Kotha Ramanujam MSc,B.Ed,AP-TS SET

  • Home
  • Kotha Ramanujam MSc,B.Ed,AP-TS SET

Kotha Ramanujam      MSc,B.Ed,AP-TS SET i am a MATHS teacher..

కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి నా "కొత్త" బంగారు లోకం ఛానెల్ లో చేరండి.https://whatsapp.com/channel/0029Vb5ZaCI2ZjC...
08/04/2025

కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి నా "కొత్త" బంగారు లోకం ఛానెల్ లో చేరండి.
https://whatsapp.com/channel/0029Vb5ZaCI2ZjCsWnCyYH3L

04/08/2023

హర్ట్ టచింగ్ వీడియో..

భారం మోసే రాయి:-స్త్రీలు ప్రసవించే సమయంలో వారిని ఎద్దుల బండిలో రెండు కిమీ దూరంపయనించేవారు.తర్వాత కొందరు సుఖంప్రసవం అయ్యే...
10/06/2023

భారం మోసే రాయి:-

స్త్రీలు ప్రసవించే సమయంలో
వారిని ఎద్దుల బండిలో రెండు కిమీ దూరం
పయనించేవారు.తర్వాత కొందరు సుఖంప్రసవం అయ్యేది,
కొందరు మార్గమధ్యంలో కొంత మంది చనిపోయేవారు.
అలా చనిపోయిన వారి జ్ఞాపకార్థం రోడ్డు పక్కన ఉంచిన ఈ రాయిని "అన్ బర్డెన్ స్టోన్" అంటారు.

ఇంత ఎత్తు ఎందుకు?

అప్పట్లో పక్క ఊరి నుంచి ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుక్కొని వచ్చే సమయంలో అలసిపోయి,కింద పడేసి పైకి లేపడానికి చుట్టుపక్కల ఎవరూ ఉండరు.కనుక ఆ సమయంలో ,ఈ రాయిపై లోడ్ దించుకుని ,ఎవరి సాయం లేకుండా తిరిగి తలపైకి ఎత్తుకుని పోవడానికి వీలుగా ఎత్తులో పెట్టారు..

తర్వాత వ్యవసాయ ధాన్యాలు
కూరగాయలు మూటలు ఈ రాతిపై పెట్టి, తర్వాత ఎద్దుల బండిలో ,
తర్వాతి కాలంలో బస్సులలో టెంపోలలో దీని సహాయంతో
ప్రయాణం సాగించేవారు

అందుకే దీన్ని "భార బిందువు రాయి" అని పిలిచారు.

ఈ రోజుల్లో రోడ్డు పక్కన చూడటం అరుదు.

ప్రసవ వేదన తో చనిపోయిన గర్భిణీ స్త్రీ స్మృతి చిహ్నమైనా ఈ రాయి అందరికీ ఉపయోగపడేంత అద్భుతం ఆనాటి సంస్కృతి! 🙏
మీ ఊరులో ఇప్పటికి ఉంటే కామెంట్ చెయ్యండి..

(నాకు ఎక్కడో కనిపించిన సమాచారం ను అక్షర దోషాలు సరిచేసి పోస్ట్ చేస్తున్నాను.
ఇక్కడ చెప్పిన కథనం నిజమా ? కాదా ? అనేది చరిత్ర కి ఎరుక )

*రవీంద్రనాథ్ ఠాగూర్**అద్భుతమైన కవిత*🌷🌷🌷🌷🌷🌷🌷🌷‼️"నేనిక లేనని తెలిశాక  విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు..కానీ  మిత్రమా! అ...
11/09/2022

*రవీంద్రనాథ్ ఠాగూర్*
*అద్భుతమైన కవిత*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷

‼️"నేనిక లేనని తెలిశాక విషాదాశ్రులను
వర్షిస్తాయి నీ కళ్ళు..
కానీ మిత్రమా! అదంతా నా కంట పడదు!
ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా!

‼️నీవు పంపించే పుష్పగుచ్ఛాలను
నా పార్ధివదేహం
ఎలా చూడగలదు?
అందుకే... అవేవో ఇప్పుడే పంప రాదా!

