Doms8486 Trust FB Page
Doms8486 is the 84-86 batch of MBA students of University of Madras. Trust was started on 16.11.2011 . It helps students and renders other help to needy.
28/02/2026
చెన్నై ఎక్స్ ప్రెస్ మార్చి 2026 తిథుల క్యాలెండరు. తిధులు, నక్షత్రాలు చూసే వారికి ఉపయోగ పడుతుంది.
Please save it in your computer and mobile.
#2026 #తెలుగు #తిథులు #తేదీలు
15/02/2026
పీ . బీ . శ్రీనివాస్ గారి గురించి వారి అబ్బాయి ఫణీంద్ర గారు వ్రాసినది
Page - 2
ఒక నాలుగు దశాబ్దాలలో ( 40 సంవత్సరాలలో ) ఆయన ఎన్నో వేల పాటలు పాడారు. ఇంచుమించు 5,000 పాటలు ఉండవచ్చు అనేది ఒక అంచనా , దానికి ఒక లెక్క లేదు , కాని ఒక అంచనా. కొన్ని కొన్ని సినిమాలకు ఈయనే లిరిక్స్ రాసి కంపోజ్ చేసి మిగతావాళ్ళచేతకూడా పాడించారు . ఆల్ ఇండియా రేడియోలో , టెలివిజన్ లో
గ్రాంఫోన్ హెడ్స్లో ఈయన పాటలు చాల పాపులర్ ఆ రోజుల్లో. శారదా భుజంగ స్త్రోత్రం , లక్ష్మి స్త్రోత్రం , సంస్కృత డివోషనల్సు , హిందీ భజన్స్ , ఉర్దూ , కన్నడ గజల్స్ మరియు ఇంగ్లీష్ సాంగ్ విత్ శ్రీమతి జానకి గారు, ఆన్ ది అకేషన్ ఇప్పుడు మనిషి మన చంద్రుడి మీద కాలు మోపిననప్పుడు, దాన్ని ఒక ఇదిగా తీసుకొని Man has Set his Foot on Moon అని ఇంగ్లీషులో ఒక రెండు సైడ్లు పాటలని రికార్డు చేసి పంపించారు. అది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ , అప్పటి ప్రెసిడెంట్ నిక్సన్ వాళ్ళు ఇద్దరు దాన్ని అక్నోలెడ్జ్ చేసి నాన్నగారికి లెటర్స్ పంపించారు. చాలా గ్రేట్ అచీవ్మెంట్ అది.
నాన్నగారికి ఉర్దూ లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆయన రేడియోలో పార్శి వాళ్ల న్యూస్ వినేవారట. అది వింటున్నప్పుడు అదేదో మ్యూజిక్ వాళ్ళు పాడుతున్నట్టుగా ఉండేదెతప్పా న్యూస్ చదువుతున్నట్టుగా ఉండేది కాదు. కాబట్టి ఈ పుస్తకాలు మన చెన్నైలో ట్రిప్లికేన్ లో వీపీపీలో తెప్పించుకొని 15 రోజుల్లో, అంటే ఈ బి.కామ్. హాలిడేస్ ఉంటాయికదా , హాలిడేస్ లో బి.కామ్. పూర్తి అయినప్పుడు అక్కడ కాకినాడలో కడప స్లాబులు ఉంటాయి ( పాత రోజుల్లో మనం కూర్చునే అరుగులు కు వాడతారు ) అవి నల్లగా ఉంటాయి. ఆయన వాటినే బోర్డులాగా వాడేవారు అన్నమాట. ఉర్దూ కుడినుంచి ఎడమకు రాస్తారు కాబట్టి ఆ రూంలో ఒక చివరి కార్నర్నుంచి స్టార్ట్ చేసి చివరిదాకా వచ్చేటట్టుగా అన్నమాట. ప్రొద్దున్న నుంచి రాత్రి వరకు సుమారు 16 గంటలకు పైగా బోజనము, నిద్ర ఇవి ఏమి లేకుండా 15 రోజుల్లో మొత్తం ఉర్దూని ఉపాసనం చేశారు. అందుకని ఆయనకు చాలా ఇష్టం ఉర్దూ లాంగ్వేజ్ అంటే . ఆ ఉర్దూ భాషలో కూడా చాలా గజల్స్ కూడా రాసారు. మన భారతరత్న బిరుదాంకితురాలు అయిన లతా మంగేష్కర్ గారు , ఈయన ఉర్దూ లాంగ్వేజ్ ని చాలా అప్ప్రెసియేట్ చేసి చాలా ఎంకరేజ్ చేసారు. ఒక Hmvలో ఈయన బాంబే వెళ్ళినప్పుడు గజల్ ఒకటి రికార్డు చేసారు. ప్రేమ్ ధావన్ అని చెప్పేసి ఆయన రాసిన గజల్ , అది బొంబె hmvలో రికార్డు చేసి ఆవిడకు వినిపిస్తే సౌండ్ ఇంజనీర్ చాలా ఇంప్రెస్ అయ్యి , ఆవిడ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆవిడతో కూడా పాడాలని ఈయనకు ఎప్పటినుంచో కోరిక ఉండేది చిన్నప్పటినుంచి , అది వచ్చి AV మెయ్యప్ప చెట్టియారు గారు హిందీలో మైభి లడికీ హూ అనే పిక్చర్లో , నాదీ ఆడ జన్మ తెలుగులో మరియు నానుం ఓరు పెన్ అని తమిళంలో వచ్చింది . ఈ మూడు లాంగ్వేజెస్ లో తమిళంలో టీ.ఎమ్. సౌందర్యరాజన్ గారు పాడారు. తెలుగులో ఘంటసాల గారు పాడారు . కానీ హిందీ ఏమో మన ధర్మేంద్ర గారికి మీనాకుమారి గారికి వచ్చే పాట చందాసే హోగా ఓ ప్యారా అనేది రాజేంద్ర కిషన్ రాసి, చిత్ర గుప్తా గారు దానికి మ్యూజిక్ చేసారు. ఆంటే తమిళంలో ఉన్న ట్యూన్ అలాగే అడాప్ట్ చేసి అదే పాట పాడారు. అది ఫస్ట్ పాట . అదెలాగనే ఆయన శ్రీమతి పద్మశ్రీ భానుమతి గారితో కూడా ఒక తెలుగు ఫిలింలో వివాహ బంధములో నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే అని ఎన్.టి. రామారావు గారికి పాడారు. అది వచ్చి విశ్వనాథ సత్యనారాయణ గారు HOD అఫ్ తెలుగు డిపార్ట్మెంట్ పి.ఆ ర్. కాలేజీలో ఈయన చదువుకుంది. వారి అబ్బాయి ఈయన క్లాసుమేటు. ఆయన ఈ పాట విని, ఒరేయ్ పురుష గాత్రం అంటే , ఇలా ఉండాలని వాళ్ళ అబ్బాయితో చెప్పితే , వాళ్ళ అబ్బాయి వచ్చి మా నాన్నగారికి చెప్పారు . ఆయన హిందీ గజల్సు ఆయనే రాసుకొని , ప్రొడ్యూసర్, డైరెక్టర్ , యాక్టర్ , సింగర్ రవి అనిచెప్పి , ఆయన కన్నడంలో బాగ్యజ్యోతి అనే సినిమాకి ఈయన వాణి జయరాం గారితో కూడా కొన్ని పాటలు పాడారు చాలా స్పెషల్గా .
🙏🙏🙏
#శ్రీకళాసుధతెలుగుఅసోసియేషన్ #కళాసుధ #శ్రీకళాసుధ #శ్రీకళాసుధతెలుగు
11/02/2026
పీ . బీ . శ్రీనివాస్ గారి గురించి వారి అబ్బాయి ఫణీంద్ర గారు వ్రాసినది .
Part 1
నాన్నగారు 1930 సెప్టెంబర్ 22న మా తాతగారైన పి.బి.డి. ఫణీంద్రస్వామి , శేషగిరి అమ్మవారు గార్లకు జేష్ఠ పుత్రుడుగ జన్మించారు . వారు ఇద్దరు మా నాన్న గారికి జీవితంలో కావలిసిన అన్ని విషయాలని చిన్నప్పటినుంచి నూరిపోసారు. అందుకే ఆయనకి కష్ట కాలంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా , ఎప్పుడూ చాలా ఆనందంగా ( హ్యాపీగా ) ఉండేవారు . ఆయన చదువు పి. ఆర్ . కాలేజీ కాకినాడలో B.Com ఫస్ట్ బ్యాచ్ , 1948-50లో జరిగింది . అప్పుడే B.Com ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసారు పి.ఆర్.కాలేజీలో. అది కాకుండా విశారద , హిందీ ప్రచార సభ చెన్నైలో చేశారు . ఆ తరువాత B.Com డిగ్రీ పూర్తిచేసిన తరువాత " లా " కోర్సు చెయ్యడం ప్రారంభం చేసారు . ఎందుకంటే మా తాతగారికి మా నాన్నగారు లాయార్ గానో, జడ్జి గానో అవ్వాలని ఒక కోరిక ఉండేది . ఎందుకంటే మా టైటిల్ ప్రతివాది భయంకరమైన వ్యక్తి . అందుకని ఆయన లాయర్ అవ్వాలని కోరుకున్నాడు , కానీ మా నాన్నగారికి అది అంత పెద్ద ఇంటరెస్ట్ గా ఉండేది కాదు . అయినా తాతగారు చెప్పడం వల్ల చెన్నైకి వెళ్లారు . సో ఈరకంగా చెన్నైకి వెళ్లి లా చేస్తూ చేస్తూ , ఫస్ట్ ఇయర్లోనే గోల్డ్ మెడల్ సంపాదించారు మ్యూజిక్ పోటీలో. ఇంక దాంతో లా విద్యకు స్వస్తి చెప్పి ఇంక ఫిలిం మరియు సింగింగ్ మీద ధ్యాస పెట్టారు . ఎందుకంటే ఆయనకి ఇది లాంగ్ టర్మ్ డ్రీమ్ ( కల ). అందువల్ల అది పూర్తి అవ్వాలనే కోరికతో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు . బై ద మెర్సీ అఫ్ గాడ్ , వారియొక్క ఆశీస్సుల వల్ల మరియు వాళ్ళ పేరెంట్స్ ఆశీస్సుల వల్ల ఆయన సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యారు. నాన్నగారు అష్ట భాషా ప్రవీణులు. ఆయన పాటలు రాయడం, కంపోజ్ చేయడం, పాడడం అన్నీ చెయ్య గలిగేవారు. ఆ ఎనిమిది భాషలలో ముఖ్యంగా తెలుగు , తమిళం , కన్నడ , మలయాళం , ఇంగ్లీష్ , ఉర్దూ, హిందీ , సంస్కృతం. ఈ ఎనిమిది భాషల్లో ఆయన కొన్ని వేల , లక్షల పాటలు రాసి కంపోజ్ చేసి పాడినారు. రోజుకి సుమారుగా 20 పోయెమ్స్ కంపోస్ చేసేవారు . 50 సంవత్సరాలకు 3 లక్షల 65 వేల పాటలు రాసుకున్నారు . ఎనిమిది భాషల్లో ( అష్ట భాషల్లో ) , వాటికీ ట్యూన్ చేసి కొన్ని పాడారు. అది ఆయన గొప్పతనం , ఆయన ఫిలిం ఫీల్డుకి . 1952 లో నేను జన్మించాను . నా డేట్ అఫ్ బర్త్ 26 , అక్టోబర్ 1952 . అదే సంవత్సరంలో అయన జెమిని సంస్థ ద్వారా మిస్టర్ సంపత్ అనే హిందీ పిక్చర్లో ఎస్ ఎస్ వాసన్ గారు ఇంట్రడ్యూస్ చేయడం ద్వార , మహామహాపథేయ పద్మశ్రీ ప్రొఫెసర్ ఈమని శంకర శాస్త్రి గారు వచ్చి మా తాతగారికి ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్ వల్ల నాన్నగారి వాయిస్ ఆడిషన్ చెక్ చేసి ఆయనికి ఎస్ ఎస్ వాసన్ గారు అవకాశం ఇచ్చారు. కొన్ని సోలో , కొన్ని బీట్స్ డ్యూయెట్స్ వాటితోపాటుగా మేడం షంషేర్ బేగం గారు , శ్రీమతి గీత రాయల్ గారు మరియు శ్రీమతి జిక్కి గార్లతో కలసి పాడారు . కానీ పూర్తిగా ఒక సోలో సాంగ్ కింద రావడమనేది బై పద్మశ్రీ నాగేంద్రరావుగారు అవకాశమిచ్చారు , ఆయన యాక్టర్ , ప్రొడ్యూసరు , డైరెక్టరు , మరియు రైటరు . జాతక ఫలా అనే చిత్రంలో మూడు భాషలలో కన్నడ, తెలుగు, తమిళం ఆ మూడింటిలోను ఆయనే ఫస్ట్ పాడారు మూడు భాషలలో . ఆ తరువాత కొన్ని వేల పాటలు పాడారు. ఇవి కాకుండా కన్నడ , తమిళం , తెలుగు, మలయాళం, హిందీ , బెంగాలీ , సౌరాష్ట్ర , తులు , కొంకణి , సంస్కృతం ఇవేకాకుండా ఇంకా కొన్ని భాషల్లో నాన్నగారు పాడారు .
🙏🙏🙏
#శ్రీకళాసుధతెలుగుఅసోసియేషన్ #కళాసుధ #శ్రీకళాసుధ #శ్రీకళాసుధతెలుగు
14/09/2025
You're strong when you know your weaknesses.
Knowledge will give you power. But good character will give you respect.
28/08/2025
One small crack does not mean you're broken. It means you were put to a test and you didn't fall apart.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
C/o Four P Intl Pvt Ltd, No 6 Esplanade, Indian Chamber Building, 3rd Floor
Chennai
600108