22/08/2026
వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు
అమలాపురం..
ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతోపాటు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగడం ద్వారా నూతన ఆవిష్కరణలు చేయవచ్చునని బీవీసీ చైర్మన్ బోనం కృష్ణ సతీష్,
అక్షర మేనేజింగ్ డైరెక్టర్ బోనం విజయలక్ష్మిలు పేర్కొన్నారు. భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో స్పార్క్ 6.0
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బూట్‌క్యాంప్ శనివారంతో విజయవంతంగా ముగిసింది. ఆర్టీఐహెచ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ఈనెల 17న ప్రారంభమైన బూట్ క్యాంప్ 22 వరకు నిర్వహించారు. విద్యార్థుల్లో వ్యవస్థాపక దృక్పథం,వినూత్న ఆలోచనలు, సమస్యల పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కృష్ణ సతీష్ వివరించారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ జేవీజీ రామారావు,ఈడీసీ కోఆర్డినేటర్ డాక్టర్ బీహెచ్ పవన్ సమన్వయంతో కార్యక్రమం నిర్వహించారు.ఆర్టీఐహెచ్ సీఈఓ షేక్ యాసీన్ షరీఫ్, ప్రోగ్రాం అసోసియేట్స్ టి. శ్రీనివాస్,పి.మోహన్ దుర్గా ప్రసాద్,మెంటార్ శ్రీధర్ పి.నాయుడు పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రాక్టికల్ సెషన్లు నిర్వహించి విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించారు.సమస్యల పరిష్కారం,మార్కెట్ అవగాహన,వ్యవస్థాపక నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు...