Mrs Anusha Chary

Mrs Anusha Chary

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mrs Anusha Chary, Educational consultant, Bangalore.

21/02/2024

ఉగ్గుపాల భాష
ఊయలలూపే భాష
మన మాతృభాష - అదే తెలుగు భాష

మమకారపు భాష
మమతను పంచిన భాష
మన మాతృభాష - అదే తెలుగు భాష

అమ్మ ఒడిలో ఓలలాడిన భాష
నాన్న చేతిలో నడక నేర్చిన భాష
అవ్వ తాత ల ఆదరణలో ఆటలాడిన భాష
మన మాతృభాష - అదే తెలుగు భాష

జ్ఞానాభివృద్ధికై మరిన్ని భాషలు నేరవండి!
సంస్కృతిని బోధించిన అమ్మ భాషను - అమ్మను మరువకండి !!
ఓనమాలు నేర్పిన మాతృభాష ఖ్యాతిని పెంచండి !!!

" అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో"
- శ్రీమతి యండపల్లి అనూష

29/06/2023

అంచెలంచెలుగా వికసించాలి వ్యక్తిత్వం

అలమటించే నీ ఆకలి కేకలు
ఆక్రోశించే నీ మానసిక ఒత్తిడి
ఆశ్చర్యపరిచే సంఘర్షణలు
ఆరాటపడే హృదయం
సూటి పోటి విమర్శలు
అర్థంలేని వేధింపులు
అవధులు లేని కోరికల వలలు
అక్కరకు రాని ఆజ్ఞాపనలు
అకుంఠిత లక్ష్యం నీ వస్త్రమై
అలుపెరుగని శ్రమ నీ కవచమై
అజ్ఞానపు అంధులను నీ బుద్ధి కుశలతతో సంస్కారం, సాంప్రదాయాలతో కూడిన విజ్ఞానాన్ని అధిష్టింప చేయ సంకల్పించిన
నీ వ్యక్తిత్వం మహోన్నతము .

- మీ యండపల్లి అనూష

27/06/2023

ఆడపిల్ల కీలుబొమ్మ:

ఎదుటి వారి నిర్ణయాలకు
తన ప్రమేయం లేకుండానే తల వంచాలి
ఆదేశాలు పాటించాలి
ఆడించినట్టు ఆడాలి
పాడించినట్టు పాడాలి
పుట్టింటి మమకారానికి అత్తింటి అనురాగానికి ఆనకట్టగా నిలవాలి
అన్ని ఆటుపోట్లను ఆస్వాదించాలి
అందరి ఆంక్షలను ఆచరించాలి ఆదరించి చిరునవ్వుతో మెలగాలి

.. మీ యండపల్లి అనూష

24/06/2023

సప్త స్వరాలు
మనోరంజకంగా...
ఆహ్లాదాన్ని కలిగిస్తూ...
ఉత్తేజపరుస్తూ...
ఉత్సాహాన్ని నింపుతూ ...
ప్రకృతిని ఆస్వాదిస్తూ...
పక్షుల కిలకిల రావాలు మనసును మైమరిపించు సంగీతానికి జోహార్లు...

- మీ యండపల్లి అనూష

Want your school to be the top-listed School/college in Bangalore?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Bangalore