21/01/2017
ప్రభుత్వ ఉద్యోగం-ఉద్యోగి అంటే ఎందుకంత క్రేజీ?
ఈప్రశ్నకు చాలాకారణాలున్నాయి. అందులోకొన్ని.
1.చల్లగా ఎండతగలకుండా నీడపట్టున ఉంటారని
2.నెలనెల టంచన్ గా వానని,వరదని,తుఫానని,ఉన్నరోజు,లేనిరోజు, అని తేడాలేకుండా ఒక జీతం వస్తుందని
3.Retire అయి కళ్ళు చూపు మందగించి,వంట్లో సత్తువ నశించి, మంచం నుంచి లేవడానికి నిలబడడానికి, నడవడానికి ఇంకొకరి మీద ఆధారపడే సమయంలోకూడా పింఛనొస్తుందని. ఆవయసులోకూడా ఒకరిని పోషించులే గాని, యాచించుట ఉండదని.
సగటు మనిషిరేపేంటి అనే ఆలోచన జేస్తే అలాంటి పరిస్ధితి నీకుండదని.
4.ఒక అమ్మాయకి పెళ్లి చేయాలనుకునే తండ్రి గవర్నమెంటు Employ అయితే బాగుంటదని, అమ్మాయి,ఎండల పనికి పోకుండా సుఖపడతుందని............
భర్త retire అయినా, చనిపోయినా అమ్మాయికి చదువూ లేకపోయిన భార్యగా పింఛన్ తో బతుకుతుందని......
ఒక వేళ పిల్లలు మైనర్ లైతే వారికి కూడా Benifit వస్తుందని.
5.వృద్దాప్యంలో ఎవ్వరు పట్టించుకోకపోయినా ఏ చీకు చింతా లేకుండాప్రశాంతంగా ఉండొచ్చని.
6.అత్యవసరం(పిల్లలపెళ్ళిళ్ళూ,చదువులు,ఉద్యోగాల సమయంలో ఏ వడ్డీవ్యాపారికాళ్ళోపట్టకుండా లోన్ తీసుకోవచ్చని.........అందుకని ప్రశాంతమైనమనస్సుంటదని మన సమాజానికి govt ఉద్యోగమంటే క్రేజ్ .
�అయితే మనఏలిన వారి దయవలన ఇదంతా ఇప్పుడు గతం.ఇలాంటి భద్రతకి, భరోసాకి,ప్రశాంతకి తూట్లుపొడూస్తూ వచ్చినదే CPS భూతం.
�20,30సం॥లు తల్లిదండ్రులు తమపిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటే పెరిగి పెద్దయిన ఆబిడ్డలు........వారి తల్లిదండ్రులను రోడ్డుమీద పడేస్తే........అది తప్పా!ఒప్పా! ముమ్నాటికి అది తప్పంటుంది భారతీయ సమాజం.
�మరి 25,30సం॥లు ఒక ఉద్యోగి ప్రభుత్వాలకు సేవలందిస్తే అతని కుటుంబాన్ని రోడ్డున పడవేయమంటుంది ....ఈ New Pension System. ఇది తప్పా! ఒప్పా! చెప్పండి.........
కన్నవాళ్ళని కాటికి కాళ్ళు చాచిన వయస్సులో వదిలెయ్యడం తప్పయితే ఇది కూడా తప్పే!
�Corporate సంస్ధల్ని బాగుచేయడానికి మా జీవితాలతో జూదంఆడతారా.బహుళజాతికంపెనిల మాయలోపడి ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెడతారా.ఇది ఒక్కరి సమస్యకాదు, స్పందించే ప్రతిఒక్కరిది. ఆ సేతు హిమాచలం నుండి తూర్పు-పడమరల మధ్యనున్న ప్రతి భారతీయ ప్రభుత్వ ఉద్యోగిది. ధర్మాసనం పైన కూర్చుని న్యాయాన్యాయ విచారణచేసే న్యాయమూర్తే ఓ Public మీటింగ్ కన్నీళ్ళు పెట్టుకున్నాడంటే....... చూడండి ఈ CPS విధానం ఎంత దారుణమో!!
✊🏻నిన్ను కాపాడటానికి ఎవరు రారు, నీకు నీవేరక్ష అన్న వివేకానందుని మాటలు గుర్తుచేసుకొని.......మహాకవి శ్రీశ్రీనిస్మరించి ఉద్యమంలో ..............
నేనుసైతం-ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి-ఆహుతిచ్చాను
నేనుసైతం-విశ్వవృష్ఠికి
అశ్రువొక్కటి-ధారపోశానంటూ..
CPS రద్దుకోసం అందరం ఒక్కసారి ఉద్యమిస్తే ఎంతటి ప్రభుత్వమైన దిగిరాదా!!!
✊🏻మన పంతం cps అంతం✊🏻👏�👏�👏�👏�👏�👏�👏�👏�👏�
మీరు CPS ఉద్యోగి అయితే ఓ పది మందికి పంపండి. ₹100 లు మీకు బాలన్స్ రాదు కానీ భవిష్యత్తు లో పెన్షన్ వస్తుంది.