05/09/2021
అది చిన్నతనం..ఏది మంచి ఏది చెడు తెలీని తనం .. ఆ వయసులో దిశా నిర్దేశించి తగ్గ ధీమతని మాలో నింపిన తొలి వరస గురువులకు తొలుత ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు. మీరు నేర్పిన విజ్ఞానం సంస్కారం ఎంత
ఆకళింపు చేసుకున్నామో తెలీదు ...కాని నేటి మా స్థానానికి మార్గం మీరే అన్నది ఖచ్చితం.ఇప్పటికీ అంతే చిన్న పిల్లలం..
మాలో ఎందరినో డాక్టర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్టులుగా తత్వవేత్తలుగా లీడర్లుగా తీర్చి దిద్ది బావి తరాలకు దిశా నిర్దేశకులు గా అందించిన మా ప్రియా గురు వర్యులకి "1990 -C" తరుపున గురుపూజోత్సవ శుభాభినందనలు ......