🌺 హనుమాన్ జయంతి వేడుకలు @ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయము,కోఱుతాడిపఱ్ఱు,బాపట్ల జిల్లా 🌺🪷
🌹నరేంద్రుడైన శ్రీరాముని యొక్క కార్యమును సఫలీకృతము చేయుటలో కార్యదక్షత కలిగినవాడు,అంతః శత్రువులను,బాహ్య శత్రువులను జయించగలిగిన ధురంధరుడు - మన హనుమంతుడు.
🪷ప్రస్తుత కాలంలో మనం అందరం కూడా సనాతన ధర్మమును నిలబెట్టడంలో ధురంధరులమవ్వటానికి కావలసిన శక్తిని ప్రసాదించి,కార్యసిద్ధిని అనుగ్రహించగలిగిన ఈ కార్య ధురంధరుడే మనకి ఆశ్రయమైనవాడు. 🪷✨
మానవ లోకానికి అతి దగ్గరగా ఉంటూ,మనలని తేలికగా అనుగ్రహించే ఆంజనేయ స్వామి వారిని మార్గశీర్ష,వైశాఖ మాసములలో విశేషంగా పూజిస్తాము.
వాటిలో ఒకరోజైన "హనుమాన్ జయంతిని" ఈ నెల 12వ తారీఖున ఆస్తికమహాశయులంతా ఎంతో వైభవోపేతంగా జరుపుకున్నాము. ✨✨✨
బాపట్ల జిల్లా - కోఱుతాడిపఱ్ఱులోని శ్రీ కామేశ్వరీ ఫౌండేషన్ యొక్క శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో కూడా హనుమాన్ జయంతి రోజున పెద్దల సమక్షంలో,ఊరి ప్రజలతో కలిసి శక్తి కొలది,భక్తితో హనుమంతుల వారిని సేవించుకున్నాము. 🪷🪷🪷
--- గణపతి పూజతో ప్రారంభించి
--- పోతురాజుని పూజించుకుని
--- అష్టోత్తర శత సంఖ్యాకముగా,మన్యుసూక్త పారాయణతో ఆంజనేయ స్వామి వారికి పంచామృతములతో అభిషేకము చేసి
--- తమలపాకులు,వివిధ రకములైన పూలతో విశేష సహస్రనామార్చన చేసి
--- నైవేద్యమును సమర్పిచి
--- మంగళములను ప్రసాదించమని వేడుకుంటూ మంగళ హారతులనిచ్చి
--- స్వామి వారి భక్తి గీతములను,దండకమును ఆలపించి
--- సాష్టాంగ నమస్కారములను చేసి
--- తీర్థ ప్రసాదములను స్వీకరించాము
ఈ విధంగా స్వామి వారి కటాక్షమునకు ఒక మెట్టు ఎక్కే భాగ్యాన్ని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు ప్రసాదించారు.✨✨✨
ఈ వేడుకలను భక్తితో,శ్రద్ధతో అందరం జరుపుకోవటానికి సహకరించిన గుంటూరు వేంకటేశ్వర శర్మ గారికి,గుంటూరు రేవంత్ ఘనపాఠీ గారికి,విచ్చేసిన పెద్దలకి ప్రత్యేక కృతజ్ఞతలు.🙏
ఆ వేడుకలలోని కొన్ని ఘట్టములను ఈ వీడియోలో పొందుపరిచాము🙏
శ్రీహనుమతే - రామదూతాయ - ఆంజనేయాయ - మారుతయే నమో నమః 🙏🙏🙏
Kameswari Foundation
We aim to promote and encourage a shastric perspective towards analyzing and resolving modern proble
🌟Community Living: Is it Truly Possible?🌟
🌹With the growing necessity *to come together to retain the heritage of Sanatana Dharma* , we are striving to find ways to improve our lives and pass this culture on to future generations.
🌺 Any new initiative initially brings a lot of hope and happiness —whether it is a small step in spiritual sadhana, interacting with those rooted in dharma, or reviving lost traditions within our families.
However, as we stand firm in our convictions and deepen our actions, we often encounter unexpected reactions, both from within ourselves and from the world around us.
