MP UPS Jonnalaboguda

MP UPS Jonnalaboguda Our school has 1 to 8 classes. Our school strength is 170. It is located near peddakothapally mandal mahabubnagar dist

Jai Hanuman
13/03/2024

Jai Hanuman

13/03/2024

Must Read this article by Sri Yadagiri Shekar Rao Garu

తల్లిదండ్రులారా …
మీ శ్రద్ధా సక్తులే పిల్లలకి బాసట ...
1. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయ్యాక వారిని దగ్గర కూర్చోబెట్టుకుని వారి స్కూల్ డైరీలు పరిశీలించాలి. వారికీ ఏం హోం వర్క్ ఇచ్చారో గమనించాలి.

2. స్కూల్లో ఆ రోజు ఏ టీచర్ ఏం చెప్పారో కనుక్కోవాలి. వాళ్ళకి ఎదురైన ఇబ్బందుల గురించి తెలుసుకుని వివరించాలి.

3. పిల్లల చేత ఇంట్లో కూడా కాసేపు చదివించాలి. ఆ సమయాన అమ్మానాన్నలు కూడా వాళ్ళతో కూర్చుని తమకు నచ్చిన ఏదో ఒక పుస్తకం చదివితే బావుంటుంది. దీని వల్ల పిల్లలు కూడా ఆసక్తిగా చదువుతారు.

4. చిన్న చిన్న కథల పుస్తకాలు, దినపత్రికలు చదవడం నేర్పించాలి.

5. మంచిమాటలు చెప్పాలి. మనం వారి నుంచి ఏది కోరుకునట్టున్నామో వారికి తెలియజేయాలి. వారు చేసే పనులను మొదటే విమర్శించకూడదు. ముందుగా మెచ్చుకొని ఆ తర్వాత దానిలోని మంచి చెడులను విడమర్చి చెప్పాలి.

6. చిన్నప్పటి నుంచే వాళ్ళ బుక్స్, బట్టలు, వస్తువులు, ఎప్పటికప్పుడు నీట్ గా సర్దుకోవడం నేర్పించడం అవసరం.

7. పిల్లలను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్ళి చూపించడం, సమాజంలో నలుగురితో కలిసిపోయే తత్త్వాన్ని అలవరచడం అవసరం. అప్పుడే వారిలో ఆలోచనా శక్తి పెరుగుతుంది.

8. స్నేహితులతో కలసిపోయే తత్త్వాన్ని, పెద్దలతో మర్యాదగా మాట్లాడం పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి.

9. ఇలా చేశావేమిటని దండించటం కంటే ఏం చేయాలో ఏ విధంగా చేస్తే బాగుంటుందో వివరించాలి. అప్పుడు వారు తమ పొరపాట్లను, ప్రవర్తనలోని లోపాలని తెలుసుకుంటారు.

10. పిల్లలకు ఎప్పుడూ పోషకాహారం తగిన పాళ్ళలో అందించాలి. పాలు, పెరుగు సమృద్ధిగా ఇవ్వాలి. వివిద సీజన్ లలో లభీంచే అన్నిరకాల పళ్ళు పిల్లలకి మంచి బలవర్ధకమని మర్చిపోకూడదు. పిల్లల దేహ స్థితిని బట్టి ఆహార ప్రమాణాన్ని పెంచడం, తగ్గించడం చేయాలి. మాంసాహారం కన్నా శాఖాహారం ఎంతో మేలు.

11. దోమల బారిన పడకుండా దోమతెరలు వాడాలి . ఈగలు, క్రిములు ఇంట్లో తిరక్కుండా చూడాలి. ప్రమాదకర వస్తువులు, పదార్ధాలు పిల్లలకు అసలు అందుబాటులో వుంచకూడదు.

12. భయం, భాధ, దిగులు పిల్లల వికాసాన్ని బాగా దెబ్బతీస్తాయి. వారి వికాసంలో తప్పటడుగులకు కారణాలు అవుతాయి. అందువల్ల అమ్మానాన్నలు పిల్లలకు భయాన్ని నేర్పకూడదు.

13. తల్లిదండ్రులు రోజులో కనీసం ఒక్కసారైనా పిల్లలతో కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించాలి. దీని వల పెద్దలకు, పిల్లలకు మధ్య మంచి అవగాహనా పూరిత వాతావరణం ఏర్పడుతుంది.

