20/12/2020
సుమన్ కి 10 ఏళ్ళున్నప్పుడు 🚵
నాన్న: ఏంట్రా చెప్పినమాట వినటం లేదు ...పెడద్రంగా మాట్లాడుతున్నావ్? దశరథుడు చెప్తే రాముడు అడివికి కూడా వెళ్ళాడు తెలుసా? చూసి నేర్చుకో
సుమన్ : సరే డాడీ
సుమన్ కి 30 ఏళ్ళున్నప్పుడు 💑
నాన్న: ఏంట్రా నీ భార్యని అలా కొడుతున్నావ్?
సుమన్: నా భార్య ...నా ఇష్టం ...నేను కొడతాను ...చంపుతాను ...మీ రాముడు లాగే
నాన్న: రాముడు లాగా?
సుమన్: అవును చూసి నేర్చుకోమన్నావ్ గా ..ఆయన భార్యని అడవులకి పంపాడు, మంటల్లోకి దూకమన్నాడు ...నేను కూడా అదే ఫాలో అవుతున్నా
సో ...ఎప్పుడైనా పిల్లలకి నువ్వు వాడిని చూసి నేర్చుకో,వీడిని చూసి నేర్చుకో అని కాదు చెప్పాల్సింది ...వాడు ఆ టైం లో ఏం తప్పు చేశాడో నీకు తెలిస్తే ...అది తప్పు ఎందుకు అవుతుందో, ఎందుకు చేయకూడదో, అసలు చేయాల్సింది ఏంటో చెప్తే చాలు. లేకుంటే ఇదిగో ఇలా గుడ్డిగా ఫాలో అయిపోతారు...తరువాత మీ ఇష్టం.
అసలు మ్యాటర్ ఏంటంటే ....మీ పిల్లలు మీరు చెప్పినట్టే పెరగాలని ...మీరు వారి మీద అజమాయిషీ చేలాయించడం ముమ్మాటికీ తప్పే.
అదేంటి వారిని కన్నది మేమైతే ...ఆ హక్కు మాకే ఉంటుంది కదా?
అదిగో అడ్డంగా బుక్ అయ్యారు ...పాయింట్ అదే ...మీరు ఒకరికి జన్మనిచ్చేది "We are the creators" అని మురిసిపోడానికి, వారిని మీరు ఎలా చెప్తే అలా తలాడించే బొమ్మలుగా చేసుకోడానికి. ఇది ఒక పైశాచిక ఆనందం.
ఎవరికైనా పిల్లలు పుట్టబోతున్నారని చెప్పినా లేదా పుట్టారని చెప్పినా "Congratulations" పక్కనపెట్టి
వాళ్ళకి పిల్లలు ఎందుకు కావాలోనన్న ఇంటెన్షన్ ని కనుక్కోండి.
I mean ...ఫ్యామిలీ అంతా అడుకోడానికా? మీరు కన్న కలలు వారు నిజం చేయడానికా? Just మీరు పేరెంట్స్ అని పిలిపించుకోడానికా? మా వాడు ఆ కంపెనీ లో పని చేస్తున్నాడు ...మేము చెప్పినమాట వింటాడు అని చెప్పుకోడానికా? ఆస్తులు పదింతలు చేసి వంశాన్ని అభివృద్ధి చేయడానికా?
మీరు అడిగినప్పుడు వారి ఇలాంటివి ఏవన్నా చెప్తే వెంటనే మా "Let's Educate India Theme School" కి inform చేయండి. "Newborn Child Act" కింద వారిని ముందు కస్టడీ లోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇస్తాం. వినకపోతే ఆ act కి సంబంధించిన తదుపరి principles ఫాలో అవుతాం.
"Dream In Life Act" తరువాత మా థీమ్ స్కూల్ తరుపున తెస్తున్న రెండో act ఇది.
ఎవరైనా పిల్లల్ని కనాలి అని డిసైడ్ ఐనా లేక ఆల్రెడీ మీకు పిల్లలు ఉండి 10 ఏళ్ళ వయసు వారు ఐతే మీరు ఖచ్చితంగా ఇకపై "Newborn Child Act" లో రిజిస్టర్ కావాలి.
ఎందుకంటే పెళ్ళి చేసుకోవాలని అనుకునేది Two individuals కి సంబంధించిన personal ఇంటరెస్ట్ & డెసిషన్.