These moments can make us feel as though our approach is flawed, that people are not as welcoming as they seemed, or that we are aiming for an unreachable goal.
At such a juncture, it is vital to reflect upon these questions:
🔥 Are we being judgmental in our interactions?
⚡ Are we losing sight of our original intent and purpose?
💥 Are we staying true to ourselves in both thought and action?
When we observe ourselves and the world as a detached witness, free from bias, we begin to understand the "play" of the Supreme Self. This clarity allows us to act in a manner that aligns our individual lives with the Universal Self.
We must remember that if we remain sincere in our thoughts and actions, our flaws will be corrected.We will be guided through every challenge by the omnipresent, omniscient, and omnipotent Parabrahman.✨✨✨
As a Foundation working to make community living a healthy and blissful experience for present and future generations , we share these insights from our own experiences, the blessings of our Gurus, and the grace of our ever-loving Mother Kameswari and Sri Prasannanjaneya Swamy.🪷🪷🪷
With prostrations to our Gurus, Mother Kameswari, Sri Prasannanjaneya Swamy, and our elders to bless us, guide us, and hold us in every step, we present our April Newsletter. 🙏🙏🙏
https://kameswari.org/monthly-highlights-april-26/
26/04/2026
🌺శ్రీబాలత్రిపురసుందరీ దేవి చరిత్ర - ఎపిసోడ్ - 3🌺
⚡️500 సంవత్సరముల తరువాత హిమాలయ పర్వతము మీద దేవతలు చేస్తున్న యజ్ఞమును గురించి తెలుసుకున్న భండాసురుడు ఏమి చేశాడు?
🌟దేవతలు మిగిలిన 500 సంవత్సరముల యజ్ఞమును ఏ రకంగా పూర్తి చేయగలిగారు?
🌹బాలత్రిపురసుందరీ దేవి ఆవిర్భావానికి, భండాసుర వధకి ఉన్న సంబంధం ఏమిటి?
ఈ విషయాలతో పాటు:
💥అసలు రాక్షసులు అంటే ఎవరు?
🔥వారిని ఎదుర్కొనాలంటే ఉండవలసిన సమర్థత ఏమిటి?
అన్న ప్రశ్నలకు సమాధానాలను, వాటి అంతరార్థములతో సహా ఈ మూడవ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోగలరు.
Kameswari Foundation 7 likes, 1 comment. "Sri Bala Tripura Sundari Devi Role in Bhandasura Vadha | Ep-3 | Sri BalaTripuraSundariDevi Charitra"
11/04/2026
🌸📚పిల్లలకు వేద విద్యను అందించటం ద్వారా మన ఋషులు మనకి ఇచ్చిన విజ్ఞాన పరంపరను కాపాడగలము ,అలాగే జన్మను తరింపజేసుకోవచ్చు అని భావించి తల్లితండ్రులు వారు ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే,పిల్లలను మాత్రము వేదపాఠశాలలో చేరుస్తున్నారు.📚🌸
🌹అయితే అలా గురుకులంలో చేర్చి పిల్లలకు వేదవిద్యను అందించినంత మాత్రాన వారు సఫలీకృతులు అయినట్టేనా?*
🌺వేదవిద్యను అభ్యసించేవారు ఎలా జీవించాలి?*
🪷వారి తల్లితండ్రులు ఏ విధంగా వారికి తోడ్పాటునివ్వాలి?
ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవటం ఎంత ముఖ్యమో అంత క్లిష్టము కూడా.
ఈ ప్రశ్నలకు సమాధానమును ప్రస్తుత జీవన విధానము అనుసరించి,విద్యా విధానము అనుసరించి,మానసిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ....ఇలా ఎన్నో కోణాలలో పరిశీలించి చెప్పాలి.🪷🪷🪷
అటువంటి జటిలమైన విషయం గురించి కూనపులి గణేష్ కార్తికేయ ఘనపాఠీ గారు చెప్పిన సమాధానమును ఈ వీడియో ద్వారా తెలుసుకోగలరు.🙏
ఈ వీడియో చూసిన తరువాత మీకు కూడా చర్చించిన విషయం యొక్క ఆవశ్యకత అర్థమయ్యి,సామాజిక బాధ్యతతో దీనిని పరిష్కరించుకుని పిల్లలకి చక్కటి వాతావరణాన్ని ఇవ్వటానికి మీ వంతు ప్రయత్నం మాతో పాటుగా చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరు. 🙏
Responsibilities of Veda Students & Parents in Gurukula System|గురుకుల-వేద విద్య సఫలీకృతమవ్వాలంటే? ిల్లలకు వేద విద్యను అందించటం ద్వారా మన ఋషులు మనకి ఇచ్చిన విజ్ఞాన పరంపరను కాపాడగలము,అల.....
