07/02/2017
plz షేర్ మిత్రులారా*📚 మన బడి - మన బాధ్యత 📚*
✊✊చేయిచేయి కలుపుదాం
చేయూత నిద్దాం....
🎪 సమాజ దేవాలయాలైన *ప్రభుత్వ పాఠశాలల* పరిరక్షణకు మరియు ఆ పాఠశాలల పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రజలందరి భాగస్వామ్యాన్ని నెలకొల్పుటకు
*ఇంటికి వంద-బడికి చంద* అనే కార్యక్రమాన్ని ప్రారంభింపదలిచాం.
✍ సమాజంలో నీతి, నియమాలు,
దేశభక్తి,క్రమశిక్షణ,నైతిక విలువలు నేటికీ బ్రతికి ఉన్నాయంటే కారణం నాటి ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన వారసత్వ సమాజమే... భవిష్యత్తులో ఈ సామాజిక బాధ్యత కల్గిన మానవీయ సమాజం కొనసాగాలంటే తప్పనిసరిగా *సమాజ దేవాలయాలైన ప్రభుత్వ బడులను* కాపాడుకోవాల్సిందే...
🏘 ఏ గ్రామం, 🏩🏩 పట్టణం అభివృద్ది అయినా ఆ పాఠశాల అభివృద్ధి పైనే ఆధార పడి ఉంటుంది. దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న వీర సైనికులను,శాస్త్రవేత్తలను,
సంఘసంస్కర్తలను,త్యాగనిరతి కల్గిన జాతీయ నాయకులను అందించిన ఘనత మన *ప్రభుత్వ పాఠశాలలదే* అని తెలియజేయుటకు గర్వ పడుతున్నాం. ఇంత ప్రాముఖ్యం కల్గిన ప్రభుత్వ విద్యాలయాలన కాపాడుకుందామనీ,ప్రోత్సాహాన్ని అందిద్దామనీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం.
గ్రామంలోని ప్రతి 🏠ఇంటికి బడితో బంధాన్ని ఏర్పర్చి వారి భాగస్వామ్యాన్ని పాఠశాలల్లో నెలకొల్పాలనే సదుద్దేశ్యంతో *ఇంటికి వంద - బడికి చందా* అనే మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.ఈ కార్యక్రమం విజయవంతం అగుటకు నర్వ గ్రామ పంచాయితి, తల్లితండ్రులు,ప్రజా ప్రతినిధులు, మరియు ప్రజలందరి సహకారాన్ని అభ్యర్థిస్తున్నాం.
🔸 అందుకై అందరం సమావేశమై గ్రామ విద్యాభివృద్ధి కమిటీని ఏర్పర్చుకొని ప్రాణమున్న విగ్రహాలను తయారు చేసి, సమాజానికి అందిస్తున్న ఈ దేవాలయాల(ప్రభుత్వ పాఠశాలల) అభివృద్ధికి మనమంతా పునరంకితం అవుదామనీ కోరుచున్నాం.
*తల్లిదండ్రుల తర్వాత జీవితానికి వెలుగులు ప్రసాదించిన బడి ఋణం తీర్చుకుందాం.*
🏂🏂 రండి.. కదలిరండి...
✊ నేడే ప్రతిన బూనుదాం ➖
*🚸 ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకుందాం...*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*తేది ఫిబ్రవరి10/02/2017*
⏰ఉదయం1⃣0⃣.0⃣0⃣
*⛳సభా వేదిక:-*
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం,నర్వ..
ఇట్లు
ప్రధానోపాద్యాయులు,
ఉపాధ్యాయులు, SMC చైర్మన్స్
MPPS and ZPHS నర్వ..
ఫోన్ నెంబర్ 9989357465
ఇమెయిల్ [email protected]