బట్ పెళ్ళి అయ్యాక అది ఫ్యామిలీ .... సో పిల్లవాడిని పెంచడం అనేది ఇండివిడ్యుల్ కాదు. పిల్లవాడి ఇంటరెస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు ఎవరైనా పిల్లల్ని కనాలి అని డిసైడ్ ఐతే మీరు ఈ "Newborn Child Act" లో రిజిస్టర్ అయ్యే టైం లో మేము వారి ఇంటెన్షన్ అడుగుతాం "మేము అది ఒక గ్రేట్ థింగ్ గా ఫీల్ అవుతాం ....మా పోలికలతో ఒక ప్రాణం ఈ భూమి మీదకు వచ్చి తను కోరుకున్న విధంగా బ్రతకడం చూడాలని ఉంది" ఇలా ఐతే ప్రాబ్లమ్స్ ఉండవు ...జస్ట్ జనరల్ assesment ఉంటుంది చైల్డ్ యొక్క స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో.
అలా కాకుండా ....లేదు అది మా హక్కు ...మేమే కదా వాళ్ళని కనేది,కనింది అని ఇంకా అవే మాటలు మాట్లాడుతున్నారా? No issues .....మీ రిజిస్ట్రేషన్ లేట్ అవుతుంది ...Birth Certificate మా వద్దే ఉంచుకొని ....10 years వరకు wait చేసి ...ఆ పిల్లల్నే అడుగుతాం ...మీకు ఎలా బ్రతకడం ఇష్టమో అని ....పేరెంట్స్ ఎలా చెప్తే అలా అంటే సర్టిఫికెట్ రిటర్న్ ఇచ్చేసి పంపేస్తాం. లేదు నాకు నాలా బ్రతకాలనుంది అని అంటే ....మీకు ఒక ఛాన్స్ ఇస్తాం ...ప్రాబ్లెమ్ రాకుంటే ఓకే ...కానీ మళ్ళీ మీ పిల్లల నుండి కంప్లైంట్ వస్తే మాత్రం మా డ్యూటీ మేము చేయాల్సి ఉంటుంది.
ఇక ఆల్రెడీ పిల్లలు ఉండి వాళ్ళ వయసు 10 ఏళ్ళు ఉన్నవారు ఐతే ...రిజిస్ట్రేషన్ టైంలోనే ఆ పిల్లల్ని అడిగి తెలుసుకుంటాం ...అక్కడే తేల్చేస్తాం.
పెళ్ళి ఇండివిడ్యుల్ interest అయినప్పుడు ఇది కూడా అంతే కదా ...ఐనా మా అందరి పిల్లల విషయాలు మీకెందుకు అంటారా?
ఇండివిడ్యుల్ అంటే ....Two individuals interest అది....అంటే నీకు నచ్చింది కదా అని ...అమ్మాయికి నచ్చినా,నచ్చకపోయినా నేను పెళ్ళి చేసుకునేది, చేసుకునేదే అంటే .... మా కథలో సుమన్ లాంటి
"Oh my dear misunderstood ramayanam reader" రామాయణంలో జనకుడి లాంటి వారు మాత్రం కాదు ఈ కాలం మామలు ...జాగ్రత్త ...కుక్కని కొట్టినట్టు కొడతారు ...ఈ మధ్య చంపించేస్తున్నారు అనుకోండి అది వేరే విషయం.
సో ఇక్కడ కూడా మీ ఇష్టాలు,పిల్లల ఇష్టాలు ఒకటే ఐనా ...లేదా వారి ఇష్టంతో మీకు ఎలాంటి అభ్యంతరాలు లేకుంటే ఓకే... కానీ మూర్ఖత్వం చూపించే వారే ఎక్కువుగా ఉన్నారు గనక ....నేనూ ఓ అమ్మ,, నాన్నకి పుట్టిన పిల్లవాడినే గనక ఆ pain నాకు తెలుసు కాబట్టే పట్టించుకుంటున్నాను.
చివరిగా చెప్పేది ఏంటంటే ...."నేను ఒక పిల్లవాడికి జన్మనిచ్చానని చెప్పుకునే వరకు బాగానే ఉంది కానీ ....నేను జన్మనిచ్చాను కదా అని ...హక్కు అన్న మాటని అడ్డం పెట్టుకొని అన్యాయంగా హింసించడం ....వినకపోతే చంపడాలు ఎక్కువయ్యాయి" అందుకోసమే ఈ యాక్ట్.
"Become Life Givers.... But Not The Life Instructors To Your Child"
🚼
✊✊✊ 🔥🔥🔥 💪💪💪