04/03/2025
ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ అధ్యాపక, ఉపాధ్యాయులకు నమస్కారాలతో....
🫱🏻🫲🏼🫱🏻🫲🏼🫱🏻🫲🏼🫱🏻🫲🏼🫱🏻🫲🏼🫱🏻🫲🏼🫱🏻🫲🏼🫱🏻🫲🏼🫱🏻🫲🏼
మన అందరి ఆప్తులు, స్నేహశీలి,*విద్యారంగ-ఉపాధ్యాయుల సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి -శ్రీ గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి* గారి గెలుపు కోసం ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా, *7000 కు పైగా మొదటి మరియు రెండవ ప్రాధాన్యత ఓట్లు వేసిన* మీ అందరికీ *శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాం..*.
మిత్రులారా నిన్నటి ఫలితం చూశాక ఎంతో మనోవేదనకు గురి కావడం వలన ఆలస్యంగా స్పందించడం జరుగుతుంది. అందుకు చింతిస్తూ...
దేశ భవిష్యత్తును నిర్మించే మేధావి వర్గంగా కీర్తించబడే అధ్యాపక,ఉపాధ్యాయుల ప్రతినిధిగా ఉండవలసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో జరిగిన పరిణామాలు, రాజకీయ జోక్యాలు, సైద్ధాంతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడం, అమ్మకాలు-కొనుగోలు, విందులు వినోదాలు మనందరం కల్లారా చూసాం... సమాజం కూడా ప్రతి చర్యను గమనించింది.. ఓరుగల్లులో నెలవైన భద్రకాళి అమ్మవారు ప్రతి ఒక్కరిని,వారి చర్యలను,వ్యవహరించిన విధి విధానాన్ని గమనించింది. అమ్మవారు కచ్చితంగా ప్రతి ఒక్కరికి తగిన రీతిలో ప్రతిఫలం అందజేస్తుంది.
హర్షవర్ధన్ రెడ్డి గారికి వచ్చిన ప్రతి ఓటు కేవలం వారి పనితనాన్ని గుర్తించి మద్దతు తెలిపిన అధ్యాపక ఉపాధ్యాయుల ద్వారా వచ్చినదే, సుమారు 24 వేలకు పైగా ఉన్న ఓటర్లలో మూడో వంతు ఓట్లు వేసిన వారిని ఒక్కొక్కరిగా గుర్తించడం కష్టంతో కూడుకున్నది అయినప్పటికీని, ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా హర్షవర్ధన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడమే కాకుండా ఇతరుల ద్వారా హర్షవర్ధన్ గారికి ఓటు వేయించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో సంఘం అండగా నిలబడుతుంది మరియు మీరందరూ గర్వపడేలా రానున్న రోజుల్లో రాష్ట్ర సంఘం పక్షాన చేసే ప్రాతినిధ్యాలు సమస్యల పరిష్కారాలు, వివిధ రీతులుగా హేళన చేసిన వారిని సైతం మెప్పించే విధంగా, వారిలో పరివర్తన తీసుకుని వచ్చే విధంగా రెట్టింపైన బాధ్యతతో కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం.
మిత్రులారా క్యాడర్ లేదనో స్థానికత లేదనో ఎన్నికల అప్పుడు వచ్చి వెళ్తారనో ఏ విధంగా హేళన చేసిన, సంస్కారహీనంతో కూడిన మెసేజ్లు పోస్ట్ చేసినప్పటికీ వారిలోని సంస్కారహీనతను కాకుండా ఆ మెసేజ్ ల ద్వారా మా బాధ్యతను గుర్తు చేసినందుకు వారి క్షేమం కోసం కూడా సంఘం పనిచేస్తుంది.
హర్షవర్ధన్ రెడ్డి గారి గెలుపు కోసం స్వచ్ఛందంగా సెలవులు పెట్టుకుని ఆర్థికంగా నష్టం జరిగిన సొంతంగా ఖర్చులు భరించుకుంటూ సుమారు నెలరోజుల పాటు అహోరాత్రులు అహర్నిశలు అలసట అనేది దరిచేరకుండా ఇన్ని వేల ఓట్లు రావడానికి శక్తికి మించి కృషి చేసిన ప్రతి ఒక్కరిని రాష్ట్ర సంఘం కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది.
అదేవిధంగా TJAC రాష్ట్ర కార్యవర్గానికి మరియు భాగస్వామ్య సంఘాలలోని అన్ని స్థాయిలలోని నాయకులకు కూడా పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇదే ఐక్యతతో మరింత సమర్థవంతంగా పనిచేస్తూ అధ్యాపక,ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని కోరుకుంటున్నాం.
చివరగా...
మందు,విందు, మనీ మాత్రమే ఎల్లవేళలా అన్నిచోట్ల పనిచేయవని,వాటి ద్వారా వచ్చినది ఏదీ శాశ్వతం కాదని, అక్రమ మార్గంలో పొందినది ఏదో ఒక రోజు అర్ధాంతరంగా ఊడిపోక తప్పదని, ధర్మబద్ధంగా చేసిన యుద్ధమే నిజమైన యుద్ధమని దాని ఫలాలు తప్పకుండా లభిస్తాయని తెలియచేస్తూ...
గార్లపాటి ఉమాకర్ రెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు
డా.పర్వతి సత్యనారాయణ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి