22/10/2022
కీ.శే. S.R. Shankaran IAS గారితో నాకున్న పరిచెయం.
Shankaran గారు నెల్లూరు జిల్లాలో కలక్టరు గా పని చేసిన రోజుల్లో ఒకరోజు మా గ్రామాన్ని సందర్శించారు. ఆయనకి అప్పట్లో తెలుగు వొచ్చేదు కాదు. Shankaran గారితో మా గ్రామ సమస్యలని english లో translate చేసి చెప్పడానికి మా పెదనాయన శ్రీ తానికొండ వెంకటయ్య గారిని ఉపయోగించారు. అప్పడు మా పెదనాయన వెంకటయ్య గారు నెల్లూరు పట్టణం లోని ఒక Orphan Residential School లో ఎనిమిదవ తరగతి చదువుతున్నారు. బహుశా మా మండలం మొత్తం మీద అత్యధిక విధ్యావంతుడు అప్పట్లో ఆయనే మా పెదనాయన గారు. మా పెదనాయన గారు మా గ్రామ సమస్యలని కలక్టరు SR Shankaran గారి ద్రుష్టికి తనదైన శైలిలో ఆంగ్ల భాష లో మాటాడిన విధానాన్ని చూసి అప్పటికపుడే మా పెదనాయన కు Teacher గా appointment ఇవ్వడం జరిగింది. ఆ 8 వ తరగతి విధ్యార్హత తోనే మా పెదనాయన గారు ఆయన retire అయ్యే సమయానికి మా గ్రామ High school లో పదవ తరగతి కి English బోధించేవారు. నాకు తెలిసీ అప్పట్లో మా పెద నాయన ను మించిన English grammarian మా జిల్లాలోనే లేరేమో అన్నంతగా అనిపించేవారు. ఏమయితేనేం మా పెదనాయన గారు అలా SR Shankaran గారికి మంచి ప్రియ శిష్యుడయ్యాడు. మా పెదనాయన షుమారు మా చుట్టుప్రక్కల అయిదారు మండలాల్లో ఎంతో మందిని తీసుకెళ్ళి నెల్లూరు లో తను చను చదివిన అన్నాధ పాటశాలలో చదివించారు. ఇప్పటికీ ఎన్నో కుటుంభాలు నెల్లూరు జిల్లాలో మా పెదనాయన గారి పేరు తల్చుకొంటుంటారు. తర్వాతి కాలం లో నేను 1995 న నా M.Sc.,M.Phil.,Ph.D గురించి Hyderabad Central Univesity లో Hostel లో ఉంటుండేవాడిని. మా పెద నాయన గారు SR Shankaran గారిని ప్రతి సంవత్సరం ఈఅరోజున అనగా ఆయన పుట్టిన రోజున నా దగ్గరకి వొచ్చి నన్ను తీసుకొని SR Shankaran గారి దగ్గరకు పంజాగుట్టలో ఆయన ఉంటున్న ఇంటికి వెళ్ళేవాళ్ళం. బహుశా ఇలా పదిహేనేళ్ళ పాటు క్రమం తప్పకుండా ప్రతి యేటా SR Shankaran గారి జన్మ దినం రోజున ఉదయాన ఆరుగంటలకు బహుశా ఆయన తలుపు తట్టే మొట్టమొదటి వారము మేమే. ఈ విధంగా SR Shankaran గారు చాలా సుపరిచితులు. ఆయన చనిపోయిన రోజున ఆయన పార్ధీవ దేహాన్ని తన ఇంటిదగ్గర నుండి పంజాగుట్ట స్మశాన వాటిక వరకు మొయడం లో మూడు వైపుల అనేక మంది మారినా, ఒక వైపున పూర్తిగా నేను ఒక్కడినే మోయడం జరిగింది. SR Shakaran గారు ఆ రోజు మా పెద నాయన కు ఉధ్యోగం ఇచ్చిన కారణంగా ఆయన అన్నదమ్ములను అందరినీ చదివించుకొన్నారు ఫలితంగా మేమందరము చదువుకోవడం జరిగింది. మా కుటుంభానికి SR Shankran గారు చేసిన మేలు మరువలేనిది.