07/04/2026
"Go with the flow"
It is perhaps the most overused phrase of our time, urging us to constantly chase the latest trends.
In today’s hyper-connected digital world, individuals and institutions alike feel immense pressure to react and comment on every fleeting event.
This constant need to participate often leads to unnecessary anxiety, distress, and a loss of inner peace.
But if we pause and reflect, we realize that this frantic pace is entirely optional.
Consider the analogy of an actor on set. A skilled actor works strictly according to the director's vision. By performing their designated role well, they earn the director's trust and secure more significant roles in the future.
Conversely, if an actor tries to force themselves into a scene where they don't belong, it disrupts the narrative and invites unwanted consequences for their untimely interference.
Similarly, in the grand play of life, we are the actors, and the Supreme Self is the ultimate Director.
When we act according to His direction—performing our designated Karma and abiding by Dharma —we are loved, guided, and
spiritually elevated across lifetimes, eventually attaining Kaivalya (liberation). 🌹🪷🌹
However, when we force ourselves into every unfolding drama around us, stepping outside our intended purpose, we invite the very distress we see in the world today.
Ultimately, it is the quality of our actions, not the quantity of our tasks, that elevates our lives. Just as a small but masterfully performed role can turn an actor into a star, executing our Karma with devotion ensures the Supreme Self will care for us and elevate our souls. ✨✨✨
As an organization walking this Dharmic path, it is our constant prayer to the Divine Mother that every endeavor we undertake is instilled with quality and devotion. 🪷🪷🪷
We seek Her grace to stay firmly aligned with our vision and mission, and remain undistracted.🙏🙏
In that spirit of focused dedication, we present our March Newsletter. This past month brought several wonderful opportunities to share our perspectives and learnings with a wide audience through both online and offline activities.🙏🙏🙏
Monthly Highlights – March 26 – Sri Kameswari Foundation Monthly Highlights – March 26 Posted by Sri Kameswari Foundation Date April 7, 2026 Comments 0 comment Greetings Everyone!!!“Go with the flow”—it is perhaps the most overused phrase of our time, urging us to constantly chase the latest trends. In today’s hyper-connected digital world, indi...
01/04/2026
🪷 యోగులు సమాధి స్థితిలో బ్రహ్మానందానుభవమును పొందుతారు. 🪷
ఇది అందరికీ తెలిసిన విషయం.
అందుచేత అష్టాంగయోగములో ప్రతిపాదించబడిన ధ్యానమును అనుసరించి తరువాత స్థితి అయిన సమాధిని సిద్ధింపచేసుకోవచ్చని భావించి ధ్యాన కేంద్రాలలో చేరేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
అయితే ఈ ధ్యానంలో మనకి ప్రాణాయామం కూడా నేర్పిస్తున్నారు,కొంత మేర ఆసనములను కూడా.
కానీ ధ్యానకేంద్రాలు పెరిగినంత సంఖ్యలో కనీసంలో కనీసం సంఖ్యలో ఋషులు అనుభవించిన సమాధి స్థితిని అనుభవించేవారిని చూడగలుగుతున్నామా?
లేదు కదా! ఇంకా చెప్పాలంటే ఎంత ధ్యానం చేసినా సమాధి స్థితిని పొందలేకపోతున్నామని బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు.
🪷 ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడగలము? 🪷
సమాధి స్థితిని పొందటానికి జీవుడు ఎక్కవలసిన మెట్లని అష్టాంగయోగములో చక్కగా చెప్పారు - యమ,నియమ,ఆసన,ప్రాణాయామ,ప్రత్యాహార,ధారణ,ధ్యాన,సమాధి .
