Dr.Remella Avadhanulu

Dr.Remella Avadhanulu

Share

Objectives 1.Preservation of Vedic "Sabda" and Vedic Texts2.Propagation of Vedic Wisdom3.Conducting Research on Knowledge and its Applications

Telugu Mahabharata Sahasrabdi Celebrations 14/08/2022

శ్రీ వేద భారతి నుండి మిత్రులు అందరికీ నమస్కారాలు. చిన్న పిల్లలకు, విద్యార్థులకు ఆశీస్సులు.

భారతీయ సమాఖ్య (18 సాంస్కృతిక సంస్థల సమాహారం) ద్వారా నిర్వహిస్తున్న "తెలుగు మహాభారత సహస్రాబ్ది" మొదటి సమావేశాలు శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి అమోఘ ఆశీస్సులతో 14.08.2022 నాడు కాకినాడ, తిమ్మాపురం, " ఆకొండి లక్ష్మి స్మారక గోశాల" ప్రాంగణం లో ఉదయం 9.00 గంటలకు ప్రారంభం అవుతున్నాయి.

ఈ కార్యక్రమాలకు రావలసిందిగా
అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము.

కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారమును యూట్యూబ్ క్రింది లింకు ద్వారా ఉదయం గం.9.00 నుండి చూడవచ్చును.

Telugu Mahabharata Sahasrabdi Celebrations Shri Veda Bharathi - Telugu Mahabharata Sahasrabdi Celebrations

18/07/2020
.::Shri Veda Bharathi::. 23/05/2020

రేమెళ్ళ అవధానులు
డాక్టర్ రేమెళ్ళ అవధానులు 1948 సెప్టెంబరు 25 తేదీన తూర్పు గోదావరి జిల్లా కోనసీమ లోని పొడగట్లపల్లిలో సూర్యనారాయణ, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించాడు.[1] 1969 లో పరమాణు భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ చేసాడు. రాజోలు డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర ఉపన్యాసకునిగా ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తూ తీరిక సమయాన్ని వృధా చేయక తనకిష్టమైన వేదాలను నేర్చుకోవాలనే అభిలాష కొద్దీ దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్ళి వేదాలను నేర్చుకునేవాడు. కానీ 1971 లో హైదరాబాదులో ఇ.సి.ఐ.ఎల్ కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాదు వచ్చేశాడు. ఇ.సి.ఐ.ఎల్ భారత దేశంలోనే మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ కంపెనీ. ఆ కంపెనీలో శిక్షణలో భాగంగా కొన్ని పుస్తకాలు చదువుతుంటే, ఎ ప్లస్ బి హోల్ స్కేర్ అనే గణిత సమస్యకు సంబంధించిన చరిత్ర కనబడింది. దానిని మన భారతీయులు మూడు వేల ఏండ్ల క్రిందటే కనుగొన్నారని తెలిశాక, మన ప్రాచీన గ్రంథాలపై మరింత ఆసక్తి పెరిగింది అవధానులు కి. ఇ.సి.ఐ.ఎల్.లో ఎనిమిదేండ్లు పనిచేసి, తిరిగి వేదాధ్యయనాన్ని కొనసాగించాడు. అంతరించిన పురాతన గ్రంథాలు అంతరించి పోగా మిగిలిన వాటినైనా రక్షించు కోవాలని అవధానులకు ఆలోచన వచ్చింది. దాన్ని కార్య రూపంలోకి తీసికొనిరావడానికి ప్రయత్నించాడు.

కంప్యూటరు లోకి తెలుగు సవరించు
1976 నాటికి ఏ భారతీయ భాషనూ కంప్యూటరీకరించలేదు. అందుచేత తెలుగును కంప్యూటరీకరించాలనే ఆలోచన వచ్చింది. అవధానులు తన మిత్రులతో కలిసి ఆరు నెలల పాటు శ్రమించి తెలుగు అక్షరాలను కంప్యూటరులో ప్రవేశ పెట్టాడు. ఆ విధంగా 1976 లో భారత దేశంలో కంప్యూటరు లోకి ఎక్కిన మొట్టమొదటి భారతీయ భాష తెలుగే. అప్పట్లో తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షుడు వావిలాల గోపాల కృష్ణయ్య అభినందనలతో కంప్యూటరు లో తెలుగు అనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వార్త పార్లమెంటు వరకూ వెళ్ళి, కంప్యూటరు లోకి తెలుగు వచ్చినపుడు, హిందీ ఎందుకు రాదు? అని ఎం.పీ లందరు తమ పై అధికారులకు లేఖలు వ్రాశారు. ఆ విధంగా హిందీని కూడా కంప్యూటరులో పెట్టే పనిని అవధాని చేపట్టవలసి వచ్చింది. దానితో పార్లమెంటరీ కమిటీ వీరి పని తీరుపై సంతృప్తి చెంది, ఇంకా అభివృద్ధి చేయాలని కోరింది.

నిమ్స్ కంప్యూటరీకరణ సవరించు
అవధానులకు హైదరాబాదు లోని NIMS డైరెక్టరు కాకర్ల సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన కోరిక మేరకు NIMS ను కంప్యూటరీకరణ చేసి, అక్కడే సుమారు 18 సంవత్సరాలు పనిచేశాడు.

వేదాల కంప్యూటరీకరణ సవరించు
NIMS లో పనిచేస్తున్నప్పుడే ఒక సందర్భంలో తి.తి.దే. వారు ప్రచురించిన పుస్తకాలను చడవడం తటస్థించింది అవధానులకు. దాని వలన తెలిసిన విషయమేమంటే.... వేదాల గురించి ఉన్న మొత్తం 1131 శాఖలకు గాను 7 శాఖలు మాత్రమే మిగిలాయని., అవి కూడా అంతరించి పోవడానికి ఎంతో కాలం పట్టదనీ అర్థ మయి పోయింది. వాటినన్నా కాపాడుకోవాలంటే.... కనీసం వాటిని రికార్డింగ్ చేస్తే తాత్కాలికంగా నైనా వాటిని కాపాడు కోవచ్చని పించింది. కానీ ఋగ్వేదం మరీ ప్రమాదంలో ఉన్నదని తెలిసింది. తనకు యజుర్వేదం మాత్రమే తెలుసు. ఋగ్వేదం తెలిసిన వారెవరున్నారా? యని అన్వేషించగా మహారాష్ట్రలో ఒకాయన ఉన్నాడని తెలిసి, అక్కడికి వెళ్ళి అతన్ని కుటుంబం సమేతంగా తీసుకొచ్చి, వారి పోషణా బాధ్యతలన్నీ తానే తీసుకొని 1992 లో వేదాల రికార్డింగ్ మొదలు పెట్టాడు.

అఖిలభారత వేద సమ్మేళనంలో :
అదే సమయానికి తి.తి.దే. వారు తిరుపతిలో అఖిల భారత వేదశాస్త్ర సమ్మేళనం నిర్వహించారు. దానికి అప్పటి భారతదేశ అధ్యక్షుడు శంకర్ దయాళ్ శర్మ వస్తున్నారనీ ఆ సందర్భంగా తనను వేదాల గురించి ఒక ప్రదర్శన ఇవ్వవలసినదిగా తి.తి.దే. వారు కోరగా 'నమకం' లోని మూడు మంత్రాలనూ, వాటి అర్థాలనూ 'సీ లాంగ్వేజి ' సహాయంతో కంప్యూటర్ లో పెట్టి చూపగా శంకర్ దయాళ్ శర్మ చాలా సంతోషించి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయమని అవధానికి చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టును ప్రారంభించాలంటే తనకు ఒక మంచి కంప్యూటర్ కావాలి. దానిని కొనే స్తోమత అవధానులకు లేదు. మనసుంటే మార్గము దేవుడే చూపిస్తాడన్నట్టు.... తనకు తెలిసిన మిత్రుడు సోమయాజులు ఆ విషయాన్ని 'అశ్విని హెయిర్ ఆయిల్ ' అధినేత అయిన సుబ్బారావుకు తెలుపగా,... సుబ్బారావు ఉదారంగా ఒకలక్షా ఇరవై వేల రూపాయాలను ఇవ్వగా దాంతో ఒక అధునాతన కంప్యూటర్ కొన్నాడు అవధాని. కంప్యూటరు మీద పనిచేస్తున్న వారికి జీత భత్యాలను తన జీతంలో నుండి ఇస్తున్నందున ఎక్కువ మందిని పెట్టుకోలేక పోయాడు. దానికి ప్రత్యామ్నాయంగా విరాళాలు సేకరించడానికి వేదభారతి ట్రస్టు ను ప్రారంభించాడు. చేయవలసిన పని ఎక్కువగా ఉండటంతో అందరితో కలిసి తాను కూడా రాత్రుళ్ళు పనిచేసేవాడు.

యజుర్వేద అనుక్రమణికలు :
ఆ సందర్భంలో వేదాలలో సైన్సు, లెక్కలు, వైద్యం, అంతరిక్ష శాస్త్రం మొదలగు శాస్త్రాలన్నీ కనబడ్డాయి అవధానికి. ఆ స్ఫూర్తితో పనిని మరింత వేగిరి పరచి, 1995 నాటికి యజుర్వేదానికి 7 అనుక్రమణికలు వ్రాసి కంప్యూటరీకించి దేశంలోనే మొట్టమొదటి సారిగా మల్టీమీడియాలో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు చూపించాడు. దానిని అప్పటి దేశ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఆవిష్కరించాడు; ప్రశంసించాడు. ఆ విధంగా అవధాని చిరకాల కోరిక కొంత వరకైనా నెరవేరింది. వేదభారతి ట్రస్టు ద్వారా ఇప్పటి వరకూ 700 గంటలు మాత్రమే రికార్డింగు పూర్తయింది. దానిని మల్టీమీడియా సీడీ ల రూపంలో ప్రజలకు అందుబాటులోనికి తెచ్చారు. కానీ మిగిలిన వేదశబ్దాల్ని రికార్డింగ్ చేస్తే సుమారు 2500 గంటల నిడివి గల రికార్డు తయారు కాగలదు. అందుకు అవధాని ఒక్కనితో అది సాధ్యమయ్యే పని కాదు. విద్వాంసులు, వదాన్యులు చేయూత నిస్తే అదేమంత కష్టమైన పని కాదంటాడు అవదాని. ఆవిధంగా మన వేద విజ్ఞానాన్ని పరిరక్షించు కున్న వాళ్ళమౌతాము.

ఇతర రంగాలలో సేవలు :
పరమాణు భౌతిక శాస్త్రంలో ఎం.ఎస్.సి. చేసిన అవధాని తనకు ఆసక్తి కరమైన వేదాలలోని యజుర్వేదం నేర్చుకున్నాడు. ఏదైనా శాస్త్రం నేర్చుకోవాలనే అభిలాషతో 'మీమాంస ' శాస్త్రం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఎమ్మె సంస్కృతం, జ్యోతిషం చేశాడు. అదే విధంగా వేదాల్లో సైన్సు భూకంపాలు జ్యోతిషం అనే అంశాలమీద పీ.హెచ్.డీలు చేశాడు. తాను చేసిన బహుభాషా మల్టీమీడియా వేది డేటాబేస్ డిజైన్ కి భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చి, సంస్కృత మిత్ర బిరుదుతో సత్కరించింది. SHRI VEDA BHARATHI

.::Shri Veda Bharathi::. India owes its hoary spiritual heritage to the Vedas. They are the storehouse of Indian wisdom and a great source of inspiration to mankind for several millions of years. The concepts of Viswaneedam (global family) and Vasudhaivakutumbakam (the whole world as one family) are emanations of this Vedic...

"కరోనా వైరస్" వంటి సమస్యలకు మన ప్రాచీన వైదిక సాహిత్యం లో కొన్ని పరిష్కార వచనాలు లభిస్తున్నాయ 16/03/2020

https://www.youtube.com/watch?v=uc3T6bEy91I

"కరోనా వైరస్" వంటి సమస్యలకు మన ప్రాచీన వైదిక సాహిత్యం లో కొన్ని పరిష్కార వచనాలు లభిస్తున్నాయ "కరోనా వైరస్" వంటి సమస్యలకు మన ప్రాచీన వైదిక సాహిత్యం లో కొన్ని పరిష్కార వచనాలు లభిస్తున్నాయి. అవకాశాన్ని బట్టి ...

Photos from Dr.Remella Avadhanulu's post 15/03/2020

"కరోనా వైరస్" వంటి సమస్యలకు మన ప్రాచీన వైదిక సాహిత్యం లో కొన్ని పరిష్కార వచనాలు లభిస్తున్నాయి. అవకాశాన్ని బట్టి వాటిని వినియోగించుకోవచ్చును.
"శ్రీ వేదభారతి "

Photos from Dr.Remella Avadhanulu's post 28/12/2019

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన మహోత్సవం: 23.12.2019 నుండి 01.01.2020వరకు;
వేదిక:NTR STADIUM
శ్రీ వేదభారతి
స్టాల్ సంఖ్య: 167.
తప్పక విచ్చేయగోరిక.

13/10/2019

From Astro Research Foundation

13/09/2019

ఆర్యా ! నమస్కారాలు.
శ్రీ వేదభారతి సంస్థ ద్వారా ఈరోజు వేదవిజ్ఞానం కార్యక్రమంలో ఈ క్రింది విషయాలు ఉంటాయి.
1.వేదశాఖల వివరాలు
2. శ్రీ విష్ణు సహస్ర నామ వివరణ, 3.లీలావతి గణితం,
ఇంటర్నెట్ ద్వారా ఉదయం 10గంటల నుండి 11.30 గంటల వరకు .
అభిరుచిని వ్యక్తం చేసి ఉన్న వారందరికీ, అధికారులకు, స్నేహితులకూ, తెలుపుచున్నాము. అందులో మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాము. మీకు ఇంటర్నెట్ లింక్ మెసేజ్ వస్తుంది. దాని సహాయంతో మీరు ఇంటర్నెట్ మీటింగ్ లో పాల్గొనవచ్చును.
కార్యక్రమం తీరుపై అమూల్యమైన మీ అభిప్రాయాలను ఈ క్రింది నంబరుకు తెలుపగలరు
ఇట్లు వేద మాత సేవలో
భవదీయుడు
డాక్టర్ రేమెళ్ల అవధానులు
+919849459316

Want your school to be the top-listed School/college in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address

Madhuranagar
Hyderabad