14. పిల్లలు నివసించే గదిలో చల్లటి వతావరణాన్ని ఏర్పాటు చేయాలి. వారుండే గదుల్లో 40 వాట్స్ ట్యూబ్లైట్ ని బిగించాలి. దోమల నివారణకు కిటికీలకు వైర్ మెష్ లని బిగించి వుంచాలి. గదిలో మస్కిటో కాయిల్స్ ని వెలిగించరాదు.

15. మనసుకు ఆహ్లాదం కలిగించే పాటలు. సంగీతం అప్పుడప్పుడు వినిపించాలి. హింస, పగలతో కూడిన సినిమాలు, టీవి కార్యక్రమాలు చూడనివ్వకూడదు.

16. అందరు పిల్లలు ఒకేవిధంగా ఉండరు. ఎవరి తెలివితేటలు, వ్వక్తిత్వం వారిది. వేరేవారి పిల్లలతో పోల్చకూడదు. అలా చేస్తే పిల్లల్లో తమకు తెలివితేటలు లేవేమోననే భావన ఏర్పడే అవకాశం వుంది.

17. పిల్లలు చదువుకొనేటప్పుడు మద్యలో అంతరాయం కలిగించకూడదు. ఫోన్లు మోగినా, కాలింగ్ బెల్ మోగినా, ఎవరయినా వచ్చినా పిల్లలను చూడమని చెప్పకూడదు.

18. ఎప్పుడూ పుస్తకాల ముందు కూర్చోమని పిల్లల్ని ఒత్తిడి చేయకూడదు. అలా చేయడంవల్ల అనవసర టెన్షన్ తప్ప వారికి చదువు మీద శ్రద్దకలగదు. వేసుకున్న టైం టేబుల్ ప్రకారం చదవమని చెప్పాలి.

19. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం గోరువెచ్చటి నీటితో పిల్లలకు స్నానం చేయించాలి.

20. నిరంతరం చదువుల టెన్షన్ల లనుండి చక్కని ఉపశమనం, మెదడుకి కొత్త పదునునీ, ఉత్సాహాన్ని సమకూర్చే సాధనం గార్డెనింగ్ హాబీ. పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారి ఇంటిని కూడా పచ్చదనంతో కాలకళలాడేలా చేసుకునే శ్రద్ద, ఓపిక, ఆసక్తి, అవగాహన ఏర్పడుతుంది. పిల్లలలో సృజనాత్మకతని పెంచే ఈ హాబీల వల్ల, వారిలో చురుకుదనం పెరిగి మంచి అభివృద్ది సాధిస్తారు. కనుక ఇలాంటి హాబీని పిల్లలకి అలవాటు చేయాల్సిన బాద్యత పెద్దలదే.

21. ఏదైనా తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కుని రావడం, ఒకచోట కూర్చొని తినడం, ఎంత తినగలరో అంతే పెట్టించుకోవడం, ఎంగిలిచేసి పారేయకుండా వుండడం పిల్లలకు నేర్పాలి.

22. బూట్ల లోపల బొటనవేలు నిక్కుకొని వుండకూడదు. సాక్స్ కోద్దిగా పెద్దవిగానే వుండాలి. ఇన్ఫెక్షన్ రాకుండా నివారించేందుకు సాక్స్ ని ప్రతిరోజూ శుభ్రంగా వాష్ చేయాలి.

23. పిల్లలకు మంచి టిఫిన్ బాక్సు కొనండి. ప్రతిరోజూ ఆహార వైవిద్యం ఉండేలా చూడండి. పిల్లల ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువకాదు. టిఫిన్ బాక్సులను గోరువెచ్చని నీటితో కడిగి శుబ్రం చేయాలి.

24. పాప బాబు పుట్టినప్పటి నుంచి పెద్దగా అయ్యేవరకు వీరికి సంబంధించిన ప్రతి విషయాన్ని రికార్డు రూపంలో భద్రపరచండి. పిల్లలు పెద్ద అయ్యాక మీ పిల్లలుకానీ, మీరు కానీ వాటిని చూసుకొంటే బాల్యంలో వారు చేసీన చిలిపి చేష్టలు మధుర స్మృతులు మదిని మురిపిస్తాయి.

25. పిల్లల బర్త్ సర్టిఫికెట్లు నలిగిపోకుండా లామినేషన్ చేయించండి. జిరాక్స్ కాపీలు అందుబాటులో ఉంచుకోండి.