‼️నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావ్ అప్పుడు
కానీ అవి నా చెవిన పడవు..
అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో !

‼️నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు !
కానీ నాకా సంగతి తెలీదు..
అదేదో ఇపుడే క్షమించేయలేవా?!

‼️నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది
కానీ అది నాకెలా తెలుస్తుంది?
అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !

‼️నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది
అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా!

‼️సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్.. నా మరణ వార్త విన్నాక!
సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?

ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకుతాను, కాసేపైనా గడుపుతాను, హాయిగా నీతో మెలుగుతాను!"
🌷

*ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం! కష్టసుఖాలు పంచుకొందాం! ఒకరికొకరమై మెలుగుదాం! ఉన్నన్నాళ్ళూ కలిసిమెలసి బతుకుదాం!!*

*ఈరోజు కలిసిన, మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో? మాట్లాడతాడో లేదో?*

*ఏది శాశ్వతం?*
*ఎవరు నిశ్చలం?*
🌷

Birthday special photo..
12/08/2022

Birthday special photo..

ఒక టీచర్ బోర్డు మీద 5 యొక్క టేబుల్ వ్రాస్తున్నారు: 5X1 = 3 5X2 = 10 5X3 = 15 5X4 = 20 5X5 = 25 5X6 = 30 5X7 = 35 5X8 = 4...
03/10/2021

ఒక టీచర్ బోర్డు మీద 5 యొక్క టేబుల్ వ్రాస్తున్నారు:
5X1 = 3
5X2 = 10
5X3 = 15
5X4 = 20
5X5 = 25
5X6 = 30
5X7 = 35
5X8 = 40
5X9 = 45
5X10 = 50
వ్రాసిన తరువాత ఆమె విద్యార్థుల వైపు తిరిగింది మరియు ప్రతి ఒక్కరూ తనను చూసి నవ్వుతున్నట్లు గుర్తించారు. నవ్వడానికి కారణం అడిగినప్పుడు, ఇద్దరు విద్యార్థులు లేచి ఇలా చెప్పారు:
మేడమ్- టేబుల్ మొదటి లైన్ తప్పు ... ఇది 5 అయి ఉండాలి ..

ఇది విన్న టీచర్ (నవ్వుతూ) వివరించారు
"నేను మొదటి పంక్తిని ఉద్దేశపూర్వకంగా తప్పుగా వ్రాసాను, ఎందుకంటే మీరు ముఖ్యమైన విషయం నేర్చుకోవాలని నేను కోరుకున్నాను. వాస్తవ ప్రపంచం మిమ్మల్ని ఎలా పరిగణిస్తుందో తెలుసుకోవడానికి ఇది మీ కోసం.
***నేను 9 సరియైన పంక్తులు వ్రాసాను కానీ ఎవరూ నన్ను అభినందించలేదు.కానీ ఒక తప్పు మరియు ప్రతి ఒక్కరూ దానిని చూపారు***

#సూక్తి:
మీరు చేసే బిలియన్ సరైన పనులను ప్రపంచం ఎన్నటికీ మెచ్చుకోదు కానీ ఒక తప్పు చేసినందుకు విమర్శిస్తుంది. కాబట్టి, ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే ఎప్పుడూ నిరుత్సాహపడకండి. దాన్ని సానుకూలంగా తీసుకోండి మరియు అన్ని విమర్శల కంటే పైకి ఎదగండి.

today నా birth day సందర్భంగా నా జీవిత  చరిత్ర (సింపుల్ గా )*ఇప్పటివరకు నా జీవితంలొ  2దశలు* 1_class 8th కి ముందు (వినగలను...
12/08/2021

today నా birth day సందర్భంగా నా జీవిత చరిత్ర (సింపుల్ గా )

*ఇప్పటివరకు నా జీవితంలొ 2దశలు*
1_class 8th కి ముందు
(వినగలను )
2_class 8th తర్వాత
(వినలేను )

🙌class 8th ముందు🙌
(ఈ దశ లొ 2భాగాలు ఉన్నాయి)
👉5th class కీ ముందు
(ఈ జీవితం మొత్తం ఆటలతో ఆనందంగా గడిపాను)

