DYFI Anantapuram

DYFI Anantapuram Study for all - Employment for all

*భయం వీడితే విజయం మీదే..దిశ DSP శ్రీనివాసులు*పోటీ పరీక్షలలో భయం వేడితే విజయం మీదే అని దిశ డిఎస్పి శ్రీనివాస్ గారు తెలిపా...
24/12/2022

*భయం వీడితే విజయం మీదే..దిశ DSP శ్రీనివాసులు*
పోటీ పరీక్షలలో భయం వేడితే విజయం మీదే అని దిశ డిఎస్పి శ్రీనివాస్ గారు తెలిపారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ )అధ్వర్యంలో స్థానిక సాయిగంగా కోచింగ్ సెంటర్లో ఎస్సై ,కానిస్టేబులు మరియు డీఎస్సీ అభ్యర్థుల అవగాహన సదస్సు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా దిశ డి.ఎస్.పి శ్రీనివాసులు తోపాటు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో ఎంతమంది పోటీ పడుతున్నారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇలాంటివి ఆలోచించకుండా ఒక్క పోస్ట్ ఉన్న అది నాదే అనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో పోటీ పరీక్షలకు సిద్ధపడాలని అన్నారు. మన లక్ష్యం కచ్చితంగా ఉద్యోగం సంపాదించాలి అనేటువంటి తపనతో పాటు కష్టపడే తత్వం అలవాటు చేసుకోవాలని అన్నారు. దీనికోసం ఒక ప్రణాళిక రూపొందించుకొని చదువుకొలని అని అన్నారు.. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ పైన ఎక్కువ దృష్టి సారించాలని అన్నారు. దీనికోసం ప్రత్యేకమైనటువంటి స్టడీ మెటీరియల్ తో పాటు వార్తాపత్రికలు రోజు చదవాలి.అందుబాటులో ఉన్న గ్రంథాలయన్నీ కూడా ఉపయోగించుకోవాలి అని అన్నారు. ఉద్యోగం పేరుతో ఎవరైనా డబ్బులు ఇచ్చి,దళారులు నమ్మి మోసపోవద్దని, స్వయంకృషిని నమ్ముకోవాలని అన్నారు. బాగా కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించి మన తల్లిదండ్రులు కూడా మంచి పేరు తేవాలని అన్నారు. పోలీసు ఉద్యోగం సాధించాలని అందరికుంటుంది, కానీ కొద్ది మంది మాత్రమే అవకాశం ఆ వస్తుంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎస్సై కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సదస్సును ఏర్పాటు చేసిన డివైఎఫ్ఐ కి సాయి గంగా కోచింగ్ సెంటర్ వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి తరిమెల గిరి సాయి గంగా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జగదీష్ తో పాటు అభ్యర్థులు పాల్గొన్నారు.

Address

1-1-980, Ghanenayak Bhavan, Indira Nagar
Anantapur

Telephone

+919182216213

Website

Alerts

Be the first to know and let us send you an email when DYFI Anantapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share