10/04/2023
ఉపాధ్యాయ విద్యా రంగ సమస్యలు పరిష్కరించుట గురించి ఈరోజు అనగా తేది 10/04/2023 న జిల్లా పాలనాధికారి గారిని కలిసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ జిల్లా కార్యవర్గ సభ్యులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ వినతి పత్రం ద్వారా వివిధ విద్యారంగ సమస్యలను కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర ప్రభుత్వం గారికి తెలియచేసి పరిష్కరించాల్సిందిగా కోరడం జరిగింది.
ఈ వినతి పత్రం ద్వారా
జూన్ 2023తో ప్రస్తుత వేతన సవరణ కాలం ముగుస్తున్నందున తక్షణమే నూతన PRC కమిటి ని నియమించాలని,317 GO ద్వారా ప్రభావితం అయిన ఉపాధ్యాయులను స్వంత జిల్లాకు పంపాలని, ప్రతి పాఠశాలలో స్కావెంజర్ ను నియమించాలని,పండితుల,PET ల ఉన్నతికరణతో పాటు,బదిలీలు,పదోన్నతుల ను ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేయాలని,ప్రతి నెల 1వ తేదీన జీతాలు జమ చేయాలని,పెండింగ్ లో ఉన్న 3DA లను ప్రకటించి విడుదల చేయాలని,
అదేవిధంగా హెల్త్ కార్డ్స్ అన్ని హాస్పిటల్స్ లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ,KGBV వారికి పే స్కేల్ అమలు చేస్తూ CASUAL లీవ్స్ ను 15 నుండి 27కు పెంచాలని,TSMS ఉపాధ్యాయులకు వేసవిలో బదిలీలు చేపట్టాలని,CPS ను రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ,ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న విద్యా రంగ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని జిల్లా పాలనాధికారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.ఈ కార్యక్రమం లో KB ASIFABAD జిల్లా అధ్యక్షులు బండారి పోషం,జిల్లా గౌరవ అద్యక్షులు తాటి రవీందర్,జిల్లా గౌరవ సలహాదారు ప్రబోధ్ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల మధు వర్మ,జిల్లా కార్యదర్శి కాండ్రాపు మహేష్,జిల్లా ఆర్ధిక కార్యదర్శి మార్కొండ సురేష్ గారు పాల్గొనడం జరిగింది
TPUS KB Asifabad
#తెలంగాణ_ప్రాంత_ఉపాధ్యాయ_సంఘం