Dr.B.R Ambedkar Jashuva Pule Periyar Literature Foundation

Dr.B.R Ambedkar Jashuva Pule Periyar Literature Foundation

Share

SYAM

16/12/2022
11/11/2022

మిత్రులకు ఆహ్వానం
సామాజిక తత్వవేత్త *పోతులూరి వీరబ్రహ్మం.- తాత్వికత* అంశం పై బ్రాడీపేటలోని సి. పి. ఎం. జిల్లా కార్యాలయంలో నవంబర్ 5వ తేది *శనివారం సాయంత్రం 5 గంటలకు* సెమినార్ జరుగును. ఈ సెమినార్ లో *పోతులూరి వీరబ్రహ్మం 8వ తరం ముని మనవడు నొస్సం వీరభద్ర స్వామి,* గౌరవ శాసనమండలి సభ్యులు, దళిత బహుజన ఉద్యమ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటారు.
కావున మీరు తప్పనసరిగా హాజరు కావాలని కోరుతున్నాము.

నిర్వాహులు
బి. విల్సన్, బి.శ్యాంబాబు
*డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - జాషువా - పెరియార్ - పూలే ఫౌండేషన్, గుంటూరు.*

Photos from Dr.B.R Ambedkar Jashuva P**e Periyar Literature Foundation's post 08/11/2022
17/07/2022

అచ్చ గిరిజన కవిత్వం దుర్ల

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాదరావు

అచ్చ గిరిజన కవిత్వం దుర్ల అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాదరావు అన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని ఓ హోటల్లో
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ - జాషువా - పెరియార్ - పూలే లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుర్ల కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది. కవి బి.విల్సన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బి.శ్యాoబాబు మోడరేటర్ గా వ్యవహరిoచారు.
దుర్ల కవితా సంపుటిని విరసం నాయకులు సి ఎస్ ఆర్ ప్రసాద్, అరసం నాయకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, సామాజిక న్యాయవాది పలుకూరి ప్రసాద్, ఆంధ్రా మేధావుల ఫోరం కో కన్వీనర్ తాటికొండ నరసింహారావులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాదరావు మాట్లాడుతూ అచ్చమైన గిరిజన కవిత్వం దుర్ల అన్నారు. దుర్ల కవిత్వాన్ని రాసిన మల్లీపురం జగదీష్ స్వయంగా గిరిజనుడు కావడం కవిత్వానికి మరింత వన్నె తెచ్చిందన్నారు. అరసం నాయకులు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దుర్ల వంటి మంచి కవిత్వాన్ని రాసినకవి తన శిష్యుడు కావడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. విరసం నాయకులు సి.ఎస్. ఆర్. ప్రసాద్ మాట్లాడుతూ సమాజ విస్మరణకు గురవుతున్న గిరిజనులు పోరాటాలతో తమ ఉనికిని చాటుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్యం దినపత్రిక సంపాదకులు చల్లా మధుసూదన్ రావు,
సీనియర్ పాత్రికేయులు బండారు సురేష్, మనసు ఫౌండేషన్ సభ్యులు పారా అశోక్, హైకోర్టు సీనియర్ న్యాయవాది సంజీవరెడ్డి మార్పుల, కవులు ఎస్.ఎం.సుభాని, మస్తాన్ వలి, భీమ్ సేనా సేవా దళ్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపు నీలాంబరం, కాపు శ్రీనివాస్, దళిత బహుజన పరివర్తన సంఘం నాయకులు జొన్నలగడ్డ శ్రీకాంత్
యువ న్యాయవాది వీర మణీoద్ర పాల్గొన్నారు.

Photos from Dr.B.R Ambedkar Jashuva P**e Periyar Literature Foundation's post 23/05/2022

పరువు హత్యలు నాగరిక సమాజానికి మాయని మచ్చ
ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవర ప్రసాద్, కేఎస్ లక్ష్మణరావు

సమాజంలో ఇటీవలి
కాలంలో పెరిగిపోయిన పరువు హత్యలు నాగరిక సమాజానికి మాయని మచ్చ అని ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, కేఎస్ లక్ష్మణరావులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - జాషువా - పెరియార్ - పూలే లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని మద్రాస్ కాఫీ హోటల్లో చితి పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి కవి బి.విల్సన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, కేఎస్ లక్ష్మణరావులు మాట్లాడుతూ ఇటీవల పెరుగుతున్న పరువు హత్యలు నాగరిక సమాజానికి మాయని మచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. పరువు హత్యలు నేపథ్యంగా ప్రముఖ రచయిత పెరమాల్ మురుగన్ రచించిన చితి పుస్తకాన్ని ఆవిష్కరించడం సందర్భోచితంగా ఉందన్నారు. పరువు హత్యలను నివారణకు ప్రత్యేక చట్టాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కవి పాపినేని శివశంకర్ మాట్లాడుతూ పరువు హత్యల్లో ఎక్కువ భాగం చిన్న కులాలవారే హత్యలు గావించ బడుతున్నారని వివరించారు. అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అగ్ర కుల ఉన్మాద హత్యలు పరువు హత్యలుగా చిత్రీకరించబడటం దారుణమన్నారు. సభ్య సమాజం మొత్తం పరువు హత్యలను ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి బీ.శ్యాంబాబు, డాక్టర్ డి.సిహెచ్.అంజయ్య, కాపు శ్రీనివాస్, కన్న విద్యా సంస్థల డైరెక్టర్ కన్న మాస్టారు, ఎవి ఫౌండేషన్ అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు, మధు తదితరులు పాల్గొన్నారు.

10/04/2022

దేశ భవిష్యత్తు డాక్టర్ అంబేద్కరే
అద్వితీయుడు పుస్తకావిష్కరణలో డొక్కా మాణిక్య వరప్రసాద్

దేశ భవిష్యత్తు డాక్టర్. ఆర్.అంబేద్కర్ మాత్రమేనని ఎమ్మెల్సీ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు ఆదివారం ఉదయం 11 గంటలకు ఏసీ కాలేజ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ జాషువా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అద్వితీయుడు పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ అధ్యక్షుడు శ్యాంబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ డొక్కా మాట్లాడుతూ దేశ భవిష్యత్తు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాత్రమేనన్నారు. దేశభక్తి అంటే ఇతర మతస్తులను వ్యతిరేకించడం కాదని దేశ రాజ్యాంగాన్ని ప్రేమించడమే అన్నారు కానీ దురదృష్టవశాత్తు మైనారిటీ మతాలను చిన్న కులాలను అణగదొక్కడమే దేశ భక్తి గా ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో అతిథి ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప దేశభక్తుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కవి, పాత్రికేయుడు బి.విల్సన్, జడ్జి జస్టిస్ జేసుదానం,
ఐఆర్ఎస్ అధికారి jబి.రాజేశ్వరరావు
కన్న విద్యా సంస్థల డైరెక్టర్ కన్న మాస్టారు, డాక్టర్ డి.సిహెచ్.అంజయ్య, నాగార్జునా యూనివర్సిటీ ప్రొఫెసర్ వి.అంజిరెడ్డి పాల్గొన్నారు.

Want your school to be the top-listed School/college in Guntur?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address

Guntur