26. స్కూల్లో కట్టిన ఫీజు రశీదులు, ఎల్.కె.జి నుంచి వారి మార్కుల మేమోలు, ఇతర పొట్టీల్లో గెలుచుకున్న సర్టిఫికెట్లు, జ్ఞాపికలను , స్కూల్ డ్రెస్ తో తీయించిన వారి ఫోటోలు దాచండి.

27. ఎల్. కె.జి నుంచి ఐదవ తరగతి వరకు ఒక్కో పుస్తకాన్ని భద్రపరచడం పెద్దయ్యాక అవి చిన్ననాటి స్మృతులను గుర్తుకు తెస్తాయి.

28. పిల్లల చేతికి డబ్బులు ఇచ్చి చిన్న చిన్న వస్తువులు కొని తీసుకురమ్మని చెప్పాలి. ముఖ్యంగా మీ కాలనీలో లేదా మీ వీధిలో షాపుకు వెళ్ళి కావాల్సిన వస్తువుల్ని తీసుకురావడం అలవాటు చేయాలి. డబ్బులు జాగ్రత్తగా తీసుకెళ్ళి కావాల్సిన వస్తువులు తీసుకురావడమనేది ఇలా అలవాటవుతుంది.

29. మనం నిత్యజీవితంలో ఎన్ని రకాలుగా డబ్బులు చెల్లిస్తుంటామో కూడా పిల్లలకి తెలియాలి. పిల్లల ముందు డబ్బు విషయాలు దాచనక్కర్లేదు. మనం పొందె వస్తుసేవలకు చేసే చెల్లింపులు తెలియడం అవసరం. ఈ విధంగా చెల్లింపులు చేస్తుంటామో వారు తెలుసుకుంటారు. ఈ క్రమంలో వీటి వాడకంలో జాగ్రత్తగా ఉండటమెలానో గ్రహిస్తారు.

30. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల గురించి పిల్లల ముందు మాట్లాడుకోవటం తప్పు కాదు. వాటి వినియోగం ఎలానో తెలుసుకుంటారు. వాటి అవసరాన్ని గుర్తిస్తారు. ఏదైనా రెస్టారెంట్లో డిన్నర్ తర్వాత బిల్లు చెల్లింపు కోసం క్రెడిట్ కార్డు ఉపయోగించేటప్పుడు పిల్లలతో దాని ఉపయోగాన్ని గురించి మాట్లాడండి. దీనివల్ల వారికి క్రెడిట్ కార్డులపై అవగాహన ఏర్పడుతుంది.

31. నీటికుంటల్లో మునిగిపోవడం ఇళ్ళలో వేడినీళ్ళు, పాలు తగిలి గాయాలవడం, గింజలు, విత్తనాలు మింగేయడం, అయిల్స్ వంటి ద్రావకాలు తాగేయడం వంటివి ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. కాబట్టి జాగ్రత్త.

32. 19 ఏళ్ళలోపు పిల్లల వరకు ద్విచక్ర వాహనాల పైన అవగాహన వున్నప్పటికీ పిల్లల శ్రేయస్సు దృష్ట్యా తల్లిదండ్రులు ప్రొత్సహించకుండా వుండాలి.

33. మీరంటే మీ యింట్లో ఒక నమ్మకాన్ని సృష్టించుకోవాలి. మీకు బయట ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ఇంట్లో ప్రదర్శించకూడదు. కష్టసమయంలో కూడా మీరు మీ పిల్లలతో నిజాయితిగా వ్యవహరిస్తే మీరంటే ఎనలేని గురి, నమ్మకం, విశ్వాసం, అభిమానం కలుగుతాయి. పొరపాటున ఏ సందర్భంలో అయినా తప్పుగా వ్యవహారించ వలసివస్తే దాన్ని వెంటనే గుర్తుంచి సిగ్గుపడకుండా పిల్లల్ని క్షమాపణ అడిగితే వారికి మీ మీద మరింత అభిమానం పెరుగుతుంధి. మిమ్మల్ని వారు మార్గ దర్శకులుగా తీసుకుంటారు.

34. డైనింగ్ టేబల్ చివరిగా వేడివేడి పదార్దాలు, గాజుగ్లాసులు, ప్లేట్లు పెట్టకండి పిల్లలు వాటిని పొరపాటున పట్టుకుంటే ఎంతో బాధకి లోనవుతారని గుర్తుపెట్టుకోండి.