ఈ సోపానములలో మొదటివైన యమ,నియమముల యందు మనం ఊంచుకోకముందే తరువాత సోపానాలైన ఆసన,ప్రాణాయామములతో సాధనను ప్రారంభించటం వల్ల మనము యోగములో ముందుకు సాగలేకపోతున్నాము.
అయితే యమ,నియమముల యందు మనకు శిక్షణనిచ్చే కేంద్రాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తున్నారా?
ఋషులు మనకి చెప్పిన నిత్య,నైమిత్తిక కర్మాచరణమే ఈ ముఖ్యమైన ప్రథమ సోపానములను అధిరోహించటానికి అత్యంత ప్రధానం.
సనాతన ధర్మములో చెప్పబడిన షోడశ సంస్కారముల ద్వారా జీవుడు కర్మాచరణమును ఆచరిస్తూ క్రమముగా చిత్తశుద్ధిని పొందుతాడు. ✨✨✨
అట్టి సంస్కారములను మన నిత్య జీవితంలో ఎలా సమన్వయించుకోవాలని,అవి జీవుడు బ్రహ్మానందానుభవాన్ని పొందటానికి కావలసిన విజ్ఞానమును ఏ విధంగా అందిస్తాయని , నేటి యువతకు కూడా తేలికగా అర్థమయ్యే విధంగా డా||జమ్మలమడక సూర్యనారాయణ గారు ఈ వీడియోలో తెలియజేశారు.
ఋషిప్రోక్త సనాతన జీవన విధానమును గురించి తోటి సనాతనులతో పంచుకునే అవకాశమును కల్పించిన "సనాతన ఋషిప్రోక్త గాయత్రీ మహాపరిషత్" వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.🙏🙏🙏
The Secret Connection Between Samskaras and Moksha | Dr.J.Suryanarayana #kameswarifoundation ...
26/03/2026
🌺🌸🌺 Sharanam - Guru Charanam | Ep - 3 | Part - 2 🌺🌸🌺
🪷గురు స్వరూపం ఏమిటి ?🪷
ఆయన కేవలం మార్గదర్శి మాత్రమేనా ?📚
'శరణం - గురుచరణం' సిరీస్‌లో భాగంగా 3వ ఎపిసోడ్ రెండవ భాగంలో—బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారికి, 'నడిచే దేవుడు' కంచి పరమాచార్య స్వామి వారితో ఉన్న అద్భుతమైన అనుబంధం గురించి తెలుసుకోబోతున్నాం. 🌺✨🌸
శాస్త్రి గారి తండ్రిగారు ఎప్పుడో పాడిన పద్యాన్ని స్వామివారు సరిగ్గా అలాగే ఎలా పలకగలిగారు?🙏🙏
సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ జగద్గురువు ఒక సామాన్య మానవుడిలా మన మధ్య ఎందుకు నడయాడారు?✨✨✨
'నడిచే దేవుడు' పుస్తకం ఆధారంగా రూపొందించిన ఈ వీడియోలో మహాత్ముల లీలల వెనుక ఉన్న అంతరార్థాన్ని, వారి అనుగ్రహ విశేషాన్ని శ్రీ కామేశ్వరి ఫౌండేషన్ మీ ముందుకు తీసుకువస్తోంది.🙏🙏🙏
https://youtu.be/oe9PkaXAgOY?si=seaRuw5KTGhpUTRb
వాగ్దేవీ వరపుత్ర - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి జీవితంపై చేసిన అద్భుత ప్రవచనం
https://www.youtube.com/live/697bqsZVPgk?si=lV2i538AGA-umtaY
'శరణం - గురుచరణం' సిరీస్ ప్లేలిస్ట్
https://youtube.com/playlist?list=PLF3r688MqNFYwThiGoUdEqODGJ85U4YZY&si=upovEIDbAleX_qUD]
మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం శ్రీ కామేశ్వరి ఫౌండేషన్ ఛానెల్ కు సబ్స్క్రైబ్ చేసుకోగలరు!🙏
గమనిక (AI చిత్రాల గురించి)
ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు AI (కృత్రిమ మేధ) ద్వారా రూపొందించబడినవి. ఇవి కేవలం కథా సందర్భాన్ని వివరించడానికి మరియు ప్రేక్షకులకు సులభంగా అర్థం కావడానికి మాత్రమే ఉపయోగించబడ్డాయి. ఎవరినీ తక్కువ చేయడానికి గానీ, ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి గానీ ఇవి ఉద్దేశించినవి కావు. మాకు సనాతన ధర్మం పట్ల అత్యంత గౌరవం ఉంది. కేవలం భక్తి భావ వ్యాప్తి కోసమే ఈ ప్రయత్నం.
