SiliconAndhra ManaBadi

SiliconAndhra ManaBadi

Ashburn, VA Manabadi invites everyone to join hands in promoting "Telugudanam" across the world. Let

Operating as usual

11/27/2024

ధన్వవాదోత్సవ శుభాకాంక్షలు 🙏

10/30/2024

దీపకాంతుల విరిజల్లు
సుఖసంతోషాల హరివిల్లు

10/12/2024

చల్లని చూపుల మాతల్లి!

10/01/2024

గాంధీ తాతకు జేజేలు 🙏🙏🙏

09/26/2024

అమ్మ ఒడి + అమ్మ నుడి = బాల బడి !

09/21/2024

SiliconAndhra ManaBadi Registrations for 2024-25 Last Call

09/17/2024

Parents, registrations will close on September 20th 2024. Please complete your registrations before that. Thank you!

09/11/2024

మన అందరి కోసం.. తెలుగు భాష
మన పిల్లల కోసం.. మనబడిలో మాతృభాష
Each One, Reach One!

Photos from SiliconAndhra ManaBadi's post 09/10/2024

క్రితం వారాంతము అమెరికా/కెనడాలలో దాదాపు 200 నగరాలలో, 11,000 మందికి పైగా తెలుగు పిల్లలతో తరగతులు ప్రారంభమయ్యాయి.
తల్లిదండ్రులకు, గురువులకు, సమన్వయకర్తలకు నమస్సుమాంజలితో శుభాభినందనలు!
మీరు ఇంకా మీ పిల్లల్ని మనబడిలో చేర్పించడానికి ఆలోచిస్తున్నారా?
ఆలస్యం చేయకండి!
సెప్టెంబర్ 20న నమోదులు పూర్తవుతాయి!
మనబడిలో చేర్పించండి, తెలుగు భాష నేర్పించండి!

09/09/2024

భాషని శ్వాసగా మలిచిన ప్రజాకవి కాళోజి జయంతిన తెలంగాణా భాషాదినోత్సవ జేజేలు!

09/06/2024

మీకు తెలుగులో మాట్లాడడం వచ్చా? ఒక నిమిషం సేపు పరభాషాపదాలు వాడకుండా, ఉచ్చారణాదోషాలు లేకుండా, వ్యాకరణలోపాలు రాకుండా మాట్లాడగలరా? ఇచ్చిన అంశం గురించి అప్పటికప్పుడు ఆలోచించి, అదే విషయం మీద ఉంటూ, అర్థవంతంగా మాట్లాడగలరా?

Aug 18, 2024 నాడు డెట్రాయిట్ మహానగరంలో జరిగిన సిలికానాంధ్రా మనబడి తెలుగు మాట్లాట అంతర్జాతీయ పోటీలలో సిసింద్రీలు వయోవిభాగంలో ఒనిమా (ఒక్క నిమిషం మాత్రమే) ఆటల పోటీలో అంతిమ ఆవృతంలో మాట్లాడిన మన తెలుగు యువ రత్నాలు! ఈ బంగారుకొండల్లా మీరు మాట్లాడగలరా?!

ఈ పిల్లల మాటలు వింటే వీరు ప్రవాసంలో పుట్టి పెరిగిన పిల్లలు అని ఎవరైనా నమ్ముతారా? వీరిని చూస్తే మన తెలుగుభాష మాధుర్యం ప్రవాసాంధ్రులలో ఇంకొన్ని తరాలు పదిలంగా నిలుస్తుందన్న గట్టి నమ్మకం కలుగుతుంది! ఈ పిల్లలకు, వారి తల్లిదండ్రులకు జోహార్లు!