35. కొందరు టేబుల్ ఫ్యాన్లు, కిందపెడుతారు. వాటిని ఆన్లో ఉంచినప్పుడు పిల్లలు దగ్గరకు రాకుండా చూసుకోవాలి. వాటర్ హీటర్లు, ఐరన్ బాక్సులు వాడే వారు మరింత అప్రమత్తంగా ఉండాలి.

36. పిల్లల్ని ఎక్కువగా తిట్టడం, కొట్టడం చేస్తే పిల్లలు మొద్దుబారిపోతారు. తిట్టడానికి బదులు ఒక పద్దతి ప్రకారం అది తప్పు అని చెప్పండి. పిల్లల మనోభావాలకి ప్రధాన్యమివ్వండి. వాళ్ళల్లో ఉన్నత వ్యక్తిత్యం రూపొందడానికి ప్రయత్నించండి.

37. పిల్లలకి ఏది ఎంత వరకు ఇష్టమో అంతవరకే తినిపించాలి. వాటిని బలవంతంగా తినిపించకూడదు. వారి స్థితిని గమనించి వ్యవహరించాలి.

38. పిల్లలు బస్సు దిగేటప్పుడు పెద్దలు స్కూలు బస్సు ఆగే వైపే నిలబడాలి. బస్సు దిగిన పెద్దలను చూడగానే ఉత్సాహంతో పరుగు పెడతారు. రోడ్డుమీద వచ్చే వాహనాలను గమనించరు. కబట్టి బస్సు ఆగే వైపు నించోవాలి. స్కూలు బస్ వచ్చే సమయానికి ముందే వచ్చివుండటం మంచిది.

39. విద్యా సంవత్సరం ప్రారంబంలోనే వాళ్ళ స్కూల్ ఫీజులు చెల్లించి నిరంతరం పిల్లల ప్రగతిని పర్యవేక్షించండి. పేరెంట్-టీచర్ సమావేశాలకు హాజరు అయితే మీకు మీ పిల్లలకు చాలా మంచిది.

40. పిల్లలే మా ప్రపంచం అంటారు గానీ వాళ్ళ ప్రపంచంలో పేరెంట్స్ ఉండటం లేదు. పిల్లల పెంపకం మామూలు వ్యవహారం కాదు, ఎంతో శ్రద్ద వహిస్తేనే పిల్లలు వృద్ది లోకి వస్తారు. ఈ విషయంలో ఉపయుక్తకరమైన పుస్తకాలు చదవడం నిష్ణాతులైన వారి సలహాలు తీసుకోవడం మంచిది.

యాదగిరి శేఖర్ రావు
ట్రస్మా రాష్ట్ర ప్రధాన సలహాదారు

12/03/2024

*పదవ తరగతి గణితంలో విద్యార్థులు అధ్యాయం వారీగా ముఖ్యంగా దృష్టి పెట్టాల్సినవి:*

1. *వాస్తవ సంఖ్యలు:* ఇచ్చిన సంఖ్యను కరణీయ సంఖ్య అని నిరూపించండి.

2. *సమితులు:* వెన్ చిత్రం ద్వారా ఇచ్చిన దాన్ని సరిచూడండి/నిరూపించండి.

3. *బహుపదులు:* బహుపది విలువ మరియు శూన్య విలువలు కనుగొనే లెక్కలు; ముఖ్యంగా ఇచ్చిన బహుపది కి రేఖాచిత్రం (గ్రాఫ్) గీయండి, శూన్యాలు కనుగొనండి.

4. *రెండు చర రాశులలో రేఖీయసమీకరణాల జత:* నియమాలు ఆధారంగా p లేదా m లేదా k విలువ కనుగొనే లెక్కలు. ముఖ్యంగా ఇచ్చిన సమీకరణాలను గ్రాఫ్ ద్వారా సాధించుము.

5. *వర్గం సమీకరణాలు:* ఇచ్చిన వర్గసమీకరణం యొక్క మూలాల స్వభావం కనుగొనండి మరియు మూలాలు సమానం అయితే k విలువ కనుగొనండి లెక్కలు.

6. *శ్రేడులు:* అంకె శ్రేఢి/గుణ శ్రేఢి సూత్రాలు, ముఖ్యంగా అంకశ్రేఢి లోని nవ పదం మరియు మొదటి n పదాల మొత్తం కనుగొనే సూత్రం ఆధారంగా చేసే లెక్కలు.

7. *నిరూపక రేఖా గణితం:* సులభమైన అధ్యాయం, అన్ని భావనలు/సూత్రాల పై లెక్కలు; ముఖ్యంగా 4 బిందువులు ఇస్తే అది ఏ రకమైన చతుర్భుజం అవుతుంది, త్రిధాకరణ బిందువులు కనుగొనుట, సరేఖియాలు అయితే k విలువ కనుగొనండి లాంటి లెక్కలు.

8. *సరూప త్రిభుజాలు:* ప్రాథమిక అనుపాత సిద్దాంతం పై అనువర్తన లెక్కలు; ముఖ్యంగా ఇచ్చిన కొలతలతో త్రిభుజం గీసి దానికి సరూప త్రిభుజం నిర్మించండి (క్రమ & అపక్రమ భిన్నం ఇచ్చినపుడు).

9. *వృత్తానికి స్పర్శ రేఖలు మరియు ఛేదన రేఖలు:* స్పర్శ రేఖ పొడవును కనుగొనుము, ముఖ్యంగా ఇచ్చిన కొలతలతో స్పర్శ రేఖలు నిర్మించండి.

10. *క్షేత్రమితి:* స్థూపం, శంఖువు, గోళం, అర్దగోళం ల వైశాల్యాలు/ఘనపరిమాణం సూత్రాలు, సూత్రం ఆధారంగా వాటిపై లెక్కలు.

11. *త్రికోణమితి:* త్రికోణమితి నిష్పత్తుల విలువల ఆధారంగా చేసే లెక్కలు, ముఖ్యంగా టెక్స్ట్ బుక్ లోని చివరి అభ్యాసం లోని నిరూపించుము‌/చూపండి అనే లెక్కలు మరియు వీటిని పోలిన ఇతర మాదిరి ప్రశ్నలు.

12. *త్రికోణమితి అనువర్తనాలు:* ఇచ్చిన దత్తాంశం/ సమాచారానికి తగిన పటం గీయండి.

13. *సంభావ్యత:* సులభమైన అధ్యాయం, అన్ని రకాల లెక్కలు అనగా సంభావ్యత సూత్రం ఆధారంగా సాధారణ లెక్కలు నెంబర్ కార్డులు, రంగు రంగుల బంతులు; నాణెం,పాచికలు, పేక ముక్కల కు సంబంధించిన లెక్కలు.

14. *సాంఖ్యకశాస్రం:* సులభమైన అధ్యాయం, అవర్గీకృత దత్తాంశం నకు సగటు, మధ్యగతం మరియు బాహుళకం కనుగొనండి, వర్గీకృత దత్తాంశానికి సగటు/బాహుళకం/మధ్యగతం కనుగొనుటకు సూత్రం రాసి అందులోని అక్షరాలను వివరించండి; ముఖ్యంగా ఇచ్చిన వర్గీకృత దత్తాంశానికి(పట్టికకు) మధ్యగతం మరియు బాహుళకం కనుగొనండి, ఓజివ్ వక్రం(లు) గీయండి.

THE BEST👍👍

శ్రావణ పూర్ణిమ శ్రావణ పూర్ణిమ అంటే "రక్ష" కట్టుకోవడం ఒకటే కాదు...దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన        భగవంతుని "విద...
30/08/2023

శ్రావణ పూర్ణిమ

శ్రావణ పూర్ణిమ అంటే "రక్ష" కట్టుకోవడం ఒకటే కాదు...దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని "విద్యాప్రదమైన""హయగ్రీవ" అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే.
అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం.

మనిషికి ప్రధానమైనది జ్ఞానం...జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు...శాస్త్రాలకు మూలం వేదం.

ఆ వేదాన్ని లోకానికి అందించిన అవతారం "హయగ్రీవ" అవతారం.
జ్ఞానం చెప్పే భగవంతునికి చెందిన వాటంతటికి రక్ష. ఆ కంకణ ధారణ అనేదే రక్షబంధనం అయ్యింది.

వేదం చదువుకునే వారందరూ శ్రావణ పూర్ణిమ నాడు ఆరంభంచేసి నాలుగు నెలలు వేదాధ్యయనం చేస్తారు.
ఆతరువాత వేద అంగములైన శిక్షా , వ్యాకరణం , నిరుక్తం , కల్పకం , చందస్సు మరియూ జ్యోతిష్యం అనే షడంగములను అధ్యయనం చేస్తారు.