True Nature of Guru | Kanchi MahaSwami | Tadepalli RaghavaNarayana Sastry Garu|Ep - 3 | Part - 2 Vagdevi Varaputra - Brahmasri Samavedam Shanmukha Sarma garu’s pravachanam on Tadepalli Raghava Narayana Shastry garu’s life:https://www.youtube.com/live/697...
22/03/2026
🌺🌺🌺 శరణం - గురుచరణం : 3వ ఎపిసోడ్, 1వ భాగము 🌺🌺🌺
భగవంతుడిని చేరుకోవడానికి అవసరం అయ్యే ఎంతో వాఙ్మయం సనాతన ధర్మంలో ఉంది.
📚 వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ... ఇవన్నీ ఆ పరమేశ్వరుని గురించే చెబుతాయి. 📚
అయితే, అసలు మహాత్ములు కూడా ఈ పుస్తకాలు చదువుతారా? 📖
ఆ పరమాత్మ వైభవం తెలుసుకొని వారూ మనలాగే పొంగిపోతారా?*
శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, కంచి పరమాచార్యుల వారి గురించి చెప్పిన అమూల్యమైన అనుభవ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.
"నడిచే దేవుడు" అనే పుస్తకం ఆధారంగా రూపొందించిన ఈ కథ, భక్తి మార్గంలో మనకు ఎంతో స్ఫూర్తినిస్తుంది.🙏
శ్రీ కామేశ్వరీ ఫౌండేషన్ సమర్పిస్తున్న 'శరణం - గురుచరణం' శీర్షికలో; ఇది 3వ ఎపిసోడ్, 1వ భాగము.*
ముఖ్య గమనిక
ఈ వీడియోలోని చిత్రాలు కేవలం వీక్షకుల ఆసక్తి కోసం AI (కృత్రిమ మేధ) ద్వారా సృష్టించబడినవి. ఎవరినీ తక్కువ చేయాలని గానీ, అవమానించాలని గానీ మా ఉద్దేశ్యం కాదు. సనాతన ధర్మం అన్నా, శ్రీ కంచి పరమాచార్యుల వారు మరియు ఈ వీడియోలో కనిపించే పెద్దలన్నా మాకు అత్యంత భక్తి, గౌరవాలు ఉన్నాయి.🙏🙏🙏
What Books Do Saints Read? | మహాత్ములు ఏ పుస్తకాలు చదువుతారు?| Sharanam - Guru Charanam |EP-3|Part-1 scriptures—the Ved...
17/03/2026
🌺🌞🌍 ఉగాది - నవపథానికి నాంది 🌍🌝🌺
తెలుగు వారందరూ నూతన ఉత్సాహంతో,నూతన ఆశయాలతో జరుపుకునే ఉగాది పండుగ గురించి కృష్ణ యజుర్వేదంలో చెప్పిన విషయాలను కూనపులి గణేష్ కార్తికేయ ఘనపాఠీ గారి నుండి ఈ వీడియో ద్వారా తెలుసుకోగలరు.🙏
ఈ వీడియోలో ఉగాది పండుగ యొక్క మూలాలను, కృష్ణ యజుర్వేదం మరియు స్మృతి గ్రంథాలలో ఉగాది పండుగ ప్రస్తావన ఎక్కడ ఉందో ప్రమాణ పూర్వకముగా వివరించడం జరిగింది.🌸🌸🌸
అందరూ సుఖ,సౌఖ్యములతో జీవించాలని కాంక్షిస్తూ గురువుగారు వేద ఆశీర్వచనమును అందించారు. 🙏🙏🙏
అందరికీ శ్రీపరాభవ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!🪷🪷🪷
సనాతన ధర్మము వర్ధిల్లు గాక!!!✨✨✨
వేదం,స్మృతిలో ఉగాది ప్రస్తావన|Ugadi in Vedas & Smriti|Krishna Yajurvedam|Veda Aasirvachanam|VV| Ep-9 #ఉగాది2026 🌺🌞🌍 ఉగాది - నవపథానికి నాంది 🌍🌝🌺తెలుగు వారందరూ నూతన ఉత్సాహంతో,నూతన ...
