18/07/2026
షైనింగ్ స్టార్ అవార్డు – 2026
🌟 శ్రీ గాయత్రి గ్రామర్ స్కూల్‌కు మరో గర్వకారణం 🌟
ప్రియమైన తల్లిదండ్రులకు,
మా పాఠశాలకు మరో అపూర్వమైన గౌరవం లభించిన శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
పదవ తరగతి పరీక్షా ఫలితాలు 2025-26 లో ఉత్తీర్ణత సాధించిన ఉత్తమ ప్రతిభ చూపిన(షైనింగ్ స్టార్) విద్యార్థులకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తిస్తూ అందించే "షైనింగ్ స్టార్ అవార్డు – 2026" కు ప్రకాశం జిల్లాలోని ఎంపికైన 191 మంది ప్రతిభావంతులలో శ్రీ గాయత్రి గ్రామర్ స్కూల్, సమతా నగర్,ఒంగోలు కు చెందిన 10వ తరగతి విద్యార్థి A. నాగ జశ్వంత్ ఎంపిక కావడం మా పాఠశాల చరిత్రలో మరో స్వర్ణాక్షరంగా నిలిచింది. 🌟
🏆 ఈ ప్రతిష్టాత్మక అవార్డు ద్వారా విద్యార్థికి: 💰 రూ.20,000 నగదు బహుమతిని గౌరవ MLA మరియు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది.
🥇 షైనింగ్ స్టార్ మెడల్
📜 ప్రశంసా పత్రం
🎖️ ప్రభుత్వ స్థాయి ప్రత్యేక సత్కారం
ఈ ఘన విజయం విద్యార్థి కృషికి, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి, ఉపాధ్యాయుల అంకితభావానికి నిదర్శనం.
A. నాగ జశ్వంత్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారి తల్లిదండ్రులకు మరియు ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 💐
"ప్రతిభకు మా పాఠశాల వేదిక... విజయాలకు మా విద్యార్థులే చిరునామా."
ఇలాంటి విజయాలతో మా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మరిన్ని ఘనతలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
💐 అభినందనలతో 💐
శ్రీ గాయత్రి గ్రామర్ స్కూల్
సమతా నగర్, ఒంగోలు