భగవంతునికి లోకంపై ఉండే కరుణ చేత నామ రూపాలు లేని ఈ జీవరాశికి ఒక నామ రూపాన్ని ఇవ్వడానికి చతుర్ముఖ "బ్రహ్మ"కు ఆయనకు వేదాన్ని ఉపదేశం చేసాడు.
అయితే వేదం అనేది జ్ఞానం....
అది అప్పుడప్పుడు అహంకారాన్ని తెచ్చి పెడుతుంది , అహంకారం ఏర్పడి ఉన్న జ్ఞానాన్ని పోయేట్టు చేస్తుంది.

బ్రహ్మగారికి అట్లా ఇంత చేస్తున్న అనే అహంకారం ఏర్పడి వేదాన్ని కోల్పోయాడు ఎన్నో సార్లు. భగవంతుడు తిరిగి ఒక్కో రూపాన్ని ధరించి ఇస్తూ ఉండేవాడు.
మశ్చావతారం , హంసావతారం ఇలా ఆయన వేదాన్ని ఇవ్వడానికి వచ్చిన అవతారాలే.
చాలా సార్లు ఇచ్చినా కోల్పోయాడు...
శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ రూపంలో. ఉపదేశం చేసి చూసాడు. అప్పుడు బ్రహ్మ వేదాన్ని కోల్పోలేదు.
మన శాస్త్రాలు అంటే ఎంతో కాలంగా ఆచరించి పొందిన అనుభవాల సారాలు. అందుకే
"ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః"
చాలా కాలంగా చేసిన ఆచారములే ధర్మములు, అవి మనల్ని రక్షించేవి కనుక.... వాటిని చెప్పేవి "శాస్త్రాలు" అయ్యాయి.
శాస్త్రాలను బట్టి ఆచారాలు రాలేదు.

బ్రహ్మ కాంచీపురంలోని వరదరాజ స్వామి సన్నిదానంలో చేసిన హోమం నుండి....
శ్రావణ పూర్ణిమనాడు భగంతుడు "గుఱ్ఱపుమెడ" కలిగిన ఆకృతిలో వచ్చి...గుఱ్ఱం యొక్క "సకిలింత" ద్వని మాదిరిగా వేదాన్ని వేదరాశిని ఉపదేశం చేసాడు.

🙏 హయగ్రీవ సంపాద స్తోత్రం 🙏
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం
నరం ముచ్చంతి పాపాని దరిద్ర్యమివ యోషితః!!

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్!!

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః
విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః!!

శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం
వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం!!

Our School Logo
18/03/2023

Our School Logo

Maths magic on maths day
18/03/2023

Maths magic on maths day

ఉగాది
18/03/2023

ఉగాది

 #నా_మాతృభాష_అమృత_తుల్యమైనదిఅ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఌా ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుత...
18/03/2023

#నా_మాతృభాష_అమృత_తుల్యమైనది

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఌా ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:
ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.

క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం
చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం
ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం
త థ ద ధ న……నాలుక కొస భాగం
ప ఫ బ భ మ……..పెదవులకు
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా
ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.
సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.
తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.
మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేరు. తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చూడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.
తెలుగులో మాట్లాడండి. .
తెలుగులో వ్రాయండి. . .
తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..
తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి . . .

14/09/2022

WISH U A HAPPY HINDI DIVAS
*హిందీ దివస్ చరిత్ర ఏంటి..?*

హిందీ దివస్ ఏటా 14 సెప్టెంబర్‌న దేశం ఘనంగా జరుపుకుంటుంది. ఈ రోజునే దేవనగిరి లిపి నుంచి తీసుకుని భారత అధికారిక భాషగా హిందీని గుర్తించడం జరిగింది. భారత అధికారిక భాషగా హిందీని గుర్తించడంలో ఎనలేని కృషి చేసిన బియోహార్ రాజేంద్ర సింహ పుట్టిన రోజు కూడా సెప్టెంబర్ 14న కావడం విశేషం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం దేశంలోని గుర్తించబడ్డ 22 భాషల్లో హిందీని అధికారిక భాషగా గుర్తించడం జరిగింది. హిందీ భాషను ఈ రోజున గౌరవించుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా పలు సంస్కృతులకు చెందిన పండగలను కూడా ఈ రోజు పాటిస్తారు. హిందీ సాహిత్యాన్ని ఒక వేడుకలా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 14వ తేదీన రాజ్‌భాష కీర్తి పురస్కార్, రాజ్‌భాష గౌరవ్ పురస్కార్‌ అవార్డులను హిందీ భాష కోసం విశేష కృషిని చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు ప్రదానం చేస్తారు.

