01/08/2026
స్మైల్స్ ది స్కూల్, ఆర్మూర్‌లో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు
ఆర్మూర్‌లోని స్మైల్స్ ది స్కూల్లో గురుపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారులు భారతీయ ఇతిహాసాలు, పురాణాలలోని గొప్ప గురువులు, శిష్యులు మరియు ఆదర్శ పాత్రలైన ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడు, అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు, సీతాదేవి, మీరాబాయి, ఊర్మిళ, కుంతీదేవి, గాంధారి, ద్రౌపది, సాయిబాబా తదితర వేషధారణలు ధరించి వారి విశిష్టతను చక్కగా ప్రదర్శించారు.
ప్రతి విద్యార్థి తాను ధరించిన పాత్ర యొక్క గొప్పతనం, గురువుల పట్ల గౌరవం, క్రమశిక్షణ, భక్తి, విలువలు మరియు భారతీయ సంస్కృతి గురించి అందరికీ వివరించి ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ, "గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః" అనే భావనను విద్యార్థులకు చిన్నప్పటి నుంచే అలవాటు చేయడం ఎంతో అవసరమని, గురువులను గౌరవించడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని గురుపూర్ణిమ వేడుకలను విజయవంతం చేశారు.
స్మైల్స్ ది స్కూల్, ఆర్మూర్