👉5th class తర్వాత
(అమ్మ నాన్న లకి దూరం గా గడిచిపోయింది )
👂👂8th తర్వాత👂👂
(ఈ దశ లొ 5భాగాలు ఉన్నాయి )
👉ఇంటర్ 1year ముందు
(అమ్మ నాన్నలకి దూరం గా కొన్నాళ్ళు ,గొర్రెలు కాపరి ,సిమెంట్ పని ,బత్తాయి పని చేసా )
👉ఇంటర్ 1year తర్వాత
(దశ మారిపోయింది,success కోసం శ్రమించా.PG దాక వెనక్కి తిరుగకుండా వెళ్ళా )
👉PG తర్వాత
(VRO job సమస్య వల్ల హక్కు కోసం ప్రశ్నించే స్వభావం,పోరాటపటిమ నేర్చుకున్నా )
👉TGT JOB తర్వాత
(ఆర్దికంగా బానే ఉన్నా..TGT ,PGT success అయ్యా..కానీ group 2 ,TRT నిరాశ పరిచాయి)
👉పెళ్ళి తర్వాత
(ఇప్పుడు నడుస్తున్నా చరిత్ర ఇదే.ఇందులో ఉపభాగాలు ఉంటాయ్ ఇగ 😂)👇
next తండ్రిగా soon

🙏🙏🙏🙏🙏🙏

13/04/2021
20/11/2020

తల్లి ప్రేమ ఎలాంటిదో చూడండి

*జీవితంలో మంచి సత్ఫలితాలు సాధించి విజయాన్ని అందుకోవడానికి ఒక సీక్రెట్*ఒక టీచర్ గారు క్లాసులో పిల్లలందరికీ ఒక టోఫీ (చాక్ల...
22/10/2020

*జీవితంలో మంచి సత్ఫలితాలు సాధించి విజయాన్ని అందుకోవడానికి ఒక సీక్రెట్*

ఒక టీచర్ గారు క్లాసులో పిల్లలందరికీ ఒక టోఫీ (చాక్లెట్) ఇచ్చి పిల్లలతో" పిల్లలూ! మీరు ఎవరు ఈ టోఫీని 10 నిమిషముల వరకు తినకండి" అని చెప్పి అతను క్లాసు బయటకు వెళ్ళిపోయాడు.
కొద్ది సమయం వరకు క్లాసు అంతా నిశ్శబ్దంగా ఉంది..ప్రతి విద్యార్థి తన ఎదురుగా ఉన్న టోఫీని చూస్తున్నారు .సమయం గడిచేకొద్దీ దాన్ని తినకుండా ఉండగలగటం వాళ్లకు చాలా కష్టంగా అనిపించింది.
పదినిమిషాల తర్వాత టీచరు క్లాస్ లోకి వచ్చారు.. క్లాసులో కేవలం ఏడుగురు మాత్రం టో ఫీని తినలేదు. మిగిలిన అందరూ టోఫీ నీ తింటూ వాటి రుచి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ టీచరు రహస్యంగా ఏడుగురి పేర్లు తన డైరీలో రాసుకున్నారు.

ఆ టీచర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాల్టర్ మైకేల్. కొన్ని సంవత్సరముల తర్వాత అతను డైరీలో రాసుకున్న ఏడుగురి పేర్లు చూసి వారు గడుపుతున్న జీవితం గురించి పరిశోధన చేశాడు .అతను గ్రహించిన దేమిటంటే ఆ ఏడుగురు వారి వారి జీవితాల్లో ఎంతో గొప్ప గొప్ప విజయాలను సాధించి వారు ఎన్నుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు.
ప్రొఫెసర్ వాల్టర్ మిగిలిన వారి జీవితాలను కూడా పరిశోధించాడు.
వారిలో చాలా మంది సాధారణ జీవితాలను మాత్రమే.
గడుపుతున్నారు. మిగిలిన కొంత మంది ఆర్థికంగా వెనుకబడి పోయి వారి జీవితాలలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న ట్లుగా గ్రహించాడు.
ఈ పరిశోధన ఫలితాన్ని ప్రొఫెసర్ వాల్టర్ ఒక్క వాక్యంలో ఇలా చెప్పాడు.
*ఎవరైతే ఒక్క పది నిముషాలు సహనంగా ,నిగ్రహంగా ఉండలేరో వారి జీవితంలో ఎదురయ్యే కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొని విజయాన్ని సాధించలేరు*
ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ సిద్ధాంతాన్ని Marshmello Theory అంటారు. దీనికి ఈ పేరు రావటానికి గల కారణం ప్రొఫెసర్ వాల్టర్ పిల్లలకు ఇచ్చిన టోఫీ పేరు
Marshmello.
ఈ సిద్ధాంతం( theory) ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ విజయాన్ని సాధించిన వారిలో ఉండే ప్రత్యేక గుణం *సహనము*(patience).
ఈ గుణం జీవితంలో సంభవించే కష్టనష్టాలకు నిరాశ చెందకుండా తట్టుకునే శక్తిని ఇస్తుంది. తద్వారా మనం ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న వాళ్ళం అవుతాం.