*హిందీ పదాన్ని తొలుత ఎవరు* *వాడారు*

హిందీ భాషను అధికారిక భాషగా గుర్తించడంలో చాలామంది కవులు రచయితలు కృషి చేశారు. వీరిలో బియోహర్ రాజేంద్ర సింహ, మైథిలి శరణ్, హజారీ ప్రసాద్ ద్వివేది, కాకా కాలేల్కర్, సేత్ గోవింద్ దాస్‌లాంటి ప్రముఖులు ఉన్నారు. హిందీ అనేది ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. పర్షియన్ పదం హింద్ నుంచి హిందీ అనే పదం తీసుకోవడం జరిగింది. 11వ శతాబ్దంలో టర్కీ పాలకులు దేశంపై దండయాత్రకు వచ్చిన సమయంలో హిందీ అనే పదాన్ని వినియోగించారు. అంటే ఇండస్ నది ప్రవహించే నేల అని అర్థం.

*జాతీయ అంతర్జాతీయ హిందీ* *దివస్‌ మధ్య తేడా..*

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 భాషలు, 270 మాతృ భాషలు ఉన్నాయి. దేశ జనాభాలో 43.63 శాతం మంది హిందీ మాట్లాడతున్నారు. అంటే 52 కోట్లకు పైగా ప్రజలు హిందీ మాట్లాడుతారని తెలుస్తోంది. జాతీయ హిందీ దినోత్సవం‌కు అంతర్జాతీయ హిందీ దినోత్సవంకు కొంత తేడా ఉంది. ఈ రెండిటి ఉద్దేశం లేదా లక్ష్యం హిందీని ప్రమోట్ చేయడమే అయినప్పటికీ... రెండిటి చరిత్ర విశిష్టత వేర్వేరుగా ఉంది. జాతీయ హిందీ దినోత్సవం (హిందీ దివస్) సెప్టెంబర్ 14వ తేదీన భారత్‌లో జరుపుకుంటాం. ఇదే రోజున హిందీని భారత అధికారిక భాషగా గుర్తించడం జరిగింది. అంతర్జాతీయ హిందీ దినోత్సవంను జనవరి 10వ తేదీన జరుపుకుంటాం. 1975లో నాగ్‌పూర్‌లో జనవరి 10వ తేదీన తొలి అంతర్జాతీయ హిందీ సమావేశం జరిగింది. ఇందుకు గుర్తుగా అంతర్జాతీయ హిందీ దినోత్సవంను జరుపుకుంటున్నాం.

హిందీ దివస్ సందర్బంగా** *హిందీ* *భాషాపాధ్యాయులందరికి* *హృదయపూర్వక అభినందనలు💐*

12/09/2022
11/09/2022

బుద్ది హీనుడు ఎవరు

పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతను అప్పుడప్పుడూ రకరకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇస్తూ ఉండేవాడు. ఒకసారి రాజుగారికి బుద్ధిహీనుల పోటీ నిర్వహించాలనే ఓ వింత ఆలోచన వచ్చింది. వెంటనే ‘ఫలానా రోజు ఫలానా సమయాన ఫలానా ప్రదేశంలో బుద్ధిహీనుల పోటీ నిర్వహించబడుతుంది. ఉత్తమ బుద్ధిహీనుడికి విలువైన బహుమతి ప్రదానం చేయబడుతుంది’ అని ప్రకటన జారీచేయించాడు.

ఆ రోజు రానే వచ్చింది. రాజ్యంలోని బుద్ధిహీనులందరూ పోటీలో పాల్గొన్నారు. అందరూ తమ తమ ప్రావీణ్యాన్ని, కళను ప్రదర్శించారు. వారిలో ఓ వ్యక్తి తన బుద్ధిహీనతను అత్యుత్తమంగా ప్రదర్శించి విజేతగా నిలిచాడు.
రాజుగారు విజేతగా నిలిచిన ఆ వ్యక్తిని ప్రశంసిస్తూ, తన మెడలో ఉన్న విలువైన హారాన్ని అతని మెడలో వేసి సత్కరించాడు. సభముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. ఇది జరిగిన కొద్దిరోజులకే రాజుగారికి సుస్తీ చేసింది. అందరూ వెళ్ళి రాజుగారిని పరామర్శించి వస్తున్నారు.

