" పాఠాల నుండి వస్తుంది ఇందులో ఏదో ఒక పాఠాన్ని సెలెక్ట్ చేసుకుని అందులో ఉన్న ఎనిమిది మార్కుల ప్రశ్నలు అన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి.

16వ ప్రశ్న కెమిస్ట్రీ పాఠాలలో నుండి
అడుగుతారు.
"కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ "
లేక "కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్"
పాఠంలో ఉండే 8 మార్కుల ప్రశ్నలు అన్నీ నేర్చుకుంటే సరిపోతుంది (ఛాయిస్ మీదే ).

ఇక 17వ ప్రశ్న ప్రశ్నాపత్రంలో చివరి ప్రశ్న ఎక్స్పరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్.
ఇందులో "మెటల్స్ అండ్ నాన్ మెటల్స్" (కెమిస్ట్రీ) లేదా "మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్" (ఫిజిక్స్) పాఠాల్లో నుంచి అడుగుతారు అంటే "మెటల్స్ అండ్ నాన్ మెటల్స్" లో ఎక్స్పరిమెంట్ ప్రశ్నలు అన్ని నేర్చుకుంటే సరిపోతుంది.
లేదా ఫిజిక్స్ లో "మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అఫ్ ఎలక్ట్రిక్ కరెంట్"
లో నుండి నేర్చుకోవాలి (ఛాయిస్ మీదే )
===========
ఇలా బ్లూ ప్రింట్ ఆధారంగా ప్రశ్నాపత్రం వస్తుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ ప్రిపరేషన్ సాగిస్తే ఉత్తీర్ణతతో పాటు గరిష్టంగా 50 కి 40 మార్కుల వరకు మీరు సాధించవచ్చు.
ఎంపీసీ.... బైపీసీ.... గ్రూపులు తీసుకొని ఇంటర్ లో చదవబోయే వారు బ్లూ ప్రింట్ తో పని లేకుండా ప్రతి పాఠాన్ని క్షుణ్ణంగా చదివి ఏ టు జెడ్ కీలక అంశాలు నేర్చుకొని 50 మార్కులకు 50 మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను.

"విజయం సాధించిన వారి వెనుక ఎటువంటి మంత్రదండాలు లేవు ఉన్నదల్లా హార్డ్ వర్క్ మాత్రమే "

ఇట్లు
పవని భానుచంద్రమూర్తి
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
చీరాల.
💐💐💐💐💐💐
పరీక్షల్లో వ్రాసేటప్పుడు కొన్ని సూచనలు
=============
👉చక్కగా మార్జిన్లు కొట్టి రాయండి
👉ఇరికించి రాయవద్దు
గుండ్రంగా రాయండి 👉కొట్టివేతలు వీలైనంత తగ్గించండి
👉ఒక మార్కు ప్రశ్నలు ఒకే వరుసలో రాయండి.మధ్యలో... మధ్యలో ఎక్కడబడితే అక్కడ రాయొద్దు
👉 తెలియకపోతే ప్రశ్న నెంబర్ వేసి ఖాళీ వదిలి చివరలో ఏదో ఒకటి అట్టెంప్ట్ చేయండి.

👉డయాగ్రమ్స్ ఏవైనా పెన్సిల్ తో మాత్రమే గీ యాలి.
👉17వ ప్రశ్న ఎక్స్పరిమెంట్ ప్రశ్నలో
aim,
కావలసిన మెటీరియల్స్.....
ప్రొసీడ్యూర్...... అబ్జర్వేషన్స్.....
హెడ్డింగ్స్ పెట్టి చక్కగా రాయండి.
బొమ్మ అడిగితే మాత్రమే గీయండి.
P.S.పరీక్ష కి రెండు గంటల సమయం మాత్రమే ఉంటుంది కాబట్టి చాయిస్ ప్రశ్నల జోలికి ముందే వెళ్ళవద్దు. చివరిలో సమయం ఉంటేనే 12, 15, 16, 17 ప్రశ్నలకు ఛాయిస్ రాయండి.