వినూత్నమైన తెలుగు మాట్లాట ఆటల పోటీలు గత 11 సంవత్సరాలుగా మనబడి నిర్వహిస్తూ, తెలుగు పిల్లలకు మాతృభాషను దగ్గర చేయడానికి కృషి చేస్తున్నది. రండి, మీరు కూడా మీ పిల్లలని మనబడిలో చేర్పించండి! మాతృ భాష నేర్పించండి! వివరాలకు: https://manabadi.siliconandhra.org/register

* చంద్రపట్ల యిషిత (అంశం: తల్లిదండ్రులు ధనవంతులైతే కష్టపడడం అవసరం లేదా?)
* దత్ అభిరామ్ (అంశం: పెళ్ళి వేడుకలకి లక్షలు ఖర్చు పెట్టడం మంచిదా?)
* తేజస్వి దీవి (అంశం: విద్యుచ్ఛక్తి కార్లు పర్యావరణకు మంచివా?)
* గరిమెళ్ళ భాను (అంశం: దేశాల మధ్య యుద్ధాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి?)
* శ్రీకాకుళం శ్రీనిక (అంశం: చదువుకోకున్నా డబ్బు సంపాదించవచ్చా?)
* ఉప్పల హేమ భూమిజ (అంశం: నేటి ప్రపంచంలో గ్రంథాలయాలు అవసరమా?)

09/05/2024

గణపతి దేవా, చదువులనొసగు
తెలుగు పిల్లలకి భాషని పొసగు

09/05/2024

గత 17 సంవత్సరాలుగా 100,000 విద్యార్థులు మనబడిలో తెలుగు నేర్చుకున్నారు. ఈ యజ్ఞంలో ముఖ్యంగా పాల్గొన్న గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాభినందనలు!
ఈ వారాంతంలో 2024-25 క్రొత్త విద్య సంవత్సరం ప్రారంభంకానున్నది. మనబడిలో చేర్పించండి. తెలుగు భాష నేర్పించండి!

Photos from SiliconAndhra ManaBadi's post 09/03/2024

తెలుగు మాట్లాట పోటీల్లో గెలవాలంటే భాషపై గట్టి పట్టు, ఉన్నతమైన విషయ పరిజ్ఞానము తోబాటు, గెలవాలన్న పట్టుదల, గెలుస్తానన్న ఆత్మ విశ్వాసం, ప్రశాంతమైన మనసు, అమితమైన ఏకాగ్రత: ఇటువంటి నాయకత్వపు లక్షణాలు మెండుగా ఉండాలి. అది ఎంతో అరుదు; అందుకే తెలుగు మాట్లాట విజేతలు మెరిసే రత్నాలు! అటువంటిది, ఒక ఆటలోనే కాక, రెండు ఆటల్లో నెగ్గిన పిల్లలు నిజమైన శిరోరత్నాలు! 11 ఏళ్ళ తెలుగు మాట్లాట చరిత్రలో రెండు ఆటలలో గెలిచిన పిల్లలు వీరు:
* సాహితి మాదిరెడ్డి: 2014
* స్రవంతి మానికొండ: 2016
* చక్రికా కొణతాలపల్లి: 2023
* తేజస్వి దీవి: 2024

ఇటువంటి మేటి రత్నాలను వెలికి తీసి, ప్రోత్సహించి, తెలుగు భాష నేర్చుకోవడం పట్ల తెలుగు కుటుంబాలకు, పిల్లలకు స్ఫూర్తినిస్తుంది SiliconAndhra ManaBadi. 2024 - 2025 విద్యా సంవత్సరం తరగతులు September 7 & 8, 2024 వారాంతం మొదలు కానున్నాయి! తప్పక మీ పిల్లలను మనబడిలో చేర్పించండి - తెలుగు భాష నేర్పించండి! మిగతా వివరాలకు: https://manabadiportal.siliconandhra.org/register

Gautam Kasturi Vijaya Bhaskar Rayavaram Anand Kuchibhotla Santhi Kuchibhotla Danji Thotapalli Srinivas Nidamarthi Phani Madhav Kasturi Raju Chamarthi Kiran Parupudi Kalyan Rachakonda

Want your school to be the top-listed School/college in Ashburn?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


23415 Evergreen Ridge Drive
Ashburn, VA
20148

Opening Hours

4pm - 6pm