29/12/2023
*"తెలంగాణ రాత- మా గీత "*
2009 డిసెంబర్9, ప్రకటన తరువాత అన్ని వర్ణాల వారు తమ యొక్క సంఘాల ద్వార నిరసనను వ్యక్తం చేస్తున్నారు. లాయర్లు, ఉద్యోగులు, కులసంఘాల, రచయితల సంఘం, సాంస్కృతిక సమాఖ్యలతో పాటు ఒక వేదికగా ఏర్పడి తమ యొక్క కళల ద్వార నిరసన తెలిపుతన్నారు . ఆ సమయం లో Ramesh hazari గారు (పోగ్రెసివ్ మీడియా) నేను కలిసి OU ఆర్ట్స్ కాలేజి వద్ద చిత్రకారుల తో ఉద్యమానికి మద్దతుగా ఆర్ట్ క్యాంప్ చెయ్యాలి అని నిర్ణహించాము.ఈ క్రమంలో డిసెంబర్ 26, 2009 నTASC FORUM (Telangana Artist, Sculptors & Cartoonist's Forum) మరియు "Telangana Journalist Forum " సంయుక్తంగా ఆర్ట్ క్యాంప్ నీ వారం రోజుల పాటు నిర్వహించాము.
డిసెంబర్ 9 ఆమరణ నిరహార దీక్ష తరువాత ఉస్మానియా యూనివర్సిటీ లో విద్యార్దులు ఉద్యమాన్ని ప్రారంభించారు. క్యాంపస్ లో వెళ్ళడానికి పోలీస్ అనుమతి లేదు. రమేష్ హాజరి గారి వ్యాన్ కి "ప్రెస్" అని వుంటుంది కనుక పోలీస్ వాళ్ళు మమ్ములను ఆపలేదు, అదే వ్యాన్ లో మదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ కి వెళ్లి ఆర్టిస్ట్ స్టాండ్స్ తీసుకొని ఆర్ట్స్ కాలేజీ కి వెళ్ళాము.ఈ శిభిరంలో నిరంకుశ నిజాం నవాబును ఎదిరించిన సాయుధ పోరాట దృశ్యాలు, ఎడారిగా తెలంగాణ గ్రామాలు, రాజ్యహింస, ఇలాంటి దృశ్యాల చిత్ర ప్రదర్శనకు O.U. ఆర్ట్స్ కాలేజీ ప్రాగణం వేదికైంది. నిధులు నీళ్ళు, వనరులపైన వేసిన కార్టూన్ లు పలువురిని అలోసింపజేసినాయి. ఈ శిభిరానికి రాజకీయ JAC నాయకులతో పాటు జర్నలిస్టు అల్లం నారాయణ గారితో పాటు ప్రముఖులు సందర్శించినారు.
ఈ శిభిరంలో R.శ్రీనివాస్ నాయక్, కిషోర్, కూరెళ్ళ శ్రీనివాస్, జగన్ లతో పాటు JNATU,Fine Arts College విద్యార్దులు వేణుగోపాల్, నాగేశ్వరరావు, రాజా గౌడ్ TASC ఫోరమ్ నిర్వహకులు గోనె లింగరాజు, జర్నలిస్ట్ ఫోరం నుండి రమేష్ హజారి మొదలగును వారు పాల్గొన్నారు.
ఉదయం నుండి రాత్రి 7గం॥ల వరకు చిత్రకారులు తమ యొక్క సంఘభావాన్ని యచేసినారు.
(1969, డిసెంబర్ లో అప్పటి చిత్రకారులు శ్రీ.జయంత్, మన్మోహన్ దత్త్, అశోక్, శ్రీహరి బోలేకర్ లాంటి వారు రవిద్రభారతిలో వారి పెయింటింగ్స్ తో సంఘీభావం తెలిపారు. వారి స్పూర్తి తో తెలంగాణ మలిదశ ఉద్యమం లో నిర్వహించిన మొదటి ఆర్ట్ క్యాంప్).
Dr.L R Gone
02/06/2022
13/04/2022
09/12/2019
07/06/2019
31/03/2019
23/11/2018
11/11/2018
03/08/2018
03/05/2017