👉జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికి రియాక్షన్ ఇవ్వకుండా ఓర్పుతో కొద్దిగా ఆగి రెస్పాన్స్ ఇవ్వండి..అదే ఓర్పు అంటే...

*సహనం(ఓర్పు ),నేర్పు ఉంటే ఓటమి లేదని తెలుసుకో...మీ జీవితం కొత్త బంగారులోకం కావాలి అంటే ఓర్పు_నేర్పు అవసరం...*
-----కొత్త రామానుజం

17/10/2020

*ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన వీడియో*

ఒక ఎలుగు బంటి పిల్లని చంపి తినటానికి ఒక పులి వెంబడించింది.
పులి తరిమింది.... తరిమింది.
తన ప్రాణాలను ఎలాగైనా దక్కించుకోవాలని ఆ ఎలుగు ఉరికింది.... ఉరికింది.
దొరికిపోతనేమో? అనే స్థితిలో ఎలుగు ఒక వాగుపై అడ్డంగా పడి ఉన్న ఎండిపోయిన చెట్టు కొమ్మ మీదుగా దాటేందుకు ప్రయత్నించింది.
అయినా పులి వెంబడిస్తూనే ఉంది.
వాగుపైనున్న చెట్టు కొమ్మ అవతలి గట్టు వరకు లేదు.
దిక్కు తోచని స్థితిలో ఎలుగు తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది.
పులి దగ్గరకు రానే వచ్చింది.
ఇంతలో చెట్టు కొమ్మ విరిగి ఎలుగు వాగు ప్రవాహంలో పడి కొట్టుకు పోతుంది.
అయినా పులి ఒడ్డునే వెంబడిస్తూ వస్తోంది.
నీటి ప్రవాహం నుండి ఒడ్డుకు చేరిన ఎలుగు పిల్లపై పులి దాడికి దిగింది.
అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఇప్పుడు ఎలుగు ముందు రెండే మార్గాలున్నాయి.
#చావటమా?
#చంపటమా?
అంతే భయాన్ని వదిలేసి పులిపై ఎదురుదాడికి సిద్ధమైంది.
తన శక్తినంతా కూడగట్టుకుని దిక్కులు పిక్కటిల్లేలా అరవటం ప్రారంభించింది.
అరిచింది.... అరిచింది.... అరుస్తూనే ఉంది.
ఊహించని పరిణామంతో పులి ఖంగుతింది.
ప్రాణభయంతో పరుగులు తీసింది.
మొదట్లో తన శక్తేమిటో తెలుసుకోలేక పిరికితనంతో పారిపోయినప్పటికీ, ప్రాణం కోసం మార్గాంతరం లేక ఎదురుదాడి చేసి ఎలుగుబంటి తన ప్రాణాలు రక్షించుకుంది.
#నీతి :బ్రతకాలంటే పోరాడాల్సిందే.
అది జంతువైనా.... మనిషైనా....
పోరాడు ! సాధించు !!

All the best my students
Kotha Ramanujam MSc,B.Ed,AP-TS SET

Address

Gatla Mallepally

508373

Website

Alerts

Be the first to know and let us send you an email when Kotha Ramanujam MSc,B.Ed,AP-TS SET posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your school to be the top-listed School/college?

Share