28/02/2026
🌺🪷🌺 శ్రీకామేశ్వరీ ఫౌండేషన్ - మహాశివరాత్రి మధుర స్మృతులు 🌺🪷🌺
శ్రీకామేశ్వరీ వేద-శాస్త్ర పాఠశాల విద్యార్థులు మహాశివరాత్రి పర్వదినమున పొందిన ఆనందానుభూతులను ఈ వీడియో ద్వారా తోటి సనాతనులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాము.
ఇటువంటి చక్కటి అనుభూతులను,జ్ఞాపకాలను పొందే అవకాశం కల్పించిన రామ దుర్గా సౌభాగ్య ఛారిటబుల్ ట్రస్టు వారికి,కరిష్యే సంస్థ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. 🙏🙏
కార్యక్రమములో ప్రత్యక్షంగా పాల్గొన్న వారికి,పరోక్షంగా మమ్మల్ని ఆదరిస్తున్న వారికి ధన్యవాదాలు.🙏🙏🙏
సనాతన ధర్మము వర్ధిల్లు గాక!!!✨✨✨
https://youtu.be/R_Ytqi0_s8I
Suryanarayana Jammalamadaka
MahaShivaratri 2026 Experience | Sri Kameswari Foundation | మహాశివరాత్రి 2026 శ్రీకామేశ్వరీ వేద-శాస్త్ర పాఠశాల విద్యార్థులు మహాశివరాత్రి పర్వదినమున పొందిన ఆనందానుభూతులను ఈ వీడియో ద్వారా ...
24/02/2026
🌷శరణం - గురు చరణం | 2nd Episode🌷
శ్రీ కామేశ్వరీ ఫౌండేషన్ సమర్పిస్తున్న 'శరణం - గురు చరణం' రెండవ ఎపిసోడ్‌కు స్వాగతం.
ఈ వీడియోలో, *కంచి పరమాచార్య శ్రీ శ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దివ్య సౌందర్యం* వెనుక ఉన్న రహస్యాన్ని, నీలంరాజు వేంకట శేషయ్య గారికి కలిగిన అపురూప అనుభవం ద్వారా తెలుసుకోబోతున్నాం.
ముసలితనంలో కూడా స్వామి వారి ముఖంలో ఆ అద్భుతమైన తేజస్సు ఎలా ఉండేది?
అసలైన అందం అంటే ఏమిటి?
దీనిని భగవద్గీత మరియు స్వామి కృష్ణానంద గారి బోధనల ద్వారా ఈ వీడియోలో వివరించడం జరిగింది.
*గమనిక*
ఈ వీడియోలో కథా వివరణ కోసం మేము AI ద్వారా రూపొందించిన చిత్రాలను (AI Images) ఉపయోగించాము.
టెక్నాలజీ పరిమితుల వల్ల ఏవైనా చిన్న పొరపాట్లు దొర్లితే క్షమించగలరని మనవి.
మాకు శ్రీ స్వామి వారి పట్ల మరియు సనాతన ధర్మం పట్ల అత్యంత గౌరవం ఉంది. వారి దివ్యత్వాన్ని భక్తులకు చేరవేయడమే మా ముఖ్య ఉద్దేశ్యం.
సౌందర్యం అంటే ఏమిటి? | What is Real Beauty? | శరణం - గురు చరణం | Ep - 02 |#kanchiparamacharyaleelalu Playlist link - https://youtube.com/playlist?list=PLF3r688MqNFYwThiGoUdEqODGJ85U4YZY&si=a8UaWOJPmGXQYIHx-----------------------------------------------------...
Click here to claim your Sponsored Listing.