పిఎస్(Physical sciences ) సబ్జెక్టు కష్టమైనదని ఫీలింగ్ వదిలేస్తే మంచిది.
ఛాలెంజ్ గా చదివితే పాస్ కావడంతో పాటు మంచి స్కోర్ కూడా మీదే
విజయోస్తు

మీ

భాను చంద్ర మూర్తి

పదవ తరగతి PS మొదటి పాఠం పై రూపొందించిన రెండు క్విజ్ లు ఎన్ని సార్లయినా,ఎవరైనా రాయొచ్చు.విద్యార్థులకి షేర్ చేయండి Chemica...
13/06/2024

పదవ తరగతి PS మొదటి పాఠం పై రూపొందించిన రెండు క్విజ్ లు
ఎన్ని సార్లయినా,ఎవరైనా రాయొచ్చు.

విద్యార్థులకి షేర్ చేయండి
Chemical reactions &Equations
క్విజ్ -1
👇👇👇👇👇👇
https://forms.gle/JnMeEFJGjqHnjk8d6

Chemical reactions &Equations
క్విజ్ -2
👇👇👇👇👇👇👇👇
https://forms.gle/jDQoeF366j3Hu8a9A

Chemical reactions and Equations This quiz made by Pavani Bhanu Chandra murthy NCSC Co Ordinator,Bapatla district Chirala

Bhanu's Quiz on world  Environmental day-2024https://forms.gle/aeYNVfG4GCYKsKhV9క్విజ్ లింక్👆👆👆👆👆ప్రపంచ పర్యావరణ దినోత్స...
03/06/2024

Bhanu's Quiz on world Environmental day-2024

https://forms.gle/aeYNVfG4GCYKsKhV9

క్విజ్ లింక్👆👆👆👆👆

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (ఆంగ్లం: World Environment Day)ను ప్రతి సంవత్సరం జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ద్వారా నడపబడుతుంది.
ఈ రోజున మానవ పర్యావరణం పై ఐక్యరాజ్యసమితి సమావేశం ప్రారంభించింది. 1972 జూన్ 5 వ తేది నుంచి 16 వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవమును జూన్ 5 తేదిన వేర్వేరు నగరాలలో విభిన్న రీతులలో అంతర్జాతీయ వైభవంగా జరుపుకుంటున్నారు.

Pavani Bhanu Chandra Murthy
Bapatla district

PAVANI BHANU CHANDRA MURTHY Teacher Chirala municipality Bapatla district Andhra Pradesh.

21/03/2024
17/10/2023

https://forms.gle/v2z3J3zWEgkBZjdf6

కాంతి ధర్మాలని గురించి మీకు ఇప్పటికే తెలుసుకున్నారు.
మీ నాలెడ్జ్ పరీక్షించడానికి ఈ ఆన్లైన్ క్విజ్ రాయండి.
60 శాతం మార్కులు వస్తే మీ మెయిల్ కి అభినందన పత్రం లభిస్తుంది.
మెయిల్ id సరిగ్గా రాయండి.
ఈ క్విజ్ బుధవారం రాత్రి సరిగ్గా 7 గంటలకి ఓపెన్ అవుతుంది. సర్టిఫికెట్ రావాలంటే రాత్రి 12 లోపు రాయాలి.
ఇంకా రెగ్యులర్ గా రాస్తే నగదు పురస్కారాన్ని కూడా ఇస్తారు.

మీ ఫ్రెండ్స్ కి ,రిలేటివ్స్ కి కూడా షేర్ చెయ్యండి

https://forms.gle/v2z3J3zWEgkBZjdf6

https://isroquiz.mygov.in/*One lakh cash award*and more......!*Anybody can write ✍️**Digital certificate for all*Share t...
03/09/2023

https://isroquiz.mygov.in/

*One lakh cash award*

and more......!

*Anybody can write ✍️*

*Digital certificate for all*

Share this message

PAVANI BHANU CHANDRA MURTHY

Take our Chandrayaan 3 Mahaquiz and test your knowledge about India’s lunar mission. India is now on the moon! Challenge yourself and learn interesting facts about India’s space exploration endeavors

Address

KOTHAPETA, I. L. T. D. COLONY, CHIRALA
Chirala
523157

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

9490385785

Website

Alerts

Be the first to know and let us send you an email when ZPHS Kothapeta Chirala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to ZPHS Kothapeta Chirala:

Shortcuts

Share

Category