ఒకరోజు బుద్ధిహీనుడు కూడా రాజు గారిని చూడడానికి వెళ్ళాడు. ‘‘రాజుగారూ.. ఏమిటీ పరిస్థితి.. ఇలా అయిపోయారు.. ఎలా ఉంది ఆరోగ్యం..’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. రాజు ఓపికగా ‘‘నా ఆరోగ్యం క్షీణించింది. బహుశా ఇక నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉండకపోవచ్చు’’ అన్నాడు.
‘‘అవునా.. వేరే చోటికి వెళుతున్నారా?’’ సంభ్రమంగా ప్రశ్నించాడు బుద్ధిహీనుడు.
‘‘అవును.. అంటే.. ఈ ప్రపంచం వదిలేసి మరోప్రపంచానికి ప్రస్థానం..’’ అన్నాడు రాజు వేదాంత ధోరణిలో..
‘‘అవునా.. వేరే చోటికి వెళుతున్నారా? రాజుగారూ.. మీదగ్గర చాలా సంపద ఉందిగదా.. అదంతా అక్కడికి కూడా పంపించారా?’’ అడిగాడు బుద్ధిహీనుడు.
‘‘లేదు.. పంపలేదు..’’
‘‘ఇక్కడ ఇంత పెద్ద అద్భుతమైన భవనంలో ఉంటున్నారు కదా.. మరి అక్కడ కూడా పెద్ద భవంతి కట్టించారా?’’
‘‘లేదు.. అక్కడ పూరి గుడిసె కూడా నిర్మించలేదు’’
‘‘ఇక్కడ మీకింతమంది సేవకులు, నౌకర్లు, రకరకాల సేవలు చేసేదాస దాసీలు ఉన్నారు కదా.. అక్కడ కూడా వీళ్ళంతా ఉన్నారా.. అక్కడ మీకెవరు సేవలు అందిస్తారు?’ ప్రశ్నించాడు బుద్ధిహీనుడు.

రాజుకి బుద్ధిహీనుడి మాటల్లోని మర్మం అంతుచిక్కడం లేదు.. కాని బుద్ధి హీనుడి మాటల్లో ఎక్కడో జ్ఞానోదయ బోధ ఉన్నట్లు అనిపించ సాగింది.. అప్రయత్నంగానే ‘‘అక్కడ ఎవరూ నౌకర్లు లేరు. సేవకులు లేరు.. అక్కడికేమీ పంపలేదు కూడా..’ అన్నాడు.

‘‘మహారాజా.. ఇక్కడ మీరు సమస్త సంపదనూ సంపాదించుకున్నారు. సకల భోగభాగ్యాలూ, సమస్త విలాసాలూ అనుభవించారు. మరి అక్కడికి ఏమీ పంపుకోకుండానే వెళ్ళిపోతే అక్కడి పరిస్థితి ఏమిటి? ఆ జీవితం ఎలా గడుస్తుంది? బుద్ధిమంతులెవరైనా రేపటికోసం ఆలోచిస్తారు గదా! బుద్ధిహీనుడు ఎవరో ఇప్పుడు మీరే తేల్చుకోండి’’ అంటూ తన మెడలోని ఆ విలువైన హారాన్ని తీసి రాజు గారి మెడలో వేసి అక్కడినుండి బిరబిరా వెళ్ళిపోయాడు బుద్ధిహీనుడు.

రాజుగారు ఆలోచనలో పడిపోయారు.
అవును... ఈ ప్రపంచమే శాశ్వతమని, ఈ జీవితమే సర్వస్వమని రేపటి భవిష్యత్తును, రేపటి జీవితాన్ని పట్టించుకోకుండా ప్రాపంచిక వ్యామోహంలో మునిగి పోవడమే నిజమైన బుద్ధిహీనత అని తెలుసుకున్నాడు.

Address

Jonnalaboguda
Nagarkurnool
509412

Telephone

+919553093804

Website

Alerts

Be the first to know and let us send you an email when MP UPS Jonnalaboguda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to MP UPS Jonnalaboguda:

Shortcuts

Share

Category