SPR Schools of Excellence

SPR Schools of Excellence Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SPR Schools of Excellence, School, SPR School of Excellence, Jangaon.

23/12/2025

మ్యాథమెటిక్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో మ్యాథమెటిక్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన గణిత ప్రదర్శన (ఎగ్జిబిట్) ను పాఠశాల కరస్పాండెంట్ కీర్తి వీరేందర్ గారు, ప్రిన్సిపల్ ప్రభాకర్ గారు మరియు ఉపాధ్యాయ బృందం సందర్శించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు.
తదనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు గణితానికి సంబంధించిన పాటలు, నృత్యాలు, క్విజ్ పోటీలు తదితర కార్యక్రమాలను ఉత్సాహంగా ప్రదర్శించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ కీర్తి వీరేందర్ గారు మాట్లాడుతూ, నిత్య జీవితంలో లెక్కల ప్రాముఖ్యత, గణిత అధ్యయనం వల్ల పిల్లల్లో లాజికల్ థింకింగ్, సమస్య పరిష్కార నైపుణ్యాలు ఎలా అభివృద్ధి చెందుతాయో వివరించారు. గణితం పిల్లల సమగ్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమం విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

ఎస్‌పీఆర్ హై స్కూల్‌లో ఓటు హక్కు అవగాహన కార్యక్రమంఎన్నికల నేపథ్యంలో ఎస్‌పీఆర్ హై స్కూల్ యాజమాన్యం విద్యార్థుల్లో ప్రజాస్...
16/12/2025

ఎస్‌పీఆర్ హై స్కూల్‌లో ఓటు హక్కు అవగాహన కార్యక్రమం

ఎన్నికల నేపథ్యంలో ఎస్‌పీఆర్ హై స్కూల్ యాజమాన్యం విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు పెంపొందించే లక్ష్యంతో ఓటు హక్కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులతో తమ తల్లిదండ్రులకు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉత్తరాలు రాయించి అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ వీరేందర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ద్వారా లభించిన ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని తెలిపారు. మంచి గుణగణాలు, సేవాభావం కలిగిన వ్యక్తిని ఎన్నుకోవడం ద్వారా గ్రామం మరియు సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సాయంత్రం ఆ ఉత్తరాలను అందజేసి, వాటికి సంబంధించిన ఫోటోలను పాఠశాలకు పంపనున్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ప్రభాకర్, అరుణ్ సాయిరాం పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

04/12/2025

Parent teacher meeting.

18/11/2025

Children's day Celebrations @ SPR School Jangaon

Warm greetings to all parents and students on the occasion of Guru Nanak Jayanti!May the teachings of Guru Nanak Dev Ji ...
05/11/2025

Warm greetings to all parents and students on the occasion of Guru Nanak Jayanti!
May the teachings of Guru Nanak Dev Ji inspire us to live with truth, compassion, and unity. Let us follow his path of peace, kindness, and selfless service.

ఈనాడు సండే బుక్.
20/07/2025

ఈనాడు సండే బుక్.

Address

SPR School Of Excellence
Jangaon
506167

Website

Alerts

Be the first to know and let us send you an email when SPR Schools of Excellence posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category